India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర బడ్జెట్‌లో మెదక్ జిల్లాకు ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేవు. మొండి చేయి చూపించడంతో మెదక్ ప్రజలు నిరాశకు గురయ్యారు. కేంద్రీయ, నవోదయ పాఠశాలల మంజూరు కాలేదు. అలాగే అత్యవసరంగా నిర్మించాల్సిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిలకు కేటాయింపులు లేవు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దేవస్థానం పర్యటక అభివృద్ధి కోసం నిధులు కేటాయించకపోవడంపై జిల్లా వాసుసు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్కూల్, కాలేజీ బస్సులు ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై శాసన సభలో ఎమ్యెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు. ప్రయాణికులకు, విద్యార్థులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను పెంచుతామని తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను మే 15న ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తామని, విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.30 లక్షల ప్రమాద బీమాను HDFC బ్యాంకు ద్వారా వర్తింపజేస్తున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. HDFC బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఉద్యోగికి ఇది అమలు అవుతుందన్నారు. ఆగస్టు నెల నుంచి కాంట్రాక్ట్ కార్మికులందరికీ దీనిని వర్తింపజేస్తామని వారు పేర్కొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు తగ్గాయి. తేజ మిర్చి మంగళవారం క్వింటాకు రూ.17,500 పలకగా.. నేడు రూ.17,200కి పడిపోయింది. 341 రకం మిర్చి నిన్న రూ.14,500 పలకగా.. నేడు రూ.13,300కి పడిపోయింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి మాత్రం నిన్నటి లాగే రూ.16,000 ధర వచ్చింది.
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 16 మందిని బలిగొన్న ఘోర రైలు ప్రమాద దుర్ఘటనకు పదేళ్లు నిండాయి. 2014లో సరిగ్గా ఇదే రోజు తూప్రాన్‌కు చెందిన కాకతీయ టెక్నో స్కూల్ బస్సు కిష్టాపూర్, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్ చిన్నారులతో వెళ్తుండగా మాసాయిపేట లెవెల్ క్రాసింగ్ వద్ద రైలు ఢీకొట్టడంతో 16 మంది చనిపోయిన విషయం తెలిసిందే. నేటికీ ఆ ఘటన తలుచుకొని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
భూ సంస్కరణల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య(భూఆధార్)ను కేటాయించాలని, పట్టణ భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో భూసంబంధిత సమస్యలకు పరిష్కారం లభించనుంది. కామారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 3,12,987, పట్టణాల్లో 1,02,456 ఎకరాల భూమి ఉంది. నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 4,03,312 పట్టణ ప్రాంతాల్లో 2,08,800 ఎకరాల భూమి ఉంది.
దేవాదయ శాఖలో 20 ఏళ్ల తర్వాత బదిలీలు కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1340 దేవాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం పొందుతున్నవారు 236 మంది ఉన్నారు. ఉద్యోగుల పూర్తి వివరాలను రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి పంపించినట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఈనెల 29 వరకు బదిలీల ప్రక్రియ పూర్తి కానుంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాల్లో 15.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా సిరిసినగండ్లలో 13.5 మి.మీ, నారాయణపేట జిల్లా బిజ్వార్‌లో 8.8 మి.మీ వనపర్తి జిల్లా సోలిపూర్‌లో 6.8 మి.మీ, గద్వాల జిల్లా రాజోలిలో 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ట్రేడింగ్‌లో లాభాలిప్పిస్తామని సైబర్ నేరగాళ్లు రూ.3.5 లక్షలు లూటీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD చెందిన వ్యాపారవేత్తకు ఓ లింక్ ద్వారా క్వాంటమ్ క్యాపిటల్ యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. మొదటగా బిట్ కాయిన్ పై కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.3.5 లక్షలు పెట్టుబడి మోసపోయాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ట్రేడింగ్‌లో లాభాలిప్పిస్తామని సైబర్ నేరగాళ్లు రూ.3.5 లక్షలు లూటీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD చెందిన వ్యాపారవేత్తకు ఓ లింక్ ద్వారా క్వాంటమ్ క్యాపిటల్ యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. మొదటగా బిట్ కాయిన్ పై కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.3.5 లక్షలు పెట్టుబడి మోసపోయాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Sorry, no posts matched your criteria.