Telangana

News July 23, 2024

ADB: కొనసాగుతున్న సర్వే.. తేలనున్న లెక్క

image

మిషన్ భగీరథ పథకం తీరుపై జూన్ మొదటి వారం నుంచి సర్వే చేపడుతున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ద్వారా నిధులు సమీకరించేందుకు ఇంటింటి సర్వే కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 468 పంచాయతీల్లో 1,45,502 గృహాల్లో 1,44,267 ఇళ్లల్లో సర్వే చేశారు. మొత్తం 99 శాతం పూర్తి చేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచి నీరు అందుతుందా? ఎన్ని ఇళ్లకు సరఫరా అవుతోంది అలాగే తదితర విషయాలపై త్వరలోనే లెక్క తేలనుంది.

News July 23, 2024

NZB: బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ న్యాయవాదులు

image

నిజామాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టు తాత్కాలిక గవర్నమెంట్ ప్లీడర్‌గా నియమితులైన న్యాయవాది వెంకటరమణ గౌడ్, నిజామాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తాత్కాలిక అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా నియమితులైన పి. రాజులు సోమవారం జిల్లా కోర్టులోని తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు. వారికి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అభినందించారు.

News July 22, 2024

ముప్కాల్ ఇందిరమ్మ కాలనీలో భారీ చోరీ

image

ముప్కాల్ ఇందిరమ్మ కాలనీలో సోమవారం భారీ చోరీ జరిగింది. లింబాద్రి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి సుమారు 30 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న ముప్కాల్ ఎస్సై భాస్కర చారి సంఘటన స్థలానికి చేరుకొని ఆర్మూర్ సీఐకు సమాచారం అందించారు. ఆర్మూర్ నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

News July 22, 2024

HYD: నేటి TOP NEWS

image

✓సికింద్రాబాద్: కోలాహలంగా మహంకాళి ఫలహారం బండ్ల ఊరేగింపు
✓మేడ్చల్: అత్వెల్లి ఎస్టేట్‌లో మహిళ పుర్రె కలకలం
✓రాచకొండలో నేరాలను అరికట్టాలి: సుధీర్ బాబు
✓పాతబస్తీ బోనాలకు గవర్నర్ రాధాకృష్ణకు ఆహ్వానం
✓దమ్మాయిగూడ: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కమిషనర్
✓గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు బదిలీ
✓HYD: ప్రజావాణికి 108 దరఖాస్తులు

News July 22, 2024

HYD: నేటి TOP NEWS

image

✓సికింద్రాబాద్: కోలాహలంగా మహంకాళి ఫలహారం బండ్ల ఊరేగింపు
✓మేడ్చల్: అత్వెల్లి ఎస్టేట్‌లో మహిళ పుర్రె కలకలం
✓రాచకొండలో నేరాలను అరికట్టాలి: సుధీర్ బాబు
✓పాతబస్తీ బోనాలకు గవర్నర్ రాధాకృష్ణకు ఆహ్వానం
✓దమ్మాయిగూడ: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కమిషనర్
✓గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు బదిలీ
✓HYD: ప్రజావాణికి 108 దరఖాస్తులు

News July 22, 2024

ఏసీబీకి చిక్కిన కంది సీసీఎస్ ఇన్‌స్పెక్టర్

image

సస్పెన్షన్లో ఉన్న కంది సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ వెంకట కిషోర్ ఏసీబీకి చిక్కారు. రూ.5లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కేసు విషయంలో ఓ రియల్‌ఎస్టేట్ కాంట్రాక్టర్‌ను రూ.1.50 కోట్లు అడిగిన ఇన్‌స్పెక్టర్.. రూ.5లక్షలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. అయితే గతంలోనూ వెంకటకిషోర్‌కు రియల్‌ఎస్టేట్ రూ.10లక్షలు ఇచ్చారు. మళ్లీ డబ్బులు అడగడంతో వ్యాపారి ఏసీబీని ఆశ్రయించాడు.

News July 22, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి CRIME REPORT

image

★ బాసర: పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్యయత్నం
★ ఆదిలాబాద్: చోరీకి పాల్పడ్డ ఇద్దరు దొంగలు అరెస్ట్
★ కుబీర్: అప్పులబాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
★ జైనథ్: పెన్ గంగా నదిలో యువకుడు గల్లంతు
★ లోకేశ్వరం: పట్టపగలే తాళం ఉన్న ఇంట్లో చోరీ
★ సిర్పూర్: వైన్స్ షాపులో చోరి
★ చెన్నూర్: నిషేధిత గుట్కా పట్టివేత
★ ఇచ్చోడ: వాహనం ఢీకొని జింక మృతి
★ దీలవార్పూర్‌లో రోడ్డు ప్రమాదం

News July 22, 2024

NZB: SRSP అప్డేట్: 21 వేల క్యూసెక్కులకు పెరిగిన ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో పెరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 20,023 క్యూసెక్కుల నీరు రాగా రాత్రి 9 గంటలకు 21,500 క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో పెరిగింది. ఔట్ ఫ్లోగా 518 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు ఉండగా ప్రస్తుతం 1068.90 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

News July 22, 2024

KTDM: మద్యం మత్తులో పురుగుల మందు తాగి సూసైడ్

image

మద్యం మత్తులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందిన ఘటన వెంకటాపురం మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.. ఎస్సై తిరుపతి రావు తెలిపిన వివరాలు ప్రకారం.. వీరభద్ర వరంలో మునిగెల శ్రీనివాస్ (55) మద్యానికి పూర్తిగా బానిస అయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించగా పురుగుల మందు తాగాడని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు ఈ ఘటనపై ఎస్సై కేసు నమోదు చేశారు.

News July 22, 2024

భద్రాచలం: కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

image

 క్రమ క్రమంగా పెరుగుతున్న గోదావరి, రాత్రి 10 గంటల సమయానికి 50 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.