Telangana

News July 24, 2024

గరిడేపల్లి: విధుల్లో నిర్లక్ష్యం.. పోలీసులు సస్పెండ్

image

గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లోని ఓ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈనెల 6న బ్యాటరీల దొంగతనం కేసులో ఓ వ్యక్తిని పీఎస్‌లో విచారణకు తీసుకువచ్చారు. కాగా, నిందితుడు అదే రోజు రాత్రి గోడ దూకి పారిపోయాడు. 2 రోజుల తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

News July 24, 2024

NZB: ఇళ్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్

image

ఇళ్లు లేని వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. PM ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేళ్లకూ రూ.2.2 లక్షల కోట్లు ప్రతిపాదించింది. ఈ పథకంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి రుణాలు తీసుకునే వారికి వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో KMR 2,45,542, NZB జిల్లాల్లో 3,32,663 మంది ఇళ్ల కోసం అప్లయ్ చేసుకున్నారు.

News July 24, 2024

కేంద్ర బడ్జెట్‌పై పాలమూరు ఎంపీలు ఏమన్నారంటే..!

image

కేంద్ర బడ్జెట్‌లో పాలమూరుకు ఎలాంటి కేటాయింపులు జరగలేదని మల్లురవి అన్నారు. ‘పాలమూరు-రంగారెడ్డి ఊసేలేదు. ఉన్నత విద్యా సంస్థలు, రైల్వే లైన్లు లేవు. జిల్లాకు జరిగిన అన్యాయంపై ఆందోళన చేస్తాం’ అని ఆయన హెచ్చరించారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా బడ్జెట్ ఉందని DK అరుణ హర్షం వ్యక్తం చేశారు. యువత, మహిళలు, రైతులకు ఎంతో మేలు జరగనుందని, ఉద్యోగులకు ఊరట, PM ఆవాస్‌ యోజన కింద ఇళ్లు నిర్మిస్తారని ఆమె అన్నారు.

News July 24, 2024

HYD: ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్‌ బస్సులు!

image

IT ఉద్యోగులకు RTC శుభవార్త చెప్పంది. HYD శివారు‌ నుంచి హైటెక్‌సిటీకి‌ రావాలంటే‌ సికింద్రాబాద్, కోఠి తదితర బస్టాప్‌ల మీదు‌గా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2 నుంచి 4 బస్సులు మారాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగులకు అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఇప్పటికే ఘట్‌కేసర్‌ నుంచి హైటెక్‌సిటీకి స్పెషల్ సర్వీసులు తీసుకొచ్చారు. మరో 40 రూట్‌లలో‌నూ‌ ఈ విధంగా సేవలు అందించేందుకు RTC కసరత్తు చేస్తోంది.

News July 24, 2024

కరీంనగర్: కేంద్ర బడ్జెట్‌లో నిరాశే!

image

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి చేపట్టడంతో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక ప్రయోజనం కలిగించే ఒక్క ప్రాజెక్టు గురించైనా ప్రకటన ఉంటుందని ప్రజలు భావించారు. కానీ ఈ సారి ఉమ్మడి జిల్లాపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన రాలేదు. కొత్త జిల్లాలకు నవోదయ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని ఆశించినా నిరాశే మిగిలింది. బసంత్‌నగర్‌ వద్ద విమానాశ్రమం ఏర్పాటుపైనా ఎలాంటి ప్రకటన లేకపోవడం నిరుత్సాహపరిచింది.

News July 24, 2024

HYD: ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్‌ బస్సులు!

image

IT ఉద్యోగులకు RTC శుభవార్త చెప్పంది. HYD శివారు‌ నుంచి హైటెక్‌సిటీకి‌ రావాలంటే‌ సికింద్రాబాద్, కోఠి తదితర బస్టాప్‌ల మీదు‌గా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2 నుంచి 4 బస్సులు మారాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగులకు అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఇప్పటికే ఘట్‌కేసర్‌ నుంచి హైటెక్‌సిటీకి స్పెషల్ సర్వీసులు తీసుకొచ్చారు. మరో 40 రూట్‌లలో‌నూ‌ ఈ విధంగా సేవలు అందించేందుకు RTC కసరత్తు చేస్తోంది.

News July 24, 2024

వరంగల్: బడ్జెట్‌పై అసంతృప్తి!

image

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వరంగల్ జిల్లాకు నిరాశే ఎదురైంది. విభజన హామీల్లో భాగంగా మంజూరైన ములుగు గిరిజన వర్సిటీకి ఈ పద్దులో నిధులు దక్కుతాయని ప్రజలు ఆకాంక్షించారు. కానీ బడ్జెట్‌ ప్రసంగంలో దీనిపై ఎలాంటి ప్రస్తావన రాలేదు. వరంగల్‌ జిల్లాలో నిర్మిస్తున్న కాకతీయ మెగా జౌళి పార్కుకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదు. దీంతో వరంగల్ వాసులు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News July 24, 2024

మెదక్ జిల్లాలో రూ. 237.5 కోట్లు జమ: కలెక్టర్

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.2లక్షల రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. మెదక్ జిల్లాలో మొదటి విడతలో 47,978 మంది రైతులకు రూ.238.81 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 47,616 మంది రైతుల ఖాతాల్లో రూ. 237.5 కోట్లు జమ చేశామని, వివిధ కారణాలతో 362 మందికి రూ. 1.3 కోట్లు జమ కావాల్సి ఉందన్నారు. ఈ రైతులకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.

News July 24, 2024

జోగిపేట: ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలి

image

చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. జోగిపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో న్యాయ అవగాహన సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఉచితంగా సహాయం అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 24, 2024

MBNR: తెలంగాణకు బడ్జెట్‌లో మొండి చేయి..!: మంత్రి జూపల్లి

image

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందని, ఎప్పటి లాగే తెలంగాణకు మొండి చేయి చూపారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్‌లో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించిందని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ఊసే లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై ఎలాంటి భరోసా ఇవ్వలేదని విమర్శించారు.