Telangana

News March 29, 2024

BRS రాజేంద్రనగర్‌ MLA పార్టీ మార్పు.. క్లారిటీ..!

image

పార్టీ‌ మార్పు అంశంపై BRS రాజేంద్రనగర్ MLA క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో జరిగిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకాకపోవడంతో ప్రకాశ్ గౌడ్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. సాయంత్రం ఈ వ్యవహారంపై ఆయన స్పందించారు. ‘మార్చి 31న మనవరాలి పెళ్లి ఉంది. పనుల్లో బిజీగా ఉండడంతో రాలేకపోయాను. అంతమాత్రాన ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం తగదు’ అంటూ ప్రకాశ్ గౌడ్ హెచ్చరించారు.

News March 29, 2024

NTPCలో యువకుని అనుమానాస్పద మృతి

image

రామగుండం NTPC పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జీ వద్ద దర్శన్ సింగ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నిన్న మధ్యాహ్నం లాడ్జింగ్‌కు వచ్చిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా? లేక మరేదైనా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చత్తీస్ ఘడ్‌లో ఉన్న మృతుని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 29, 2024

సూర్యాపేట: మంత్రి కారును తనిఖీ చేసిన పోలీసులు

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రకారం వాహనాల తనిఖీల్లో భాగంగా సూర్యాపేటలో కేంద్ర పోలీసు బలగాలు సూర్యాపేట పోలీసులు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కారును జాతీయ రహదారిపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువులు పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఎన్నికల నియమాలు ప్రకారం ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. వాహనం తనిఖీ అనంతరం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తిరిగి ప్రయాణమయ్యారు.

News March 29, 2024

MBNR: ఈసారి 400 సీట్లు గెలుపు ఖాయం: కిషన్ రెడ్డి

image

రాష్ట్రంలో ప్రధాని మోదీ ప్రభంజనం మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఈసారి మోదీ ప్రభంజనంతో 400 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

News March 29, 2024

మంత్రి శ్రీధర్ బాబుకు మరో కీలక పదవి

image

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఏఐసిసి అధిష్టానం మరో కీలక పదవిని అప్పజెప్పింది. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మంత్రి శ్రీధర్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రామగుండం ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ అనుబంధ పార్టీ సెక్రటరీ జనక్ ప్రసాద్‌కు సభ్యుడుగా నియమిస్తే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.

News March 29, 2024

ఖమ్మంలో అక్రమ నిర్మాణాల తొలగింపు

image

ఖమ్మం ఖానాపురం పరిధిలోని వైఎస్సార్ కాలనీ సమీపంలో మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన స్థలాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం తొలగించారు. సర్వేనెంబర్ 37లో సుమారు 35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 2004, 2009 సంవత్సరాల్లో 300 మంది మాజీ సైనికులకు, 139మంది స్వాతంత్య్ర సమరయోధులకు మొత్తం 439మందికి 144 గజాల వంతున అప్పటి కలెక్టర్లు అందజేసి, వారికి అసైన్డ్ పట్టాలు ఇచ్చారు.

News March 29, 2024

నిర్మల్: అనారోగ్య కారణాలతో యువతి ఆత్మహత్య

image

అనారోగ్యంతో విసిగిపోయి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అలగొండ విజయలక్ష్మి(20) బీడీ కార్మికురాలిగా పనిచేసేది. గత ఆరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో విసుగుచెందిన ఆమె ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకొని చనిపోయినట్లు SI చంద్రమోహన్ తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News March 29, 2024

HYD: కాంగ్రెస్‌లోకి KTR అనుచరుడు అలిశెట్టి అరవింద్?

image

KTR ప్రధాన అనుచరుడు అలిశెట్టి అరవింద్ కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన రాజకీయ గురువుగా భావించే KK సైతం పార్టీని వీడటంతో అరవింద్ కూడా హస్తం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం నుంచి BRS పార్టీ, KTR వెంట నడిచిన అలిశెట్టి ‌ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు తెలిపారు.

News March 29, 2024

HYD: కాంగ్రెస్‌లోకి KTR అనుచరుడు అలిశెట్టి అరవింద్?

image

KTR ప్రధాన అనుచరుడు అలిశెట్టి అరవింద్ కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన రాజకీయ గురువుగా భావించే KK సైతం పార్టీని వీడటంతో అరవింద్ కూడా హస్తం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం నుంచి BRS పార్టీ, KTR వెంట నడిచిన అలిశెట్టి ‌ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు తెలిపారు.

News March 29, 2024

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ

image

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పేరుతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో చేతులు కలిపిందని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ శుక్రవారం ఒక లేఖలో పేర్కొన్నారు. దుమ్ముగూడెంలో అరెస్టు చేసి మాయం చేసిన ఛత్తీస్‌గఢ్ ఆదివాసి యువకులను ఏం చేశారో ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. విప్లవ ప్రతిఘాతుక కగార్ (అంతిమ దశ) ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయన్నారు.