Telangana

News July 22, 2024

శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 20,023 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1068.20 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 20.518 టీఎంసీ నీరు నిల్వ ఉంది.

News July 22, 2024

భద్రాచలం: నమోదైన టాప్-5 నీటిమట్టం వివరాలు

image

భద్రాచలం వద్ద గతంలో నమోదైన టాప్-5 గోదావరి నీటిమట్టం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1) 1986 ఆగస్టు 16న 75.6 అడుగులు, 2) 2022 జులై 16న 71.3 అడుగులు, 3) 1990 ఆగస్టు 24న 70.8 అడుగులు, 4) 2006 ఆగష్టు 6న 66.9 అడుగులు, 5) 1976 జూన్ 22న 63.9 అడుగులుగా గోదావరి నీటిమట్టం నమోదైంది. కాగా ప్రస్తుతం గోదావరి వద్ద 47.3 అడుగులుగా నీటిమట్టం కొనసాగుతోంది.

News July 22, 2024

సింగూర్ ప్రాజెక్టులో చేరుతున్న 1270 క్యూసెక్కుల వరద

image

ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన సింగూర్‌కు స్వల్ప వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో జలాశయానికి 1270 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని ఏఈ మహిపాల్ రెడ్డి సోమవారం తెలిపారు. సింగూరు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 TMCలు కాగా ప్రస్తుతం 13.702 TMCల నీరు ఉంది. ప్రస్తుతం 391 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.

News July 22, 2024

నేలకొండపల్లి: నాన్నకు ప్రేమతో విగ్రహం చేయించిన కుమారులు

image

తండ్రి కన్నుమూసినా ఎప్పటికీ తమ కళ్ల ముందే ఉండాలని ఆయన కుమారులు తండ్రి విగ్రహాన్ని చేయించారు. నేలకొండపల్లి మండలం భైరవునిపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గుండపనేని పరాంకుశ రావు ఏడాది క్రితం మృతి చెందాడు. ఆయన కుమారులు రాంచందర్ రావు, లక్ష్మణరావు ఎప్పటికీ తమ కళ్ల ముందే తండ్రి రూపం ఉండాలనే భావనతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రూ.80 వేలతో ఆయన విగ్రహం చేయించి తమ పొలంలో మందిరం నిర్మించారు.

News July 22, 2024

పార్వతి బ్యారేజీ కరకట్టకు పొంచి ఉన్న ప్రమాదం!

image

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పార్వతి (సుందిల్ల) బ్యారేజీ కరకట్టకు ప్రమాదం పొంచి ఉంది. మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు పార్వతి బ్యారేజీలోకి వచ్చిన వరదతో కరకట్ట మరమ్మతుకు గురైంది. అప్పటి అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. కాగా ప్రస్తుతం 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కరకట్ట తెగిపోయే అవకాశం ఉండటంతో అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

News July 22, 2024

MDK: రైతుబీమా దరఖాస్తులకు ఆగస్టు 5 చివరి తేదీ

image

రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆగస్టు 5 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోని 18 నుంచి 59 ఏండ్ల వయసు గల రైతులు ఏఈవోలకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించింది. ఈనెల 28 వరకు పట్టాదారు పాస్‌బుక్‌ వచ్చిన రైతులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

News July 22, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,300 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,350 పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News July 22, 2024

ఆదిలాబాద్: మరో మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

image

రాగల మూడు రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30కి.మీ నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారు, నది తీరాన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
>>>TAKE CARE

News July 22, 2024

HYD: బాలికలపై లైంగిక వేధింపులు ఆపండి: పోలీసులు

image

‘బాలికలపై లైంగిక వేధింపులను ఆపండి.. పిల్లలని చైతన్యపరుద్దాం’ అంటూ రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు పిలుపునిచ్చారు.
☛ప్రవర్తనలో ఆకస్మిక మార్పు
☛ఇతరుల నుంచి దూరంగా ఉండటం
☛శరీరంలో అనుమానాస్పద, వివరించలేని మార్పులు
☛భయపడుతూ ఉండటం
☛ఆహారం, నిద్రలో మార్పులు ఉంటే‌ ఆరా తీయాలన్నారు. ఇదే సమయంలో పిల్లలకు కీలక సూచన చేశారు. శరీర భాగాలను ఎవరైనా తాకితే పేరెంట్స్ లేదా 1098, 100, 101కు డయల్ చేయాలన్నారు.
SHARE IT

News July 22, 2024

HYD: బాలికలపై లైంగిక వేధింపులు ఆపండి: పోలీసులు

image

‘బాలికలపై లైంగిక వేధింపులను ఆపండి.. పిల్లలని చైతన్యపరుద్దాం’ అంటూ రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు పిలుపునిచ్చారు.
☛ప్రవర్తనలో ఆకస్మిక మార్పు
☛ఇతరుల నుంచి దూరంగా ఉండటం
☛శరీరంలో అనుమానాస్పద, వివరించలేని మార్పులు
☛భయపడుతూ ఉండటం
☛ఆహారం, నిద్రలో మార్పులు ఉంటే‌ ఆరా తీయాలన్నారు. ఇదే సమయంలో పిల్లలకు కీలక సూచన చేశారు. శరీర భాగాలను ఎవరైనా తాకితే పేరెంట్స్ లేదా 1098, 100, 101కు డయల్ చేయాలన్నారు.
SHARE IT