Telangana

News July 24, 2024

‘PU అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలి’

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ఇటీవలే వెలువడిన సెమిస్టర్-6 ఫలితాలు వెలువడ్డాయి. ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని PU పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో సెమిస్టర్-6 చదివి ఫెయిల్ అయిన విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను కోరుతున్నారు. అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించకపోతే ఒక సంవత్సరం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News July 24, 2024

కరీంనగర్: లారీ ఢీకొని యువకుడి మృతి

image

లారీ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లికి చెందిన గుండ్ల శ్రీనివాస్(27) సుల్తానాబాద్‌లో ఉంటున్న తన మిత్రుడి దగ్గరికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. స్థానికులు వెంటనే కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 24, 2024

బొగత జలపాతం సందర్శన బంద్

image

బొగత జలపాతం సందర్శన నేటి నుంచి నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ రేంజర్ చంద్రమౌళి తెలిపారు. వర్షాల కారణంగా జలపాతం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందన్నారు. పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా సందర్శన నిలిపివేస్తున్నామన్నారు. ప్రవాహం తగ్గిన అనంతరం తిరిగి సందర్శన ప్రారంభిస్తామన్నారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి సందర్శనకు రావొద్దని కోరారు. కాగా జలపాతంలో నిన్న ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.

News July 24, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం
ఇన్ ఫ్లో : నిల్
ఔట్ ఫ్లో: 8,714 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటిమట్టం: 590 అడుగులు
ప్రస్తుతం: 503.60 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.5050 టీఎంసీలు
ప్రస్తుతం: 121.0608 టీఎంసీలు
కుడి కాలువకు: 5,496 క్యూసెక్కులు
ఎడమ కాలువకు: 2,818 క్యూసెక్కులు
మాధవరెడ్డి ప్రాజెక్టుకు: 400 క్యూసెక్కులు

News July 24, 2024

వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో 3 రోజులుగా పత్తి ధర స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. సోమవారం రూ.7,150 పలికిన క్వింటా పత్తి ధర మంగళవారం రూ.7,180కి చేరింది. నేడు మరికొంత పెరిగి రూ.7,230 అయింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు తేమ లేని, నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకురావాలని వ్యాపారులు సూచిస్తున్నారు.

News July 24, 2024

నల్గొండ: 26న కార్గిల్ సిల్వర్ జూబ్లీ విజయ్ దివస్

image

కార్గిల్ సిల్వర్ జూబ్లీ విజయ్ దివస్‌ను ఈ నెల 26న నల్గొండ పట్టణంలోని పానగల్ రోడ్డులో గల రీజనల్ సైనిక్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంది పాపిరెడ్డి, కొల్లోజు వెంకటాచారి ఓ ప్రకటనలో తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మాజీ సైనికులు, అమరులైన, మరణించిన సైనికుల కుటుంబ సభ్యులు హాజరుకావాలని కోరారు.

News July 24, 2024

మంచిర్యాల: 40రోజుల పాపకు ఆధార్ కార్డు

image

పుట్టిన 40రోజులకే ఆధార్‌కార్డు పొందిన అతి పిన్న వయస్కురాలిగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో ఐజాల్ ఫాతిమా స్థానం పొందింది. నస్పూర్‌కు చెందిన అఫ్జల్ పాషా-సమీరాతబస్సుమ్ దంపతులకు 2024జనవరి12న కుమార్తె ఐజాల్ ఫాతిమా జన్మించింది. ఫిబ్రవరి 21న ఆధార్‌కార్డు పొందింది. దీంతో చిన్నారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించింది. 43రోజుల పాత రికార్డును ఫాతిమా అధిగమించింది.

News July 24, 2024

నల్గొండ: ఎంజీయూలో మూడు రోజులు శిక్షణ

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా భూగర్భ జలాల మూలాలు సుస్థిరత, నిర్వహణపై విద్యార్థులకు ఈనెల 24 నుంచి 26 వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులందరు హజరు కావాలని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ శాస్త్రవేత్త విఠల్, జియాలజీ విభాధిపతి మధుసూదన్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

News July 24, 2024

బడ్జెట్‌లో హైదరాబాద్‌కు నిరాశ!

image

కేంద్ర బడ్జెట్‌లో HYDకు ప్రాధాన్యత దక్కలేదని‌ తెలంగాణవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణకు‌ నిధులు ఇవ్వాలని INC ప్రభుత్వం కోరినా.. కేటాయింపులు ఇవ్వలేదన్నారు. మూసీతో పాటు జంట జలాశయాలకు గోదావరి జలాల తరలింపు కోసం రూ. 10 వేల కోట్లు అడిగితే పైసా ఇవ్వలేదని‌ కాంగ్రెస్ ‌నేతలు విమర్శించారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో‌నూ ఇదే అంశాన్ని లేవనెత్తనున్నట్లు సమాచారం.

News July 24, 2024

బడ్జెట్‌లో హైదరాబాద్‌కు నిరాశ!

image

కేంద్ర బడ్జెట్‌లో HYDకు ప్రాధాన్యత దక్కలేదని‌ తెలంగాణవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణకు‌ నిధులు ఇవ్వాలని INC ప్రభుత్వం కోరినా.. కేటాయింపులు ఇవ్వలేదన్నారు. మూసీతో పాటు జంట జలాశయాలకు గోదావరి జలాల తరలింపు కోసం రూ. 10 వేల కోట్లు అడిగితే పైసా ఇవ్వలేదని‌ కాంగ్రెస్ ‌నేతలు విమర్శించారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో‌నూ ఇదే అంశాన్ని లేవనెత్తనున్నట్లు సమాచారం.