Telangana

News July 24, 2024

HYD: చిన్నారిపై కుక్కల దాడి

image

హైదరాబాద్‌లో కుక్కల దాడి రోజురోజుకీ పెరుగుతోంది. అయినప్పటికీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లాలో సైతం ఈరోజు ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో జరగగా.. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.

News July 24, 2024

కామారెడ్డి: ఫామ్‌హౌస్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

image

కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలోని ఒక ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య తన సిబ్బందితో బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో 9 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ. 1,12,800 నగదు, రెండు కార్లు, 4 బైక్‌లు, 10 మొబైల్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దేవుని పల్లి పోలీసులకు అప్పగించారు.

News July 24, 2024

అప్పుల బాధ తాళలేక మహిళ ఆత్మహత్య

image

తిప్పర్తి: అప్పుల బాధ తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మామిడాలలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మి(40) అప్పులు అధికం కావడంతో తీర్చలేక మనస్తాపానికి గురై ఈనెల 21న పురుగు మందు తాగింది. నల్లగొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కూతురు జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News July 24, 2024

పార్లమెంట్ వద్ద నిరసనలో పాల్గొన్న వరంగల్ ఎంపీ కావ్య

image

కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు ఈరోజు ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో తోటి ఎంపీలతో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కావ్య మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో నిరసన తెలిపారు.

News July 24, 2024

బిచ్కుంద: కరెంట్ షాక్ తగిలి రైతు మృతి

image

కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన బిచ్కుంద మండలంలో మంగళవారం జరిగింది. SI మోహన్ రెడ్డి వివరాలిలా.. మండలంలోని రాజాపూర్ వాసి కొత్త రాములు అతని పొలంలో నాటు వేస్తుండగా.. పొలం మధ్యలో పడి ఉన్న కరెంట్ వైరును గమనించాడు. దాన్ని తీసే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.

News July 24, 2024

అన్నపూర్ణ క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా కేంద్రంలోని రైతు బజార్ పక్కన ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ ను బుధవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పెడుతున్న రూ.5ల భోజనాన్ని పరిశీలించారు. భోజనం చేస్తున్న వారిని భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ పరిసరాలలో పూర్తి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News July 24, 2024

NRPT: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు

image

జిల్లాలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయుటకు అర్హులైన వైద్య నిపుణులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. డి రామ్ కిషన్ కోరారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో ఈనెల 25 నుంచి ఆగస్టు3 వరకు ఉదయం 10 నుంచి సా.4 వరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షణలో కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

News July 24, 2024

మందమర్రి: సింగరేణి సేవా సమితి ద్వారా మహిళలకు రాత పరీక్షలు

image

మందమర్రి ఏరియాలో సింగరేణి సేవా సమితి ద్వారా 2023-24ఆర్థిక సంవత్సరంలో వృత్తి శిక్షణ కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు రాత పరీక్షలు నిర్వహించారు. అనంతరం శిక్షణ పొందిన 187 మంది మహిళలకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. జీఎం ఏ.మనోహర్, సేవా అధ్యక్షురాలు సవిత మనోహర్ మాట్లాడుతూ.. మహిళలు అవకాశాలను వినియోగించుకుని స్వయం ఉపాధి సంపాదించుకుని కుటుంబాలకు మార్గదర్శకంగా నిలబడాలన్నారు.

News July 24, 2024

ఆగస్టు 15 నాటికి రూ.50 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం: కలెక్టర్

image

ఆగస్టు 15 నాటికి ₹50 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, అర్హులను వెంటనే గుర్తించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో బుధవారం మహిళా శక్తి పథకం కింద రుణాలను మంజూరు చేయుటకు యూనియన్ బ్యాంక్ ఆర్ఎచ్ అరుణ సవితా ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్‌లు, ఎస్ఈఆర్పీ, మెప్మా బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పలువురు బ్యాంక్ అధికారులు తదితరులున్నారు.

News July 24, 2024

ఆదిలాబాద్: కేంద్ర రహదారుల శాఖ మంత్రిని కలిసిన ఎంపీ నగేశ్

image

కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ బుదవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. NH 44 బోరజ్ నుంచి ఉపాస్నాల (మహారాష్ట్ర) గల 33 కి.మీ. రోడ్డును కేవలం 2 వరసల రోడ్డు మాత్రమే మంజూరు చేసినందున.. దీనిని కూడా 4 వరసల రహదారులుగా మార్చాలని మంత్రికి విన్నవించారు. మంత్రి స్పందిస్తూ 4వరుసలుగా మార్చడానికి కొత్తగా మరో డీపీఆర్‌ను తయారు చేయవలసిందిగా అధికారులను ఆదేశించినట్లు ఎంపీ తెలిపారు.