Telangana

News July 24, 2024

NRPT: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు

image

జిల్లాలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయుటకు అర్హులైన వైద్య నిపుణులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. డి రామ్ కిషన్ కోరారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో ఈనెల 25 నుంచి ఆగస్టు3 వరకు ఉదయం 10 నుంచి సా.4 వరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షణలో కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

News July 24, 2024

లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం: ప్రభుత్వం మహిళా శక్తి కింద చేపట్టిన వివిధ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపిక  పకడ్బందీగా చేయాలని  జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని అధికారులతో మహిళా శక్తి కార్యక్రమ యూనిట్లపై సమీక్ష నిర్వహించారు. మండల వారిగా మహిళా శక్తి కార్యక్రమ కార్యాచరణ చేయాలన్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతంలో ఉన్న డిమాండ్ ను బట్టి యూనిట్ల ఎంపిక చేయాలన్నారు.

News July 24, 2024

డిగ్రీ (CBCS) రివాల్యుయేషన్.. తేదీ ఇదే..!

image

TU పరిధిలోని డిగ్రీ (CBCS) రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ (రెగ్యులర్) ఒకటవ మూడవ, ఐదవ సెమిస్టర్ (బ్యాక్ లాగ్) పరీక్షల రివాల్యుయేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం. అరుణ బుధవారం తెలిపారు. ఆగస్టు 3 నుంచి 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రివల్యూషన్ ఫీజు ఒక్కొక పేపర్ కు రూ.500 చెల్లించాలని పేర్కొన్నారు.

News July 24, 2024

జ్యూట్ బ్యాగ్స్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నందు బుధవారం కాంగ్రెస్ నేత చింతనిప్పు కృష్ణచైతన్య ఆధ్వర్యంలో తయారుచేసిన జ్యూట్ బ్యాగులను జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా జ్యూట్ బ్యాగులను ఉపయోగించాలన్నారు. సామాజిక బాధ్యతతో జ్యూట్ బ్యాగులను వాడాలని పేర్కొన్నారు.

News July 24, 2024

లక్నవరం: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

image

ములుగు జిల్లా కన్నాయిగూడెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు యాట సాంబయ్య(66) లక్నవరం చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. చేపల వేటకు వలలు వేస్తున్న క్రమంలో కాళ్లకు వల చుట్టుకుని ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 24, 2024

MBNR: ఒక్క మెసేజ్‌.. కొంప ముంచింది..!

image

కొత్తకోటకు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌కి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏపీకే పేరుపై లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేయడంతో అతడి బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేశారు. ఖాతాలో ఉన్న రూ.2.44 లక్షలతో వస్తువులను కొనుగోలు చేసినట్లు మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసి ఖంగుతిన్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెబ్బేరుకు చెందిన ఓ వ్యక్తికి అమ్మాయి పేరుతో మెసేజ్ చేసి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి రూ. 4 లక్షలు వసూలు చేశారు.

కామారెడ్డి: బోడ కాకరకాయ కేజీ రూ. 280

image

బోడ కాకరకాయలకు మార్కెట్లో భలే డిమాండ్ పెరిగింది. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఈ బోడ కాకరకాయలను ఇష్టంగా తీంటారు. దీంతో బోడ కాకరకాయలకు మార్కెట్లో రేటు విపరీతంగా పెరిగిపోయింది. కేజీ  రూ.280 మార్కెట్లో అమ్ముతున్నారు. అయినప్పటికీ వాటిని పలువురు కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోడ కాకరకాయలు మార్కెట్లోకి వస్తాయి. మార్కెట్లో ధర ఎక్కువ ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నారు.

News July 24, 2024

బొగత జలపాతానికి పోటెత్తిన వరద

image

ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో గల బొగత జలపాతం ఉదృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తడంతో సందర్శకులను నిలిపివేశారు. వరద ఉధృతి తగ్గేవరకు నీటిలోకి ఎవరు దిగవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. జలపాతం ప్రమాదకర స్థాయిలో ప్రవేశించడంతో అటవి శాఖ అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేశారు.