India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జీడిమెట్ల డివిజన్ పరిధి వెన్నెలగడ్డలో నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP) పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. STP పరిసరాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఈ నెల 27న CM రేవంత్ రెడ్డి ఈ ప్లాంటును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.
నల్గొండ: కేతపల్లి మండలం బొప్పారం గ్రామం నుంచి కేతేపల్లి వరకు మూసి సుందరీకరణ, పర్యాటక కేంద్రంగా గుర్తించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం AICC అగ్రనేత ప్రియాంక గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌తో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ప్రియాంక గాంధీని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తదితర అంశాలను ప్రియాంక గాంధీకి వారు వివరించారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పంటల సాగు ఊపందుకుంది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయభూములు తడిసి విత్తనాలు వేసుకోవడానికి అనుకూలంగా మారాయి. దీంతో జిల్లాలో నల్లరేగడి భూములు అధికంగా ఉండడంతో రైతులు పత్తి, మొక్కజొన్న, తదితర పంటలు సాగు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్నిచోట్ల రైతులు భూమిని దున్ని విత్తనాలు నాటుతున్నారు.
మహబూబ్‌నగర్‌లో ఐడీవోసీ కార్యాలయం ఉద్యోగి మృతిచెందారు. ఎస్టీవో మోహన్ రాజ్ విధులకు హాజరవుతుండగా నీరసంతో కిందపడి చనిపోయినట్లు తెలిసింది. మృతుడు మోహన్ రాజ్ స్వస్థలం వనపర్తి జిల్లా. ఘటనకు సంబంధించి మరిన్ని సమాచారం తెలియాల్సి ఉంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కి నేడు మిర్చి తరలి రాగా కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. తేజ మిర్చి శుక్రవారం క్వింటాకు రూ.17, 500 పలకగా.. నేడు రూ.17,800 పలికింది. అలాగే 341 రకం మిర్చి శుక్రవారం రూ.15,200 పలకగా.. నేడు రూ.14,000 ధర వచ్చింది. వండర్ హాట్ (WH) మిర్చికి రూ.13,500 ధర రాగా.. నేడు రూ.15,000 వచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో భారీ వర్షాలకు ధ్వంసం అయిన పెద్దవాగు ప్రాజెక్టును ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ పాల్గొన్నారు.
అల్లాదుర్గం మండలంలో విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ గణేశ్(24) మృతి చెందాడు. అల్లాదుర్గం గ్రామానికి చెందిన గణేశ్ రెడ్డిపల్లి, వెంకట్రావుపేటలో లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం అల్లాదుర్గం హెల్పర్ రామకృష్ణతో కలిసి స్థానిక మెట్టుగడ్డ చౌరస్తాలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజు వేసే క్రమంలో షాక్ తగిలి కిందపడిపోయాడు. వెంటనే 108లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగువిస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండంతో రైతులు వరి నాట్ల జోరు పెంచారు. అలాగే ఇప్పటి వరకు 1.55 లక్షల ఎకరాల్లో పత్తిని విత్తుకోగా ఈ నెలాఖరు వరకు 1.90 లక్షల ఎకరాలకు సాగు పెరగనుంది అని అధికారులు అంచన వేస్తున్నారు. పలు రకాల పంటల సాగుకు మరో 10 – 15 రోజులు ఉండటంతో సాగు విస్తీర్ణం పెరగనుంది.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి వేళ జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ ఆల్టో కారు గుర్తుతెలియని వ్యక్తిని ఢీ కొట్టి నాలుగు కిలోమీటర్ల మేరకు ఈడ్చుకు వచ్చింది. కంకులు టోల్ ప్లాజా వద్ద కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.