India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రియురాలు మృతి చెందటంతో మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని వందనం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సతీశ్(24) గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. రెండు వారాల క్రితం యువతి అనారోగ్యంతో మృతిచెందగా మనస్తాపానికి గురై యువకుడు ఉరేసుకున్నాడు. ఎస్సై నాగుల మీరా కేసు నమోదు చేశారు.
యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రధాని 5 ప్యాకేజీలు ప్రవేశపెట్టారు. ఉద్యోగులతో పాటు ఉద్యోగాలు ఇచేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఉద్యోగంలో చేరిన ఫస్ట్ నెల సాలరీ 3 వాయిదాల్లో రూ.15వేల వరకు ప్రభుత్వం చెల్లించనుంది. గరిష్ఠంగా లక్షలోపు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. ఉమ్మడి జిల్లాలో యూత్ 3.25 లక్షలు ఉన్నారు. అందులో నిరుద్యోగులు 68 వేల మంది ఉన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ఉపయుక్తంగా మారనుంది.
బొగత జలపాతంలో నీట మునిగి మంగళవారం ఒకరు <<13691227>>మృతి చెందిన<<>> విషయం విదితమే. ఎనుమాముల మార్కెట్ సమీపంలోని సుందరయ్యనగర్‌కు చెందిన జశ్వంత్(19) స్నేహితులతో కలిసి బొగత సందర్శనకు వెళ్లాడు.స్నేహితులందరూ ఈత కొట్టేందుకు కొలనులో దిగారు. ఈక్రమంలో జశ్వంత్ నీట మునిగాడు.గంటసేపు శ్రమించగా అతడి మృతదేహం రక్షణ సిబ్బందికి దొరికింది. ఒక్కగానొక్క కొడుకుకు 19 ఏళ్లకే నూరేళ్లు నిండాయా అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
కల్కి సినిమా డైరక్టర్ నాగ్ అశ్విన్ MBNR జిల్లా కేంద్రంలోని ఏవీడీ సినిమాస్ (థియేటర్)కు మంగళవారం రావడంతో ఆయన్ను చూస్తేందుకు యువత, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అభిమానులను ఉద్దేశించి నాగ్ మాట్లాడుతూ.. మన జిల్లాకు రావడం సంతోషంగా ఉందని, తమ ఫ్యామిలీ అందరూ ఇక్కడి వారే కావడం, కల్కి సినిమా ఇక్కడ పెద్దగా ఆడడం సంతోషంగా ఉందన్నారు. ప్రభాస్ అభిమానులకు, ఉమ్మడి జిల్లా సినిమా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వివిధ వర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రధానంగా ఈసారి బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేకపోవడం పాలమూరు ప్రజల్ని నిరాశకు గురిచేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై, కొత్తగా నిర్మించ తలపెట్టిన రైల్వేలైన్ల నిర్మాణంపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు చేపట్టినట్లు సెర్ఫ్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కరుణాకర్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా మహిళా సమాఖ్య భవనంలో ఇంటర్వ్యూ ద్వారా ఎస్ఆర్పీల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 23 మంది ఎస్ఆర్పీలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ వాహనదారులకు ముఖ్యగమనిక. అంబర్‌పేట ఫ్లై ఓవర్ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే 6 నంబర్ నుంచి అంబర్‌పేట జంక్షన్ వరకు రోడ్డు క్లోజ్ చేశారు. ఇక నేటి నుంచి 6 నంబర్ నుంచి గోల్నాక రూట్ కూడా బంద్ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. జిందా తిలిస్మత్ మీదుగా గోల్నాక చేరుకోవచ్చు. పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని రూట్ మ్యాప్ విడుదల చేశారు.
హైదరాబాద్ వాహనదారులకు ముఖ్యగమనిక. అంబర్‌పేట ఫ్లై ఓవర్ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే 6 నంబర్ నుంచి అంబర్‌పేట జంక్షన్ వరకు రోడ్డు క్లోజ్ చేశారు. ఇక నేటి నుంచి 6 నంబర్ నుంచి గోల్నాక రూట్ కూడా బంద్ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. జిందా తిలిస్మత్ మీదుగా గోల్నాక చేరుకోవచ్చు. పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని రూట్ మ్యాప్ విడుదల చేశారు.
> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు చోట్ల వర్షాలు
> క్రమేపీ తగ్గుముఖం పడుతున్న గోదావరి నది ప్రవాహం
> లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు నుండి కలగనున్న ఉపశమనం
> నేడు భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు
> భద్రాద్రి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
సీజనల్ వ్యాధుల నివారణకు సత్వరమే ఇంటింటి జ్వర సర్వేను చేపట్టాలని అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. మలేరియా, డెంగ్యూను నిరోధించేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.