Telangana

News September 8, 2024

ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన BSNL

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 19 లక్షల చరవాణి, 6వేల వరకు FTTH కలెక్షన్లు ఉన్నాయి. జూలైలో 11,305, ఆగస్టులో 12,718 మంది కొత్తగా BSNL సిమ్ కార్డులు కొనుగోలు చేశారు. 2 నెలల నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 108 ప్రాంతాల్లో 4G టవర్లు ఏర్పాటు చేశామని, ఇంకా 60 4G టవర్లు అందుబాటులో తీసుకొస్తామని, BSNLలో రూ.10 నుంచి రూ.3వేల వరకు ధరలతో 12 రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయని డీజీఎం వెంకటేశ్వర్లు తెలిపారు.

News September 8, 2024

ఏన్కూరు: పొంగి పొర్లుతున్న వాగులు.. రాకపోకలకు ఆటంకం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా శనివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. తీగల బంజారా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్లిపాడు నుంచి కొత్తగూడెం వెళ్లాలనుకునే ప్రయాణికులు తల్లాడ వైపుగా వెళ్లాలని పోలీసు అధికారులు చెప్పారు. మరొకవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News September 8, 2024

నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి

image

రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాకి రానున్నారు. ఉదయం 9:30 గంటలకు మంత్రి పట్టణానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నల్గొండ పట్టణంలోని వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

News September 8, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆదివారం ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.39,906 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.13,900, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.21,700, అన్నదానం రూ.3,306 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News September 8, 2024

WOW.. జగిత్యాల జిల్లాలో 52 ఫీట్ల మట్టి గణపతి!

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్‌లో సాయిబాబా ఆలయం పక్కన 52 ఫీట్ల మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రతిష్ఠాపన పూజలో MLA సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. 11 రోజుల పూజల అనంతరం మండపం వద్దనే నీళ్లతో వినాయకుని నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పెద్దపల్లి, KNRలో భారీ గణపతులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

News September 8, 2024

అన్నారం షరీఫ్ దర్గాలో అక్రమ వసూళ్లు!

image

అన్నారం షరీఫ్ యాకూబ్ బాబా దర్గాలో వసూళ్ల పర్వం కొనసాగుతోందన భక్తులు మండిపడుతున్నారు. టెండర్ దారులు సొంత రశీదు టిక్కెట్లు ముద్రించి డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. కందూరు చేయాలంటే రూ.2వేలకు పైగానే చెల్లించుకోవాల్సిందేనని వాపోతున్నారు. దర్గాలో భక్తుల నుంచి బలవంతంగా కానుకల పేరిట వసూలు చేస్తున్నారని, ఈ అక్రమాలపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. మీరూ వెళ్తే కామెంట్ చేయండి.

News September 8, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భారీ వర్ష సూచన
✓ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
✓వరద ప్రభావిత ప్రాంతాల పర్యటించనున్న మంత్రి పొంగులేటి
✓వరదలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
✓కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News September 8, 2024

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 9 గేట్లు ఓపెన్

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు నిండటంతో శనివారం రాత్రి 9 గేట్లను ఓపెన్ చేశారు. 52,013 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకి ఇన్ ఫ్లోగా అంతే మొత్తంలో క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగుల (80.5TMC)కు గాను, తాజాగా 1,088.9 అడుగుల (80.053TMC) నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News September 8, 2024

HYD: కొత్తపేటలో 54 అడుగుల కాలభైరవ మట్టి గణపతి

image

HYD కొత్తపేటలోని మోహన్ నగర్‌లో వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణహితంగా భారీ మట్టి గణపతిని తిరంగా యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేశారు. 18 ఏళ్ల నుంచి గణపతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 54 అడుగుల కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిని ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. ప్రముఖ శిల్పి నగేశ్ మట్టి గణపతిని రూపొందించినట్లు తెలిపారు.

News September 8, 2024

HYD: కొత్తపేటలో 54 అడుగుల కాలభైరవ మట్టి గణపతి

image

HYD కొత్తపేటలోని మోహన్ నగర్‌లో వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణహితంగా భారీ మట్టి గణపతిని తిరంగా యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేశారు. 18 ఏళ్ల నుంచి గణపతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 54 అడుగుల కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిని ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. ప్రముఖ శిల్పి నగేశ్ మట్టి గణపతిని రూపొందించినట్లు తెలిపారు.