India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NLG జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 14తో PACSల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 42 PACSలు ఉన్నాయి. ప్రస్తుతం PACSల పనితీరు ఆధారంగా 15 సంఘాల పాలకవర్గాల పదవీ కాలాన్ని మాత్రమే పొడిగించారు. మరో 15 సంఘాల పదవీ కాలాన్ని వాటి పనితీరు ఆధారంగా ఉన్నత అధికారుల నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు డీసీఓ సిబ్బంది తెలిపారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 208 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ప్రతి సంవత్సరం మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శుక్రవారం నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో (సెప్టెంబర్-6) శనివారం వాహనదారులు గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు.
పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకులకు క్రీడా పోటీలు నిర్వహించారు.
✒క్రికెట్ విజేత:ప్రొ.రమేష్ బాబు జట్టు
రన్నర్స్:Dr.N.చంద్ర కిరణ్ జట్టు
✒కార్రోమ్స్(మహిళ విభాగం)
విజేతలు:చిన్నాదేవి & శారద
రన్నర్స్:స్వాతి & N.శారద
✒వాలీబాల్(పురుష విభాగం)
విజేతలు:ప్రొ.G.N శ్రీనివాస్ జట్టు
రన్నర్స్:ప్రొ.రమేష్ బాబు జట్టు
✒త్రో బాల్(మహిళ విభాగం)
విజేతలు:రాగిణి & టీం
రన్నర్స్:కల్పన & టీం.
పాలమూరు యూనివర్సిటీలో టీచర్స్ డే సందర్భంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం అధ్యర్యంలో బోధన, బోధనేతర సిబ్బందికి నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడలు నేటితో ముగిశాయి. యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్యపూస రమేష్ బాబు పర్యవేక్షించారు. ఫిజికల్ డైరెక్టర్ డా.వై.శ్రీనివాసులు, ప్రిన్సిపాళ్లు డా.మధుసూదన్ రెడ్డి, డా.కరుణాకర్ రెడ్డి, డా.రవికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట మండలం ల్యాబర్తి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్‌గా పని చేస్తున్న భూక్య హరిలాల్ నాయక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. చిన్నతనంలో ఇదే పాఠశాలలో చదువుకొని, ఓనమాలు నేర్చిన పాఠశాలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో మనబడి పిలుస్తోంది కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాతలను, పూర్వ విద్యార్థులను ఆహ్వానిస్తూ బడి అభివృద్ధికి పాటుపడ్డారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచారు.
ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్ బృందం మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రిలిమినరీ సర్వేలో భాగంగా పరిశీలించింది. అనంతరం వారు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా.సత్య శారదతో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఏఎఐ ఏజీఎంలు నటరాజ్, మనీష్ జోన్వాల్, మేనేజర్లు ఓం ప్రకాష్, రోషన్ రావత్, ఎన్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు .
విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం TGNPDCL ఆధునిక సేవలను ప్రారంభించింది. ఇకపై విద్యుత్ బిల్లులు, ఇతర ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ 79016 28348ను సంప్రదించవచ్చు. ఈ నంబర్‌కు మెసేజ్ పంపి బిల్లుల వివరాలు తెలుసుకోవచ్చు, అలాగే ఫిర్యాదులు కూడా చేయవచ్చు. వాట్సాప్ సేవలతో పాటు www.tgnpdcl.com వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ నంబర్ 1912 ద్వారా కూడా సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఎస్‌ఈ శ్రీనివాస చారి తెలిపారు.
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. దాదాపు 118 పోస్టులకు దరఖాస్తులను ఆన్లైన్‌లోనే అప్లై చేయాలి. ఫీజు రూ.2000, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. ఆసక్తిగల వారు ఈనెల 12 నుంచి అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు www.tgprg.in వెబ్ సైట్ చూడవచ్చు.
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద జిల్లాలో అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కుటుంబ పెద్ద మరణించినట్లయితే జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Sorry, no posts matched your criteria.