Telangana

News July 22, 2024

భద్రాద్రి జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

image

వర్షాలు, వరదల ప్రభావంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. మరో మూడు రోజులు వర్షాలు ఉన్నందున్న అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాద్రి జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

News July 22, 2024

గోదావరి వరదలపై మంత్రి సమీక్ష సమావేశం

image

గోదావరి వరదలపై సోమవారం భద్రాచలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గోదావరి వద్ద ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని పేర్కొన్నారు.

News July 22, 2024

HYD: బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేస్తే తిరుగుబాటు తప్పదు: జాజుల

image

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో ఓబీసీల సంక్షేమానికి రూ.లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం ఆయన లేఖ రాశారు. పది సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కేంద్రంలో ఓబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా, బడ్జెట్ కేటాయించకుండా అన్యాయం చేసిందన్నారు.

కొత్త కలెక్టరేట్‌ను సిద్ధం చేయండి: కలెక్టర్ పమేల

image

నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి సెప్టెంబర్ 15 వరకు ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. పనులన్నీ ఎప్పటికప్పుడు వేగవంతం చేయాలని సూచించారు. పనులపై నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొన్నారు. కరీంనగర్‌లోని నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

News July 22, 2024

HYD: మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు సహకరించండి: సీఎం

image

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌ని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, వారి కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జగిత్యాల: డిగ్రీ ఫెయిల్.. యువతి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. ఎస్సై అశోక్ వివరాల ప్రకారం.. రాయికల్ మండలం అయోధ్యకు చెందిన శివాని(18) డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఈనెల 6న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది.

News July 22, 2024

ఆ నిబంధ‌న‌ల వ‌ల్లే రుణ‌మాఫీ కావ‌ట్లేదు: హ‌రీశ్‌రావు

image

పంట‌ల రుణ‌మాఫీకి రేష‌న్ కార్డు, PM కిసాన్ నిబంధ‌న అమ‌లు చేస్తున్నారు. ఈ నిబంధ‌న‌ల వ‌ల్ల చాలా మంది రైతుల‌కు రుణ‌మాఫీ కావ‌ట్లేదు అని MLA హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. HYDలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రుణ‌మాఫీలో కోత‌లు పెట్టేందుకే రేష‌న్ కార్డు, PM కిసాన్ నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారని మండిప‌డ్డారు. క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కం ఆగిపోయిందని, ల‌క్ష మందికి పైగా చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు.

News July 22, 2024

HYD: ప్రజావాణికి 108 దరఖాస్తులు

image

హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా 108 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నిర్మాణ శాఖ 78, ఎస్సీ డెవలప్‌మెంట్ 4, ఉపాధి కల్పన 3, దివ్యాంగుల సంక్షేమ శాఖ 4, సీపీవో 4 మిగతావి ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వివరించారు.