India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రికార్డుస్థాయిలో ఓపీ నమోదువుతోంది. వారంరోజుల్లో 14,576 OP నమోదైంది. IP కింద 846 మంది చేరారు. వీరిలో జ్వరం, వాంతులు, విరేచనాలతో 3,093 మంది బాధితులు వైద్యం తీసుకున్నారు. కేవలం జ్వరంతోనే 138 మంది ఆసుపత్రిలో చేరారు. ఇప్పటివరకు 5009 మంది రోగుల నుంచి రక్తనమునాలు సేకరించారు. నిత్యం 700 నుంచి 800 మంది రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగలో గల్లంతైన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద (టి) గ్రామానికి చెందిన శివ మిత్రులతో కలిసి ఆదివారం రాత్రి పెన్‌గంగాకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యాడు. ఐతే సోమవారం యువకుడి కోసం డీడీఆర్ఎఫ్ బృందం పోలీసులు గాలించిన ఆచూకీ లభ్యం కాలేదు.
నల్గొండ జిల్లా పరిధిలోని ఆసరా ఫించన్ దారులకు మంగళవారం నుంచి ప్రభుత్వం ఫించన్లు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో పీడీ నాగిరెడ్డి తెలిపారు. స్థానిక తపాలశాఖ కార్యాలయాల్లో నేటి నుంచి ఈ నెల 29 వరకు ఫించన్లు పొందవచ్చని తెలియజేశారు. పంపిణీలో మధ్య దళారీల మాటలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఆరో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. మొగిలిపాలెం గ్రామానికి చెందిన సాయికృష్ణ(12) ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే సోమవారం గ్రామ శివారులోని ఊర చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జఫర్గడ్ SI రవిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జఫర్‌గడ్ ఠానా పరిధిలోని భూ వివాదంలో నమోదైన కేసులో అలసత్వం వ్యవహరించడం, కేసు విషయంలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించడం, బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు సహకరించడం వంటి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారణ జరిపి అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సీపీ సస్పెండ్ చేశారు.
ఈనెల 1 నుంచి టీజీఆర్టీసీ ప్రవేశపెట్టిన గిఫ్ట్ స్కీంలో భాగంగా డీలక్స్ బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల ప్రతి 15 రోజుల లక్కీ డిప్ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించారు. రీజియన్ పరిధిలో నిర్వహించిన ఈ లక్కీడ్రాలో లక్ష్మీదేవమ్మ, సుజాత, అర్షియాబేగం విజేతలుగా నిలిచారు. వీరికి సమాచారం ఇచ్చామని, త్వరలో బహుమతులు అందజేస్తామని అధికారులు తెలిపారు.
ఖమ్మం జిల్లాలోని పడకేసిన అభివృద్ధి పనులు, నిలిచిపోయిన నిర్మాణాలు, సంక్షేమ పథకాల కోసం అర్హుల ఎదురుచూపులకు బడ్జెట్లో ఎంత మేర నిధులు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రకటించిన పథకాల అమలుకు నిధులు కేటాయిస్తారని భావిస్తుండగా.. జిల్లా వాసుల్లో ఆశలు నెలకొన్నాయి.
శ్రీశైలం జలాశయానికి ఎగువనున్న జూరాల ప్రాజెక్టు క్రస్టు గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా సోమవారం 1,74,717 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 832.5 అడుగుల వద్ద 52.1476 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో స్థానికంగా 14.0 మి.మీ., వర్షపాతం నమోదైంది. అలాగే శ్రీశైలం జలాశయంలో నుంచి 61 క్యూసెక్కుల నీరు ఆవిరైంది.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతులు విస్తృతంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో వర్షపాతం ఓ మాదిరిగానే నమోదైనా.. ఎస్సారెస్పీ కాలువలో మాత్రం నీరు కనిపించడం లేదు. ఇప్పటికే ఒకింత వ్యవసాయం ఆలస్యంగా మొదలైందని రైతులు వాపోతున్నారు. ఎస్సారెస్పీ కాలువలో వదిలే నీరు తమకు ఆధారమని, సరైన సమయానికి మీరు వదిలేలా అధికారులు సన్నద్ధం కావాలని రైతులు కోరుతున్నారు.
పెండ్యాల్(నష్కల్)-హసన్పర్తి రైల్వే స్టేషన్ మధ్య బైపాస్ లైన్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ కోసం కేంద్ర రైల్వే శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జాతీయ మౌలిక వసతుల కల్పనలో భాగంగా జనగామ జిల్లా, హన్మకొండ జిల్లాల్లో ప్రత్యేక రైల్వే ప్రాజెక్టు కింద ఈ భూసేకరణ చేపట్టనున్నట్లు అందులో తెలిపింది.
Sorry, no posts matched your criteria.