Telangana

News July 22, 2024

NLG: రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి

image

ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 28, 2024 నాటికి భూమి పట్టా పొందిన రైతులంతా అర్హులని పేర్కొన్నారు. నామిని మరణించిన, పేరు మార్పు, ఇతర సవరణలు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 22, 2024

కరీంనగర్: తల్లి బాగోగులు పట్టించుకోని కొడుకులు

image

కరీంనగర్ మండలం నగునూరు గ్రామంలో వృద్ధురాలు కోట లచ్చమ్మకు నలుగురు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కొడుకులెవరూ పట్టించుకోకపోవడంతో అనాథగా మారింది. శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న ఆమె కాలు జారి పడ్డారు. స్థానికులు కుటుంబీకులకు తెలిపినా ఎవరూ రాలేదు. ఈ విషయమై వృద్ధురాలి కుమార్తె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు MRO, పోలీసులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News July 22, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి జిల్లాలో సోమవారం నమోదైన వివరాలిలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వాత్త్వర్లపల్లి 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా పెబ్బేరు 9.5 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో 6.8 మి.మీ, గద్వాల జిల్లా బీచుపల్లిలో 6.4 మి.మీ, నారాయణపేట జిల్లా ధన్వాడలో 4.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News July 22, 2024

భద్రాచలం: గోదావరి వద్ద సెల్ఫీ దిగితే.. పోలీస్ స్టేషన్‌కే

image

గోదావరిలో వదర ఉధృతి భద్రాచలంలో జిల్లా రెవెన్యూ అధికారుల పలు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోందని అధికారులు చెప్పారు. ఇప్పటికే గోదావరి రెండో ప్రమాద హెచ్చరికకు దగ్గరలో ఉందన్నారు. కాగా, గోదావరి బ్రిడ్జి పై సెసెల్ఫీలు, ఫొటోలు దిగకూడదని అధికారులు నిబంధన పెట్టారు. నిబంధన ఉల్లంఘించి సెల్ఫీలు దిగితే పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని హెచ్చరించారు.

News July 22, 2024

MBNR: మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ !

image

ఉమ్మడి జిల్లాలోని మహిళలు వివిధ వ్యాధులతో సతమతం అవుతున్నట్లు ‘ఆరోగ్య మహిళ’ ప్రత్యేక వైద్య పరీక్షల్లో తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 64 PHCల్లో 340 మంది మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు గుర్తించారు. ముఖ్యంగా అతివల్లో క్యాన్సర్‌ ముప్పు చాపకింద నీరులా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పని ఒత్తిడితో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని.. అవగాహనతో వ్యాధిని నయం చేసుకోవచ్చని గద్వాల DMHO శశికళ అంటున్నారు.

News July 22, 2024

22.7 ఫీట్లకు చేరిన పాకాల సరస్సు నీటి మట్టం

image

వరంగల్ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన పాకాల సరస్సు సోమవారం ఉదయానికి 22.7 ఫీట్లకు నీటి మట్టం చేరుకుంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు సరస్సులోకి వచ్చి చేరుతోంది. పాకాల సరస్సు కింద సుమారు 35 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుత నీటిమట్టంతో సాగునీటికి ఎలాంటి డోకా లేదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News July 22, 2024

HYD: మూడ్రోజు‌లు సెలవులు ఇవ్వాలని డిమాండ్

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని BC సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలలకు 3 రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో 3 రోజులు వానలు పడతాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని హైదరాబాద్‌ వేదికగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

News July 22, 2024

HYD: మూడ్రోజు‌లు సెలవులు ఇవ్వాలని డిమాండ్

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని BC సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలలకు 3 రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో 3 రోజులు వానలు పడతాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని హైదరాబాద్‌ వేదికగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

News July 22, 2024

ADB: పారిశుద్ధ్య వాహనాలకు.. జీపీఎస్ ట్రాకింగ్ 

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బల్దియా యంత్రాంగం పారిశుద్ధ్య వాహనాలపై నిఘాపెట్టింది. పట్టణంలో చెత్త సేకరణకు వెళ్లిన ట్రాలీలు, ట్రాక్టర్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో తెలుసుకునేందుకు.. GPS ట్రాకింగ్ విధానం అమలు చేస్తోంది. చోదకులు వాహనాలను దారి మళ్లించడం, వాటిని ఎక్కడ పడితే అక్కడ నిలిపి విశ్రాంతి తీసుకోవడం వంటి పనులకు అడ్డుకట్ట పడనుంది. కార్మికుల పనితీరును అధికారులు తెలుసుకోనున్నారు.

News July 22, 2024

వరంగల్: పత్తి క్వింటా రూ.7,150

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. ధర మాత్రం గత వారంతో పోలిస్తే భారీగా పడిపోయింది. మార్కెట్‌లో క్వింటా పత్తి ధర నేడు రూ.7,150 పలికింది. గతవారం రూ.7,400 వరకు పలికిన పత్తి ఈరోజు భారీగా పడిపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.