India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 1,15,406 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో 1.50 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 123.081 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 93.810 టీఎంసీల నీరు నిల్వ ఉంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు.
నల్గొండ జిల్లాలో చెరువులు నింపకుండానే నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటిని ఖమ్మం జిల్లాకు తరలించడంపై ఈ జిల్లా రైతులు మండిపడుతున్నారు. రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. నల్గొండ జిల్లాలో చెరువులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని నింపకుండా ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తుండడంపై ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
RR జిల్లాకు చెందిన సుమారు 40 మందికి పైగా ఉపాధ్యాయులు హైకోర్టులో టీచర్ల బదిలీలు, పదోన్నతులపై కోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. పదోన్నతులు, బదిలీల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని సింగల్ జడ్జి ఉత్తర్వులను సమర్థిస్తూ అప్పీలు కొట్టి వేసింది. ఈ అంశంపై తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిజెప్పింది.
కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి రెవెన్యూ, రుణమాఫీ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. బాధితులు భారీగా తరలిరావడంతో కలెక్టరేట్ మీటింగ్ హాల్ తో పాటు బయట ఆవరణ అంతా జనంతో నిండిపోయింది. మొత్తం 96 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో భూసమస్యలకు సంబంధించి 53.. ఇతర అంశాలవి 43 ఫిర్యాదులు ఉన్నాయి. రుణమాఫీ కాలేదంటూ సుమారు వంద మంది రైతులు అర్జీలు అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సం.కి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చేసే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. ఈసారైనా కాజేపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఎయిర్‌పోర్టు విషయంలో ముందడుగు పడుతుందా? అని ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. వరంగల్‌కు మీరు కేంద్రం నుంచి ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.
NGKL: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక పాముకాటుకు గురై మృతి చెందిన ఘటన చారకొండ మండలంలోని తుర్కలపల్లికి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఏదుల సువర్ణ, యాదయ్య దంపతుల పెద్ద కూతురు రేణుక(4) సోమవారం రాత్రి 8 గంలకు ఇంటి ముందు ఆడుకుంటుండగా కాలుపై పాము కాటువేసింది. బిడ్డ ఏడుస్తూ రావడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది.
గోదావరి వరద నీరు సారపాక – రెడ్డిపాలెం మధ్యలో రోడ్డుమీద ప్రవహిస్తున్న కారణంగా భద్రాచలం నుంచి బూర్గంపాడు వెళ్లే రాక పోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్లే బస్సులన్నీ వయా BPL, ఎంపీ బంజార మీదుగా రాజమండ్రి వెళ్లే బస్సులు బూర్గంపాడుకు బదులుగా పాల్వంచ, దమ్మపేట మీదుగా అశ్వారావుపేటకు నడుపుతున్నట్లు భద్రాచలం డిపో మేనేజర్ తిరుపతి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సం.కి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చేసే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. KNR నుంచి కేంద్ర మంత్రి ఉండటంతో ఈసారి కేంద్రం చూపు జిల్లావైపు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి KNRలో మీరు కేంద్రం నుంచి ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.
స్టాక్స్‌లో లాభాలని సైబర్ నేరగాళ్లు రూ.16.73 లక్షలు లూటీ చేశారు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగినికి ‘వీఐపీ53-గ్రో క్యాపిటల్ సెక్యూరిటీస్’ గ్రూప్‌నకు సంబంధించి వాట్సాప్ సందేశం వచ్చింది. దాంట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించడంతో మహిళ రూ.16.73 లక్షలు పంపించారు. ఆ తర్వాత ఆ గ్రూప్ నుంచి ఆమెను తొలగించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్టాక్స్‌లో లాభాలని సైబర్ నేరగాళ్లు రూ.16.73 లక్షలు లూటీ చేశారు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగినికి ‘వీఐపీ53-గ్రో క్యాపిటల్ సెక్యూరిటీస్’ గ్రూప్‌నకు సంబంధించి వాట్సాప్ సందేశం వచ్చింది. దాంట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించడంతో మహిళ రూ.16.73 లక్షలు పంపించారు. ఆ తర్వాత ఆ గ్రూప్ నుంచి ఆమెను తొలగించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.