Telangana

News March 28, 2024

వనపర్తి: మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య

image

అమరచింత మండలం కామరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రాజు(22) పెళ్లి చేసుకోవాలంటూ తల్లిదండ్రులు ప్రస్తావన తీసుకురావడంతో నిరాకరించిన అతను మనస్తాపానికి గురై మన్యంకొండ దేవస్థానం సమీపంలో చెట్టుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు.

News March 28, 2024

NZB: అవినీతిలో ‘తగ్గెదేలే’.. ప్రతీ పనికి డబ్బులివ్వాల్సిందే..!

image

ఉమ్మడి NZB జిల్లాలో కొందరు అధికారులు లంచాలు తీసుకోవడంలో తగ్గేది లేదంటున్నారు. కొందరు ఉద్యోగులు ACBకి చిక్కుతున్నా తమ పంథాను మార్చుకోవడం లేదు. ఈ ఏడాది JANలో KMRలో ట్రాన్స్‌కో AE గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. తాజాగా కమ్మర్ పల్లి MPDO ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్ హరిబాబు లంచం తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకోవడం సంచలనంగా మారింది.

News March 28, 2024

సంగారెడ్డి: బైక్, లారీ ఢీ.. యువకుడు మృతి

image

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. నిజాంపూర్ వైపు నుంచి సదాశివపేటకు బైక్ పై వెళ్తున్న యువకుడిని జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు సదాశివపేట మండలం వెల్లూర్ గ్రామస్థుడిగా గుర్తించారు.

News March 28, 2024

ఝారసంగం: BRSకు బిగ్ షాక్

image

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలానికి చెందిన 25 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ ఛైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, తదితరులు బీఆర్ఎస్‌ను వీడారు. అనంతరం జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ సమక్షంలో సుమారు 200 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు.

News March 28, 2024

నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి టీ.జీవన్ రెడ్డి నేపథ్యమిదే!

image

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా టీ.జీవన్ రెడ్డిని ఆపార్టీ అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. ఈయన 1983లో TDP నుంచి తొలిసారిగా జగిత్యాల MLAగా ఎన్నికై.. మంత్రివర్గంలో చేరారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌లో చేరి 1989, 1996, 1999, 2004, 2014లలో కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా గెలిచారు. 2019లో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ MLCగా ఎన్నికయ్యారు.

News March 28, 2024

ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులు ముగ్గురు ఉపాధ్యాయులే

image

అదిలాబాద్ ఎంపీకి జరుగుతున్న పోటీల్లో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు గతంలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ గతంలో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందారు. BRS అభ్యర్థి ఆత్రం సక్కు సైతం గతంలో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఎమ్మెల్యే అయ్యారు. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ఇటీవల ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఎంపీ బరిలో నిలిచారు.

News March 28, 2024

నేటి నుంచి భద్రాచలం- ఖమ్మం త్రీ స్టాప్ సర్వీసులు

image

నేటి నుంచి భద్రాచలం-ఖమ్మం మధ్య త్రీ స్టాప్ డీలక్స్ బస్సులను నడపనున్నట్లు భద్రాచలం డీఎం రామారావు తెలిపారు. ఈ బస్సులు భద్రాచలం-ఖమ్మం మధ్య పాల్వంచ, కొత్తగూడెం, ఏన్కూరు స్టాప్‌ల్లో మాత్రమే ఆగుతాయని తెలిపారు. ఈ బస్సుల్లో ఆధార్ కార్డుతో మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

News March 28, 2024

WGL: అదృశ్యమయ్యాడు.. శవమై కనిపించాడు

image

అదృశ్యమైన ఓ యువకుడు బావిలో శవమై తేలిన ఘటన KNR జిల్లా తిమ్మాపూర్‌లో జరిగింది. CI స్వామి వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన అభిలాశ్(20) తిమ్మాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా చేస్తున్నాడు. అయితే ఈనెల 1న రాత్రి అభిలాశ్ అదృశ్యమయ్యాడు. బుధవారం సాయంత్రం కుళ్లిన స్థితిలో ఓ వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించగా.. ఫోన్, దుస్తుల ఆధారంగా అభిలాశ్‌గా పోలీసులు గుర్తించారు.

News March 28, 2024

ఆదిలాబాద్ పార్లమెంట్‌లో త్రిముఖ పోటీ

image

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్టకేలకు అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ గతంలోనే తమ అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి పేరు ప్రకటించడంలో ఉత్కంఠ జరుగగా తాజాగా తమ అభ్యర్థి పేరు ప్రకటించేశారు. BJP నుండి గోడం నగేష్, CONG నుంచి సుగుణక్క, BRS నుండి ఆత్రం సక్కు ఎన్నికల బరిలో ఉండనున్నారు. ఇక ప్రచారాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ మూడు పార్టీల నుండి ఈసారి త్రిముఖ పోటీ తప్పేలా లేదు.

News March 28, 2024

HYD:రంజాన్ వేళ.. డ్రై ఫ్రూట్స్‌కు FULL డిమాండ్

image

రంజాన్ వేళ HYD నగరంలో డ్రై ఫ్రూట్స్‌కు డిమాండ్ పెరిగింది. HYD దేశంలోనే ఖర్జూరాలను అధికంగా అవిక్రయించే నగరంగా పేరుగాంచింది. ఏటా సుమారు 400 ట్రక్కుల ఖర్జురాలను విక్రయిస్తారు. దాదాపు బేగంబజార్లో 40 రకాల ఖర్జూరాలు విక్రయిస్తుండగా.. కిమియా , షికారి, కూద్రి, మజాపాతి, కాల్మీ ప్రసిద్ధిగాంచినవి. మరోవైపు అమెరికా, అరబ్ దేశాల నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి HYD నగరానికి డ్రై ఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి.