Telangana

News March 29, 2024

ఉమ్మడి KNR జిల్లాలో జోరుగా బెట్టింగ్

image

ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల యవత బెట్టింగులకు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం IPL సీజన్ కావడంతో కాటారం సహా.. పలు చోట్ల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో భారీగా బెట్టింగ్ పెడుతున్నారు. వచ్చిన లాభాలను సైతం బెట్టింగ్‌కు మళ్లిస్తున్నారు. ఇటీవల కాటారం మండలంలో ఓ వ్యక్తి బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడి రూ.లక్షల్లో నష్టపోయాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

News March 29, 2024

నల్గొండలో గెలిచి చరిత్ర సృష్టిస్తా.. బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి

image

నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నల్గొండలో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. బీజేపీ కాంగ్రెస్‌కు ఎప్పుడూ బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. బీజేపీలో అందరినీ కలుపుకొని పోయి పనిచేస్తా తప్పకుండా జిల్లాలో బీజేపీ జెండా ఎగరేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

News March 29, 2024

దేవరకద్ర: రూ.8 లక్షల 40 వేలు పట్టివేత

image

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. నేడు మరికల్ మండలం లాల్ కోట చౌరస్తాలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుకున్నట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. దేవరకద్ర మండలం గురకొండకి చెందిన బిరప్ప రూ.8 లక్షల 40 వేలు కారులో తీసుకెళ్తుండగా సీజ్ చేసి ఎలక్షన్ గ్రీవెన్స్ కమిటీకి అప్పగించామన్నారు. రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత పత్రాలు వెంట ఉండాలన్నారు.

News March 29, 2024

NZB: మహిళ మెడలోంచి చైన్ లాక్కెల్లిన దుండగులు

image

నిజామాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ జరిగింది. యెండల టవర్స్ రోడ్డులో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. మోపాల్ మండలానికి చెందిన దంపతులు శుక్రవారం ఓ పని నిమిత్తం నిజామాబాద్‌కు వచ్చారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

News March 29, 2024

మెదక్ సీటును సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తాం: నీలం మధు

image

మెదక్ ఎంపీ సీటు గెలిచి సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీని నీలం మధు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిశారు. ఇందిరాగాంధీ లాంటి మహోన్నత నేత ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానాన్ని తనకు కేటాయించడం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానానికి రుణపడి ఉంటానని చెప్పారు.

News March 29, 2024

NLG: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడస్తున్నందుకు చాలా మంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారని జిల్లా ఎస్పీ చందనా దీప్తి అన్నారు. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఆర్థికంగా దెబ్బతిని సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. యువత క్రికెట్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ కోరారు.

News March 29, 2024

రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా మెదక్ వాసి

image

రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా మెదక్ జిల్లా ర్యాలమడుగు వాసి కృష్ణ గెలుపొందారు. గ్రామానికి చెందిన కృష్ణ 18 ఏళ్లుగా అక్కడ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికలో ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 2270 ఓట్లలో 1134 ఓట్లు సాధించి గెలుపొందారు. మెదక్ మండలం ర్యాలమడుగు వాసి గెలుపొందడం పట్ల గ్రామస్తులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News March 29, 2024

కొత్తగూడెం: చోరీ చేస్తుండగా పట్టుకొని దేహశుద్ధి

image

బూర్గంపహడ్ మండల కేంద్రంలోని క్లస్టర్ మిల్లు సమీపంలో గురువారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామ చివర ఉన్న క్లస్టర్ మిల్లు వద్ద నలుగురు దొంగలు ట్రాలీ వాహనంలోకి దొంగతనంగా హెవీ జనరేటర్ ఎక్కిస్తున్న క్రమంలో స్థానిక రైతులు ఇద్దరు దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గతంలో చోరీకి గురైన మోటర్లు, పలు పరికరాలు వీళ్లే ఎత్తుకెళ్లినట్లు రైతులు భావిస్తున్నారు.

News March 29, 2024

ప్రతిపక్ష పార్టీపై కొప్పుల హాట్ కామెంట్స్

image

ప్రతిపక్ష పార్టీపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “పెద్ద షాక్, వాడు పోయిండు, వీడు పోయిండు అనే ఒకటే ఊదరగొడుతుండ్రు. ఇది శిశిర ఋతువు.. పనికిరాని ఆకులన్నీ చెత్తకుప్పలోకి పోతయ్. మూలం మాత్రం స్థిరంగా ఉంటుంది” అని ట్వీట్ చేశారు. మళ్ళీ చైత్రం వస్తది, కొత్త ఆకులు చిగురిస్తాయని, మూలం నుంచి శక్తిని అందుకొని విజృంభిస్థాయన్నారు. ఇది ప్రకృతి సహజం, ప్రతిదానికి షాకైతే ఎలా అని అన్నారు.

News March 29, 2024

తెలంగాణ కోసం తప్పా పార్టీని వ్యతిరేకించలేదు: మంత్రి కోమటిరెడ్డి

image

ఒక్క తెలంగాణ కోసం తప్ప పార్టీని ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టికెట్ల విషయంలో నేను కలుగజేసుకోను.. నేను పార్టీ కోసం పని చేస్తానన్నారు. మంత్రుల నివాస సముదాయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో వారు మాట్లాడారు. తన నియోజకవర్గం తన శాఖ తప్ప వేరేది పట్టించుకోవడంలేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ఆయన చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని ఎద్దెవ చేశారు.