Telangana

News July 23, 2024

సంగారెడ్డి: తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య

image

మనస్తాపంలో బాలిక(11) సూసైడ్ చేసుకున్న ఘటన మనూరు మండలం అతిమ్యాలలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దంపతులకు కుమార్తె, కొడుకు ఉన్నారు. సోమవారం కొడుకు బర్త్ డే కావడంతో కేక్, నిత్యావసరాలు తేవడానికి కొడుకును తీసుకొని దంపతులు ఖేడ్ వెళ్లారు. తాను వస్తానని కుమార్తె మారాం చేయడంతో వద్దని తల్లి మందలించింది. సాయంత్రం వారు ఇంటికొచ్చేసరికే దూలానికి బాలిక ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది.

News July 23, 2024

ఆదిలాబాద్ మహిళలు.. మీ ఆరోగ్యం జాగ్రత్త!

image

క్యాన్సన్ బారినపడ్డ వారు జిల్లాలో 365 మంది ఉన్నట్లు పాలియేటివ్ కేర్ ద్వారా గుర్తించారు. ఆరోగ్య మహిళా క్లినిక్‌లు స్టార్ట్ అయిన నాటి నుంచి టెస్టులు చేయించుకున్న వారి వివరాలిలా ఉన్నాయి. థైరాయిడ్‌తో 188, మూత్రాశయ సమస్యలు 1,081, PCOS 994, మెనోపాజ్‌ 4,058, సుఖవ్యాధులతో 50, ఓరల్ క్యాన్సర్ అనుమానితులు 23, రొమ్ము క్యాన్సర్ 64, గర్భాశయ క్యాన్సర్ 22, క్యాన్సర్ నిర్ధారణ అయిన వారు 02 మహిళలున్నారు.

News July 23, 2024

నిజామాబాద్: మత్స్యకారుడి వలకు చిక్కిన 30 కిలోల చేప

image

నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని సిర్పూర్‌కు చెందిన ఓ మత్స్యకారుడి వలకు భారీ చేప చిక్కింది. రోజులాగానే అభి సోమవారం గ్రామశివారులోని గోదావరిలోకి చేపల వేటకు వెళ్లారు. ఆ సమయంలో అతని వలలో 30 కిలోల చేప చిక్కింది. దీనిని వ్యాపారికి విక్రయించారు. తనకు ఇంత భారీ చేప దొరకడం ఇదే మొదటిసారి అన్నారు.

News July 23, 2024

సామాన్యులకు దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు.!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంట పుట్టిస్తున్న కూరగాయల ధరలు చూసి సామాన్యుల ఇళ్లల్లో నిత్యం వంట చేసుకోవడం ఓ తంటగా మారింది. రూ.250లకు వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి. అలాంటిది ప్రస్తుతం రూ.600 ఖర్చు చేసినా వారం రోజులు సరిపడా కూరలు లభించడం లేదని జనాలు వాపోతున్నారు. ప్రతిరోజు ఆహారంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డల ధరలు ఆకాశన్నంటుతుండడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

News July 23, 2024

మెదక్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

image

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీఎస్ కేసీ, ఇండస్ఇండ్ బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు. ఈ జాబ్ మేళాకు 18 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు కలిగి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణలై, బైక్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు జాబ్ మేళాలో పాల్గొనాలని సూచించారు.

News July 23, 2024

భద్రాచలం వద్ద ఉద్ధృతంగా గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి 12,58,826 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 50 అడుగులకు పైనే ఉండగా, మరో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 53 అడుగులకు నేడు చేరువయ్యే ఆస్కారముందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతా వాసులను అప్రమత్తం చేస్తున్నారు.

News July 23, 2024

నల్గొండ: డిగ్రీ ఫలితాలు విడుదల

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల ఫలితాలను HYDలో యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ నవీన్ మిట్టల్, రిజిస్ట్రార్ అల్వాల రవి, పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్ రెడ్డి, అడ్మిషన్ డైరెక్టర్ ఆకుల రవి విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలో 8,118 మంది విద్యార్థులకు గాను 3,493 మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు.

News July 23, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరిపిచ్చిన వానలు
> వరదలకు మూడో ప్రమాద హెచ్చరిక దిశగా పెరుగుతున్న గోదావరి
> లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు
> ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
> భద్రాద్రి జిల్లాకు రానున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు

News July 23, 2024

HYD: డెంగ్యూ డేంజర్ బెల్స్.. జాగ్రత్త!

image

HYD మహానగరంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌లో 90 రోజుల్లో ఏకంగా 200 కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మే నుంచి పరిశీలిస్తే.. ప్రతి నెలా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. జ్వరంతో ఆసుపత్రికి 350 మందికి పైగా వస్తుండగా ఓపీ ఇస్తున్నారు. మరోవైపు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లోనూ జ్వరంతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. జాగ్రత్త..!

News July 23, 2024

నేడు జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు

image

రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశమున్నట్లు పేర్కొంది. ఈమేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. కాగా, ఇప్పటికే కురిసిన వర్షాలకు చాలా చోట్ల వాగులు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.