India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. RRR నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా కంప్లీట్ చేసేందుకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి పెద్దవాగు ప్రాజెక్టు నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెగిపోయిన ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. అధిక మొత్తంలో వరద రావడంతోనే ప్రాజెక్టు తెగిపోయిందని అన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ఉన్నారు.
బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీ వాసులు వర్షాకాలం వచ్చిందంటే భయపడే పరిస్థితి నెలకొంది. సోమవారం ఓ మహిళకు విపరీతమైన జ్వరం రావడంతో స్థానికులు సుమారు 3 కిలోమీటర్ల మేర కాలినడకన తీసుకువెళ్లి ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాలు మారుతున్న సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆరోపించారు. కాగా సదరు మహిళను 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
నిజామాబాద్ నగరంలోని పెద్దబజారు యూనియన్ బ్యాంకు స్కాంలో ప్రధాన నిందితుడైన మేనేజర్ అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మేనేజర్ అజయ్ ఖాతాదారుల నుంచి కోట్ల రూపాయలు కొట్టేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. కేసు విచారిస్తున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని నిజామాబాదు తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధర రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. గత శుక్రవారం రూ.2,750 రికార్డు ధర పలికిన క్వింటా మక్కలు.. ఈరోజు సైతం అదే ధర పలికాయి. రెండు నెలలుగా మక్కల ధరలు భారీగా పెరగడంతో మొక్కజొన్న పండించిన రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న లాగా ఇతర సరుకులు ధరలు కూడా పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.
కళ్యాణి ప్రాజెక్ట్ రెండు వరద గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు నుంచి 450 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి, మరో 200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ఆయకట్టుకు విడుదల చేస్తున్నట్లు ఏఈ శివ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లకు గాను ప్రస్తుతం 408.50 మీటర్లు నీరు నిల్వ ఉందన్నారు. ఎగువ భాగం నుంచి 650 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లోగా వస్తున్నట్లు ఏఈ తెలిపారు.
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. గోదావరి, ప్రాణహిత నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అన్నారం బ్యారేజీలో 119 మీటర్ల లెవల్‌కు గోదావరి నదికి 16,870 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. కాళేశ్వరం వద్ద 101.01 మీటర్ల వరద ప్రవాహం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద 6,770 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
జీడిమెట్ల డివిజన్ పరిధి వెన్నెలగడ్డలో నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP) పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. STP పరిసరాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఈ నెల 27న CM రేవంత్ రెడ్డి ఈ ప్లాంటును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.
తెలంగాణ సాధన కోసం తాను సాగించిన పోరాటాలలో దాశరథి అందించిన స్ఫూర్తి ఇమిడి ఉన్నదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం, అభ్యుదయ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా వారందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం సాహిత్యం తెలంగాణ భవిష్యత్తు తరాలకు నిత్య స్ఫూర్తిదాయకమని కేసీఆర్ అన్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో సోమవారం స్వామివారు ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. బేడా మండలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.