India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామప్ప ఆలయానికి హ్యాండ్ బాక్స్ టెక్నాలజీ వల్ల వెయ్యి ఏళ్ల వరకు డోకాలేదని పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. వర్షాల వల్ల రామప్ప ఆలయం కురుస్తుందని వచ్చిన వార్త కథనాలను కేంద్ర పురావస్తు శాఖ డీఈ ఖండించారు. రామప్ప ఆలయానికి ఎలాంటి ముప్పు లేదని ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో అధికారులు చంద్రకాంత్, కృష్ణ చైతన్య, ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలోనే విద్యార్థులను చేర్పించాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోహెడ, బెజ్జంకి మండలాల్లో ని వివిధ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన అనంతరం చివరగా కోహెడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదవ తరగతి ఫలితాల్లో అందరూ శ్రద్ధగా చదివి ఫలితాల్లో 10 జీపీ తెచ్చుకోవాలని సూచించారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా 47,616 మంది రైతుల ఖాతాల్లో 237.5 కోట్ల రూపాయలు జమ చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో 47 వేల 978 మంది రైతులకు వివిధ బ్యాంకుల ద్వారా 238.81 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. వివిధ సాంకేతిక కారణాలవల్ల 362 మంది రైతులకు సంబంధించి 1.3 కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉంన్నారు. ఈ రైతులకు సంబంధించిన సరైన ఖాతా వివరాలను వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులు సేకరిస్తారని అన్నారు.
అమరావతి నిర్మాణం కోసం రూ. వేల కోట్లు ఇస్తున్న కేంద్రం హైదరాబాద్‌కు నిధులు ఎందుకు ఇవ్వలేదని CM రేవంత్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. HYD మెట్రో విస్తరణ, మూసీ డెవలప్‌మెంట్, RRR ప్రాజెక్ట్‌కు ఏమీ ఇవ్వలేదన్నారు. కాలుష్యం నుంచి నగరాన్ని కాపాడేందుకు, మెట్రో కోసం బడ్జెట్‌ను సవరించి నిధులు ఇవ్వాలన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా ఎక్సైజ్ స్టేషన్‌లో గురువారం వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం ఉంటుందని ఎక్సైజ్ అధికారి ఎండి రజాక్ తెలిపారు. ఈ నెల 25న ఉదయం 10 గంటలకు ద్విచక్ర వాహనాలు 18, మహేంద్ర బొలెరో 1, కార్లు 3, ప్యాసింజర్ ఆటోలు 3, ఒక ట్రాలీ ఆటో మొత్తం 26 వాహనాలకు బహిరంగ వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఎక్సైజ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
అమరావతి నిర్మాణం కోసం రూ. వేల కోట్లు ఇస్తున్న కేంద్రం హైదరాబాద్‌కు నిధులు ఎందుకు ఇవ్వలేదని CM రేవంత్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. HYD మెట్రో విస్తరణ, మూసీ డెవలప్‌మెంట్, RRR ప్రాజెక్ట్‌కు ఏమీ ఇవ్వలేదన్నారు. కాలుష్యం నుంచి నగరాన్ని కాపాడేందుకు, మెట్రో కోసం బడ్జెట్‌ను సవరించి నిధులు ఇవ్వాలన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
క్షయ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (GGH) సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ సూచించారు. GGH లో
మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక వేళ టీబీ నిర్ధారణ అయితే ఆందోళన చెందకుండా చికిత్స చేయించుకోవాలని సూచించారు. కాగా కేంద్ర బృందం సభ్యుడు డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ప్రతిమారాజ్ అందిస్తున్న సేవలను కొనియాడారు.
✓తెల్లాపూర్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిరణ్ ఆత్మహత్య
✓OU: IAS స్మిత సబర్వాల్ ఫొటోలు దగ్ధం
✓యువతులు, మహిళలను వేధిస్తే వదిలిపెట్టం:CP
✓సికింద్రాబాద్:గాంధీ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్ రాజకుమారి
✓8 సీట్లు ఇచ్చినా.. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసింది: చాడ
✓HYD: దాదాపు 200 ఫోన్ల రికవరీ పూర్తి
✓VKB: అనంతగిరి పచ్చటి అందాల..సొగసులు..!
✓సికింద్రాబాద్:రైల్వే టికెట్ల స్కాం.. బట్టబయలు
☞MLG: బొగత జలపాతంలో పడి యువకుడు మృతి
☞ BHPL: ఆర్డీవో వాహనం ఢీకొని ఇద్దరికీ గాయాలు
☞MHBD: గుడుంబా తరలిస్తున్న వారిపై కేసు నమోదు
☞MLG: ధర్మవరంలో ఇద్దరిపై కుక్కల దాడి
☞ WPT: గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడులు
☞ MHBD: జిల్లాలో దొంగల బీభత్సం
☞ WGL: స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు
>బడ్జెట్లో కాజీపేట కోర్సు ఫ్యాక్టరీ ఊసే లేదు: కేటీఆర్, హరీష్ రావు> అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు> శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా సిరికొండ మధుసూదనాచారి> కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది: ఎంపీలు కావ్య, బలరాం నాయక్> HNK ప్రసూతి ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య>MLG తగ్గుముఖం పడుతున్న గోదావరి
Sorry, no posts matched your criteria.