Telangana

News July 24, 2024

కరీంనగర్ : బీఈడీ పరీక్ష ఫలితాలు విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీఈడీ (ప్రథమ సెమిస్టర్) ఫలితాలను విడుదల చేసినట్లు శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డా. శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటన లో తెలిపారు. పరీక్ష ఫలితాలను www.satavahana. ac.inలో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రకటనలో పేర్కొన్నారు.

News July 24, 2024

KTRకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

image

హైదరాబాద్‌లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRని మాజీ మంత్రి గుంత కండ్ల జగదీశ్ రెడ్డి కలిశారు. బుధవారం పుట్టినరోజు జరుపుకుంటున్న కేటీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువ కప్పి సన్మానం చేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు.

News July 24, 2024

సదాశివనగర్: 44వ నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి కుంగలేదు: NHAI

image

సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామశివారులో 44 నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి కుంగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం హైవే అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వచ్చి రోడ్డును పరిశీలించారు. రోడ్డు కుంగలేదని, ఒక ఇనుప పట్టి విరిగిందని, దాని పక్కన ఉన్న డాంబర్ వర్షపు తాకిడికి లేచిందని అధికారులు తెలిపారు.

News July 24, 2024

HYD: మొయినాబాద్ PS పరిధిలో 144 సెక్షన్ అమలు

image

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకూరు గ్రామంలో మంగళవారం జరిగిన మసీదు నిర్మాణ పనులను నిలిపివేయాలని RSS, బజరంగ్‌దళ్, బీజేపీ నాయకులు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం బీజేపీ నాయకులు ‘చలో చిలుకూరు’కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో మొయినాబాద్ PS పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

News July 24, 2024

HYD: మొయినాబాద్‌ PS పరిధిలో 144 సెక్షన్ అమలు

image

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకూరు గ్రామంలో మంగళవారం జరిగిన మసీదు నిర్మాణ పనులను నిలిపివేయాలని RSS, బజరంగ్‌దళ్, బీజేపీ నాయకులు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం బీజేపీ నాయకులు ‘చలో చిలుకూరు’కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో మొయినాబాద్ PS పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

News July 24, 2024

సంగారెడ్డి: ఒక్క మెసేజ్‌.. రూ.98.40 లక్షలు కొట్టేశారు..!

image

ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో ఆదాయం లభిస్తుందన్న ఆశతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.98.40 లక్షలు పోగొట్టుకున్నాడు. పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాలు.. AR బృందావనం కాలనీలో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫోన్‌కు గత నెల 17న ఓ మెసేజ్ వచ్చింది. లింక్ క్లిక్ చేసి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసేందుకు ముందుగా రూ.10వేలతో ప్రారంభించి, విడతల వారీగా రూ.98.40లక్షలు పెట్టుబడులు పెట్టి మోసపోయాడు. జర జాగ్రత్త!

News July 24, 2024

కమనీయం రాములోరి నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News July 24, 2024

జాతీయస్థాయి వికసిత్ భారత్ పోటీల్లో PU విద్యార్థిని సత్తా

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “వికసిత్ భారత్” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని కొండ ప్రణవి ప్రతిభ చూపించారు. ఈ పోటీల్లో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలోని నిజామాబాద్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు.

News July 24, 2024

ప్రధాని హామీ ఇచ్చినా.. పాలమూరుకు మొండి చెయ్యి

image

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర బడ్జెట్‌లో మరోసారి మొండి చేయి చూపింది. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తానని ప్రకటించారు. జాతీయ హోదా సంగతి అటుంచితే ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులు ఇవ్వడం లేదు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన కేంద్రం పాలమూరుకు మాత్రం ఏమాత్రం కేటాయించలేదు.

News July 24, 2024

కొల్లాపూర్: నీట మునిగిన శ్రీ సంగమేశ్వరం

image

కొల్లాపూర్ తీరానికి సమీపంలోని సోమశిలలో సప్త నదుల ప్రాంతం శ్రీ సంగమేశ్వర క్షేత్రం చుట్టూ కృష్ణా నది వరదతో ఆలయంలోని వేపదారు శివలింగం నీట మునిగింది. జటప్రోల్లో పురాతన దర్గా, సురభి రాజుల భవనం చుట్టూ వరదలాలు ప్రవహించాయి. మత్స్యకారులు తీరం వెంబడి ఏర్పరచుకున్న తాత్కాలిక నివాసాలను ఎగువ ప్రాంతానికి తరలించారు. పుష్కర ఘాట్లకు వరద వచ్చి చేరింది. 842 అడుగులకు పైగా వరద జలాలు శ్రీశైలం వైపు ప్రవహిస్తున్నాయి.