Telangana

News July 23, 2024

కామారెడ్డి: వికసించిన బ్రహ్మ కమలం

image

కామారెడ్డి పట్టణంలో బ్రహ్మకమలం వికసించింది. ప్రతి ఆషాఢమాసంలో బ్రహ్మకమలం రాత్రిపూట వికసిస్తుందని రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీనివాస శర్మ తెలిపారు. బ్రహ్మకమలం వికసించడం ఎంతో అదృష్టంగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో బ్రహ్మ కమలం చెట్లు పెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బ్రహ్మ కమలం పువ్వును తిలకిస్తే కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుందని ఆయన చెప్పారు.

News July 23, 2024

నిజామాబాద్: నేటి వార్తల్లోని ముఖ్యంశాలు

image

*NZB: వేతన జీవులను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్: రామ్మోహన్ రావు
*తెలంగాణ వర్సిటీలో ఏబీవీపీ ధర్నా (వీడియో)
*కేంద్ర బడ్జెట్.. NZB జిల్లాకు మొండి చేయి
*గ్యారంటీలు, హామీలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం: ఎమ్మెల్యే ధన్పాల్
*NZB: ఆ చెరువు 14 ఊర్లకు ఆదేరువు
*నిజామాబాద్: మార్ట్ లో అగ్నిప్రమాదం
*ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద
*నిజామాబాద్: మత్స్యకారుడి వలకు చిక్కిన 30 కిలోల చేప

News July 23, 2024

గద్వాల : జూరాలకు కొనసాగుతోన్న వరద

image

జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం జూరాల జలాశయంలో 317.560 మీటర్ల స్థాయిలో 7.759 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. జూరాలకు ఎగువ ప్రాంతం నుంచి 1,65,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 36 గేట్లను ఎత్తి దిగువకు 1,41,357 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి నీటిని వినియోగిస్తున్నారు.

News July 23, 2024

MBNR:ఉమ్మడి జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

✓MBNR:కల్కి మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న నాగ్ అశ్విన్.✓ తెలంగాణకు బిజెపి మొండి చేయి: పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.✓ కోయిలకొండ వీరభద్ర స్వామి ఆలయంలో నాగుపాము దర్శనం.✓ కొడంగల్: కడ పరిధిలో అభివృద్ధి పనులపై పవర్ ప్రజెంటేషన్.✓ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు పాల్గొన్న ఎమ్మెల్యేలు✓ గద్వాల జిల్లా కూలీలను మట్టి మిద్దె తప్పిన పెను ప్రమాదం.✓ జూరాలకు పోటెత్తిన వరద.

News July 23, 2024

మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి హరీశ్ రావు

image

గుండె సంబంధిత ఇబ్బందులతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పరామర్శించారు. శశిధర్ రెడ్డి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి శశిధర్ రెడ్డి యోగ క్షేమాలు ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

News July 23, 2024

MBNR: కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ ఏడ్మా సత్యం మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, మొక్కను అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

News July 23, 2024

ఖమ్మం: బొగత జలపాతంలో యువకుడి మృతి

image

వాజేడు మండలం బొగత జలపాతం వద్ద విషాదం జరిగింది. స్నేహితులతో కలిసి సరదాగా జలపాతం చూసేందుకు వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు జశ్వంత్(19) కొలనులో గల్లంతై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంకటాపురం పోలీసులు గజ ఈతగాళ్ళతో వెతికించి మృతదేహాన్నీ సాయంత్రం వెలికి తీశారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జలపాతంలోకి ఎవరూ దిగొద్దని ఇప్పటికే అటవీశాఖ, పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు.

News July 23, 2024

MDK: కన్నీరు తెప్పిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సూసైడ్ నోట్

image

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిరణ్ (25) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడు రాసిన సూసైడ్‌ నోట్‌ కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘నా చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలే. <<13690444>>నచ్చిన చదువు చదవలేదు<<>>. నచ్చిన బట్టలు, ఇష్టమైన తిండి తినలేదు. నచ్చిన జాబ్ కూడా లేదు. నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. ఒక్కడినే ఇలా ఉండలేకపోతున్నాను. గుడ్‌ బై’ అంటూ మధ్యతరగతి యువత కష్టాలను ‌లెటర్‌లో రాసి తనువు చాలించాడు.

News July 23, 2024

HYD: కన్నీరు తెప్పిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సూసైడ్ నోట్

image

HYD శివారు తెల్లాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిరణ్ (25) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడు రాసిన సూసైడ్‌ నోట్‌ కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘నా చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలే. <<13690444>>నచ్చిన చదువు చదవలేదు<<>>. నచ్చిన బట్టలు, ఇష్టమైన తిండి తినలేదు. కనీసం నచ్చిన జాబ్ కూడా లేదు. నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. ఒక్కడినే ఇలా ఉండలేకపోతున్నాను. గుడ్‌ బై’ అంటూ మధ్యతరగతి యువత కష్టాలను ‌లెటర్‌లో రాసి తనువు చాలించాడు.

News July 23, 2024

జన్నారం: చిత్తడిగా మారిన ఆదివాసి గ్రామాల రోడ్లు

image

జన్నారం మండలంలోని ఆదివాసి, గిరిజన గ్రామాలకు వెళ్ళే రోడ్లు చిత్తడిగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేట అనుబంధ రాయి సెంటర్ గ్రామానికి వెళ్లాలంటే కచ్చా రోడ్డు ఉంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో ఆ రోడ్డుపై కనీసం నడవలేని పరిస్థితి ఉందని రాయి సెంటర్ గ్రామస్థులు వాపోయారు. తమ గ్రామానికి రోడ్డును నిర్మించాలని వారు కోరారు.