Telangana

News March 28, 2024

30 నుంచి భద్రాచలం-విశాఖకు లహరి నాన్ ఏసీ బస్సులు

image

భద్రాచలం-విశాఖపట్నంకి లహరి నాన్ ఏసీ బస్సులను ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు భద్రాచలం DM రామారావు తెలిపారు. శనివారం భద్రాచలం నుంచి ఉదయం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు లహరి బస్సు బయలుదేరుతుందన్నారు. విశాఖపట్నం-భద్రాచలానికి ఉదయం 8 గంటలకు, రాత్రి 8:45 గంటలకు బస్సు ఉంటుందన్నారు.

News March 28, 2024

వరంగల్: మళ్లీ తగ్గిన పత్తి ధర 

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఈరోజు క్వింటా పత్తి రూ.7200 ధర పలికింది. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు ధర తగ్గడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. మంగళవారం పత్తి ధర రూ.7,170 పలకగా.. బుధవారం రూ.7,310కి చేరింది. ఈరోజు మళ్ళీ తగ్గింది. రేపటినుండి మార్కెట్‌కు వరుస సెలవులు రానుండడంతో ఈరోజు పత్తి తరలివస్తోంది.

News March 28, 2024

HYD: రైల్వే స్టేషన్‌లో టికెట్ కొనుగోలు చాలా ఈజీ..!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల రైల్వే ప్రయాణికులకు SCR గుడ్ న్యూస్ తెలిపింది. సికింద్రాబాద్, HYD, బేగంపేట, లింగంపల్లి, హైటెక్ సిటీ, వికారాబాద్ స్టేషన్లలో QR కోడ్ ద్వారా నగదు చెల్లింపుల సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలియజేశారు. బోర్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్‌ కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. త్వరలో మిగతా స్టేషన్లలో అందుబాటులోకి తెస్తామన్నారు.

News March 28, 2024

HYD: రైల్వే స్టేషన్‌లో టికెట్ బుకింగ్ చాలా ఈజీ..!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల రైల్వే ప్రయాణికులకు SCR గుడ్ న్యూస్ తెలిపింది. సికింద్రాబాద్, HYD, బేగంపేట, లింగంపల్లి, హైటెక్ సిటీ, వికారాబాద్ స్టేషన్లలో QR కోడ్ ద్వారా టికెట్‌కు నగదు చెల్లింపుల సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలియజేశారు. బోర్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. త్వరలో మిగతా స్టేషన్లలో అందుబాటులోకి తెస్తామన్నారు.

News March 28, 2024

కరీంనగర్: భర్తను కొట్టి చంపిన భార్య

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో దారుణం జరిగింది. భర్త రోజు తాగి వచ్చి తరచూ గొడవ చేస్తున్నాడన్న నెపంతో రోహితి అనే మహిళ తన భర్త హేమంత్‌ను హత్య చేసింది. పడుకొని ఉన్న భర్తపై వేడి నీళ్లు పోసి అనంతరం తీవ్రంగా కొట్టి గాయపర్చింది. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 28, 2024

MBNR: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేశారు. బుధవారం పోలింగ్ కేంద్రాలను ఎన్నికల రిటర్న్ అధికారి, జిల్లా కలెక్టర్ రవి నాయక్ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు లేని వ్యక్తిని లోపలికి అనుమతించకూడదని సిబ్బందికి తెలిపారు.

News March 28, 2024

NZB: ఎంపీ అభ్యర్థులు ఖరారు.. ఇక సమరమే..!

image

ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో NZB పార్లమెంటు స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు అయ్యారు. బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్, BRS అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ల పేర్లను ఆ పార్టీలు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. అందరి అంచనాలను తారుమారు చేస్తూ తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది. ఇక వీరందరూ.. ప్రజాక్షేత్రంలో రాజకీయ సమరం మొదలు పెట్టాల్సి ఉంది.

News March 28, 2024

WGL: ఈయన సంకల్పం ముందు అంగవైకల్యం ఓడిపోయింది!

image

సంకల్పానికి అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించాడు WGL జిల్లా రాయపర్తికి చెందిన ఓ యువకుడు. బంధనపల్లికి చెందిన రాంజీనాయక్ పుట్టుకతోనే దివ్యాంగుడు. క్రికెట్‌పై ఉన్న మక్కువతో రెండు కాళ్లు పనిచేయకున్నా జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ప్రస్తుతం డీసీసీఐ బోర్డు సభ్యుడు, తెలంగాణ టీం కోర్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా, దివ్యాంగులకు ఉత్తమ అవకాశాలను కల్పించడమే తన లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News March 28, 2024

పెద్దపల్లి: విలాసాలకు అడ్డొస్తుందని భార్యను హతమార్చిన భర్త

image

విలాసాలకు అడ్డు వస్తుందని భార్యను భర్త హత్యచేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ACP కృష్ణ వివరాల ప్రకారం.. ఈ ఘటనలో జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారెడుపల్లికి చెందిన రజిత(33) మృతి చెందింది. అయితే కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన భర్త పున్నం రెడ్డి రోజూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడి, ఇనుపచైన్‌పానతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

News March 28, 2024

2న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపు: కలెక్టర్

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఉపఎన్నిక లెక్కింపు ఏప్రిల్ 2న ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చేపడుతున్నట్లు కలెక్టర్ జి. రవినాయక్ అన్నారు. ఆయా కేంద్రాల నుంచి వచ్చే బ్యాలెట్ పెట్టెలు, పోలింగ్ సామగ్రి రిసెప్షన్ కేంద్రంలో అందించేందుకు కౌంటర్ ఏర్పాట్లపై ఆర్డీవోకు సూచనలు చేశారు. ఇప్పటికే బ్యాలెట్ పెట్టెలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం, లెక్కింపు హాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశారు.