Telangana

News July 23, 2024

జిల్లాలో త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం

image

గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. మహిళా శక్తి పథకంలో భాగంగా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. మెరుగైన ప్రగతి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండి వ్యాపార నిర్వహణ సామర్థ్యం గల సంఘాలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ గుర్తిస్తుంది. మిర్యాలగూడ, నకిరేకల్, నల్గొండ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయంలో క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తుంది.

News July 23, 2024

శంషాబాద్: విమానం ఆలస్యం.. ప్రయాణికుల ఆందోళన!

image

విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగింది. సోమవారం ఉదయం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం సమయానికి బయలుదేరలేదు. ఉదయం 8 గంటల వరకు కూడా విమానం బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఎయిర్ లైన్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.

News July 23, 2024

పటాన్‌చెరు: రూ.13.83 లక్షలు కాజేసిన సైబర్ నేరస్థులు

image

పెట్టుబడి పెడితే లాభాలు, కమీషన్ ఇస్తామంటూ ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి సైబర్ నేరస్థులు రూ.13.83 లక్షలు కాజేసిన ఘటన పటాన్‌చెరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీనగర్ కాలనీకి చెందిన ఉద్యోగి వాట్సాప్‌కు జూన్ 5న ఈ మేరకు ఓ సందేశం వచ్చింది. నమ్మిన బాధితుడు పలు దఫాలుగా రూ.13.83 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత మోసపోయిన విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 23, 2024

రోడ్డు ప్రమాదంలో CRPF కానిస్టేబుల్ మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కోదాడలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చింత రాజు( 23) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా.. కోదాడ సమీపంలోని కట్టుకోమ్ముగూడెం రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. చింత రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కోదాడ పోలీసులు మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News July 23, 2024

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు

image

ఖమ్మం జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. గడచిన రెండు వారాలుగా జిల్లాలో 16 చొప్పున డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 9,491 శాంపిళ్లు సేకరించగా ఈనెల 19వ తేదీ వరకు 210 డెంగీ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో తిరుమలాయపాలెం పీహెచ్సీ పరిధిలోనే 18 కేసులు ఉంటే.. జల్లేపల్లిలోనే 14 కేసులు నమోదు కావటం గమనార్హం.

News July 23, 2024

HYDలో కుక్కల బెడద.. GOOD NEWS

image

HYDలో కుక్కల బెడద కారణంగా పిల్లల ప్రాణాలు పోతున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గుడ్ న్యూస్ తెలిపారు. కుక్కల బెడద నివారించేందుకు ఇకపై ప్రత్యేక అపెక్స్ కమిటీని నియమించనున్నట్లు వెల్లడించారు. పలు శాఖల అధికారులు కలిసి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తారని తెలిపారు. మరోవైపు HYDలో వీధి కుక్కలకు షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేస్తామని GHMC తెలిపింది. 

News July 23, 2024

HYDలో కుక్కల బెడద.. GOOD NEWS

image

HYDలో కుక్కల బెడద కారణంగా పిల్లల ప్రాణాలు పోతున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గుడ్ న్యూస్ తెలిపారు. కుక్కల బెడద నివారించేందుకు ఇకపై ప్రత్యేక అపెక్స్ కమిటీని నియమించనున్నట్లు వెల్లడించారు. పలు శాఖల అధికారులు కలిసి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తారని తెలిపారు. మరోవైపు HYDలో వీధి కుక్కలకు షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేస్తామని GHMC తెలిపింది.

News July 23, 2024

‘పాలమూరు’ ప్రాజెక్టుకు సాయం అందేనా..?

image

పాలమూరు జిల్లాలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రం నుంచి నిధులు అందజేయాలన్న డిమాండ్ ఉంది. రూ.52 వేల కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు అందిస్తే త్వరితగతిన పూర్తి కానుంది. ఈసారి బడ్జెట్లో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం అందుతుందన్న అంచనాలున్నాయి. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్న డిమాండ్ ఉంది.

News July 23, 2024

పార్లమెంటులో పాలమూరుకు న్యాయం జరిగేనా..!

image

నేడు జరగనున్న కేంద్ర బడ్జెట్‌లో పాలమూరుకు న్యాయం జరిగినా !. ఎన్నో ఏళ్లుగా వికారాబాద్, కృష్ణ రైల్వే లైన్ కోసం ఈ ప్రాంత ప్రజలు నిరీక్షిస్తున్నారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాలు నవోదయ పాఠశాలల కోసం ఎదురుచూస్తున్నారు. నారాయణపేటలో సైనిక పాఠశాల ప్రారంభంలోనే ఆగిపోయింది. నల్లమలకు పర్యటక హబ్, మాచర్ల రైల్వే లైన్ కోసం ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

News July 23, 2024

UPDATE.. తల్లితో గొడవ.. ఆపడానికి వెళ్లిన తమ్ముడిని చంపిన అన్న

image

GDKలో అన్న చేతిలో <<13685729>>తమ్ముడు హతమైన<<>> విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. భగత్‌సింగ్‌నగర్‌లో అద్దెకు ఉంటున్న ఓదెలుకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. అయితే పెద్ద కొడుకు అనిల్‌కు పెళ్లి కాలేదు. చిన్న కొడుకు సునిల్(35) ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అనిల్ నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం తల్లితో గొడవపడుతుండగా ఆపడానికి వెళ్లిన సునిల్‌పై కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. తండ్రికి గాయాలయ్యాయి.