India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 22 వేల ఇన్‌ఫ్లో క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1069 అడుగల నీటిమట్టం ఉంది.
నల్గొండ జిల్లాలో చిరుత కలకలం రేపింది. రెండు గేదెలపై చిరుత దాడి చేసి చంపిందని డిండి మండలం కొత్త తండాకు చెందిన రైతు మోతీలాల్ చెప్పారు. మోతీలాల్ పొలం తండాకు ఆనుకుని ఉండడంతో చిరుత మళ్లీ వస్తుందేమో అని తండావాసులు భయపడుతున్నారు. అధికారులు చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూరగాయల సాగు పెరుగుదల అంతంత మాత్రంగానే ఉన్నది. ఉమ్మడి జిల్లాలో 18 వేల ఎకరాల్లో కూరగాయలు పండించాల్సిన అవసరం ఉండగా.. కేవలం వందల ఎకరాల్లో మాత్రమే రైతులు కూరగాయలు పండిస్తున్నారు. జనాభాకు అనుగుణంగా సాగు లేకపోవడంతో 40 నుంచి 70 శాతం వరకు కూరగాయలు ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సం.కి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చేసే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. KNR నుంచి కేంద్ర మంత్రి ఉండటంతో ఈసారి కేంద్రం చూపు జిల్లావైపు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి KNRలో మీరు కేంద్రం నుంచి ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సం.కి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చేసే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. ఈసారైనా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఎయిర్‌పోర్టు విషయంలో ముందడుగు పడుతుందా? అని ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. వరంగల్‌కు మీరు కేంద్రం నుంచి ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.
HYD నగరం రాజేంద్రనగర్ వెటర్నరీ విశ్వవిద్యాలయ అధికారులు ముర్ర జాతి పశువులతో ఎంతో లాభం జరుగుతుందని తెలిపారు. ముర్ర జాతి పశువులు పొడువైనా మెడ, వెడల్పు కలిగిన మూతిని కలిగి ఉంటాయన్నారు. అత్యధికంగా పాలు సైతం అందిస్తాయని తెలిపారు. మరో జాతికి చెందిన పశువులను పెంచే వారు, యూనివర్సిటీకి వచ్చి తగిన సూచనలు పొందవచ్చన్నారు.
HYD నగరం రాజేంద్రనగర్ వెటర్నరీ విశ్వవిద్యాలయ అధికారులు ముర్ర జాతి పశువులతో ఎంతో లాభం జరుగుతుందని తెలిపారు. ముర్ర జాతి పశువులు పొడువైనా మెడ, వెడల్పు కలిగిన మూతిని కలిగి ఉంటాయన్నారు. అత్యధికంగా పాలు సైతం అందిస్తాయని తెలిపారు. మరో జాతికి చెందిన పశువులను పెంచే వారు, యూనివర్సిటీకి వచ్చి తగిన సూచనలు పొందవచ్చన్నారు.
సంగాడి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు చేరుతోందని ప్రాజెక్టు ఏఈ మైపాల్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 564 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోందని, 391 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో తాలేల్మకు 41 క్యూసెక్కులు, హైదరాబాద్ వాటర్ సప్లైకి 80, మిషన్ భగీరథ 70, ఆవిరిగా 200 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉందన్నారు.
కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు జలాశయంలో నీటిని నింపేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. పదేళ్ల క్రితం సాగర్ డ్యాం స్పిల్ వే దెబ్బతినగా పలుమార్లు టెండర్లు పిలిచి చివరగా రూ.16కోట్లకు ఓ కంపెనీకి పనులు అప్పగించారు. గతేడాది నుంచి వర్షాలు లేకపోవడంతో స్పిల్ వే పనులు పూర్తి చేశారు.
GDKలో అన్న చేతిలో <<13685729>>తమ్ముడు హతమైన<<>> విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. భగత్‌సింగ్‌నగర్‌లో అద్దెకు ఉంటున్న ఓదెలుకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. అయితే పెద్ద కొడుకు అనిల్‌కు పెళ్లి కాలేదు. చిన్న కొడుకు సునిల్(35) ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అనిల్ నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం తల్లితో గొడవపడుతుండగా ఆపడానికి వెళ్లిన సునిల్‌పై కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. తండ్రికి గాయాలయ్యాయి.
Sorry, no posts matched your criteria.