India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD శివారు తెల్లాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిరణ్ (25) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడు రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘నా చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలే. <<13690444>>నచ్చిన చదువు చదవలేదు<<>>. నచ్చిన బట్టలు, ఇష్టమైన తిండి తినలేదు. కనీసం నచ్చిన జాబ్ కూడా లేదు. నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. ఒక్కడినే ఇలా ఉండలేకపోతున్నాను. గుడ్ బై’ అంటూ మధ్యతరగతి యువత కష్టాలను లెటర్‌లో రాసి తనువు చాలించాడు.
కేంద్రబడ్జెట్ వేతన జీవులను నిరాశ పరిచిందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆదాయ పన్ను చెల్లించే మధ్యతరగతి వేతన జీవులకు ఈ బడ్జెట్‌లోనైనా కొంత ఊరట దక్కుతుందని ఆశించామన్నారు. ఐటీ స్లాబులను సవరించాలని, స్టాండర్డ్ డిడక్షన్ కనీసం లక్షకు పెంచాలనేది తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు.
భూటాన్‌లో జరిగిన సౌత్ ఆసియన్ కరాటే ఛాంపియన్ షిప్ పైడి పాటి బాబీవర్మ (అండర్-21) 60 కిలోల కుమితే విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ పోటీలు ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగాయి. ఈ విజయంతో ఆగస్టు 23 నుంచి 25 వరకు – దీంతో బాబీ వర్మను పలువురు అభినందించారు.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25 లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందని, ప్రజల కోసం కాకుండా బీజేపీ మిత్రపక్షాలు, జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే బడ్జెట్‌ను రూపొందించారని అన్నారు.
యువతులు, మహిళలను వేధించే పోకిరీలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాచకొండ CP సుధీర్ బాబు హెచ్చరించారు. మంగళవారం ఆయన ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. షీటీమ్స్ గత 15 రోజుల్లో 158 మంది ఆకతాయిల ఆట కట్టించినట్లు పేర్కొన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, బహిరంగ ప్రదేశాల్లో డెకాయ్ ఆపరేషన్లు చేపట్టామన్నారు. పట్టుబడ్డవారికి నేడు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు.
యువతులు, మహిళలను వేధించే పోకిరీలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాచకొండ CP సుధీర్ బాబు హెచ్చరించారు. మంగళవారం ఆయన ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. షీటీమ్స్ గత 15 రోజుల్లో 158 మంది ఆకతాయిల ఆట కట్టించినట్లు పేర్కొన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, బహిరంగ ప్రదేశాల్లో డెకాయ్ ఆపరేషన్లు చేపట్టామన్నారు. పట్టుబడ్డవారికి నేడు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వివరించారు.
ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆదిలాబాద్రూరల్ మండలంలోని అంకోలి- చించుఘాట్ గ్రామాల మధ్యగల మర్రివాగుపై బ్రిడ్జ్ మంగళవారం కుంగిపోయింది. దీంతో డీఎస్పీ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు రూరల్ సీఐ, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కుంగిన బ్రిడ్జి పై నుంచి తాత్కాలికంగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. త్వరలో మరమ్మతులు చేయించి రాకపోకలను పునరుద్ధరించనున్నారు.
మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో మహిళలు 68.60 కోట్ల సార్లు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఫలితంగా రూ.2,350 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) అధికారులు, సిబ్బందితో బస్‌భవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆర్‌టీసీ సిబ్బంది కృషి, క్రమశిక్షణ, అంకితభావం వల్లే పథకం విజయవంతమైందన్నారు.
ఈనెల 26 నుంచి ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. వందేళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు పారిస్ అతిథ్యం ఇస్తోంది. విశ్వక్రీడల్లో భారత్ తరఫున సత్తాచాటి పతకాలు తెచ్చెందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం’ పేరుతో క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఇందుకు రూ.470 కోట్లకు పైగా వెచ్చించింది. అయితే NZBకు చెందిన నిఖత్‌జరీన్ (బాక్సింగ్) శిక్షణకు రూ.91.71 లక్షలు ఖర్చు చేసింది.
భువనగిరి పట్టణంలోని జిల్లా గ్రంథాలయాన్ని ఛైర్మన్ డా.రియాజ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాలను నిరుద్యోగులు, విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుధీర్, సిబ్బంది, శెట్టి బాలయ్య, అవేజ్ చిస్టీ, మజర్, అతహర్, సాయి కిరణ్ తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.