Telangana

News July 22, 2024

వరంగల్: యువకుడి మృతి

image

మానసిక స్థితి సరిగా లేని యువకుడు బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటకు చెందిన ఎర్ర వంశీ (24) HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన అతడు ఈ నెల 19న HYD వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి బయల్దేరాడు. ఆదివారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో వంశీ మృతదేహం కనిపించడంతో రైతులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 22, 2024

కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

image

కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. గుడిపల్లి పోలీసుల వివరాల ప్రకారం.. తిర్మలగిరిసాగర్ మండలం అల్వాల వాసి కొండల్(19), అజయ్ కలిసి బైక్‌పై వెళ్తూ మిర్యాలగూడకు వెళ్తున్న RTC బస్సును ఢీకొట్టారు. ప్రమాదంలో కొండల్ అక్కడికక్కడే మృతి చెందగా, గాయాలైన అజయ్‌ను మెరుగైన చికిత్స కోసం HYD తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు SI నర్సింహులు తెలిపారు.

News July 22, 2024

NLG: రేబిస్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రణాళిక

image

ఉమ్మడి జిల్లాను రేబిస్ రహిత జిల్లాగా మార్చేందుకు పశు సంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ప్రణాళిక సిద్ధం చేశాయి. ఉమ్మడి జిల్లాలో 1.10 లక్షలకు పైగా వీధి కుక్కలు, పదివేలకు పైగా పెంపుడు కుక్కలు ఉన్నాయి. రేబిస్ నివారణకు అవసరమైన డయాగ్నస్టిక్ ల్యాబ్లను ఏర్పాటు చేనున్నట్లు తెలిసింది. ఈ ల్యాబ్‌ల్లో యాంటీ రేబిస్ ఎలిమినేషన్‌పై పరీక్షలు నిర్వహిస్తారు.

News July 22, 2024

గద్వాల: దంపతుల మధ్య గొడవ.. భర్త సూసైడ్

image

దంపతుల మధ్య గొడవతో భర్త సూసైడ్ చేసుకున్నాడు. గద్వాలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సుధీర్‌, శ్వేత దంపతులు HYD అత్తాపూర్‌‌లో ఉంటున్నారు. శనివారం శ్వేత సోదరుడి ఇంటికి వెళ్లారు. అక్కడ దంపతుల మధ్య గొడవ జరగ్గా విసుగెత్తిన సుధీర్‌ సెల్‌ఫోన్‌ నేలకేసికొట్టి తన ఇంటికి వచ్చేశారు. కోపంతో వెళ్లారని అక్కడే ఉన్న శ్వేత.. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి సుధీర్‌ ఉరేసుకొని కనిపించారు. ఘటనపై కేసు నమోదైంది.

News July 22, 2024

NZB: స్టాక్ మార్కెట్ పేరుతో రూ.35.87 లక్షల మోసం

image

స్టాక్ మార్కెట్ మోజులో పడి ఓ యువకుడు డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ ఘటన NZB జిల్లా డొంకేశ్వర్ మండలంలో జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఇన్‌స్టాలో స్టాక్ మార్కెట్ సంబంధించి యాడ్ చూశారు. దాన్ని ఫాలో అయ్యి రూ.లక్ష డిపాజిట్ చేశాడు. అందులోంచి లాభామొచ్చిన ₹5వేలు విత్‌డ్రా చేశాడు. అది నమ్మి మరో రెండు ఖాతాలు తీసి 19 సార్లు రూ.35.87లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఈసారి మాత్రం డబ్బులు రాలేదు.

News July 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఖమ్మం జిల్లాలో నేడు పలు చోట్ల వర్షాలు
> రెండో ప్రమాద హెచ్చరిక దిశగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
> లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
> నేడు పెద్దవాగును పరిశీలించనున్న మంత్రి పొంగులేటి
> భద్రాచలం రామయ్య, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> పలు మండలాల్లో రుణమాఫీ సంబరాలు

News July 22, 2024

MDK: ఫోన్ కొనివ్వలేదని విద్యార్థిని సూసైడ్

image

సెల్‌ఫోన్ కొనివ్వలేదన్న మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. SI బాల్‌రాజు తెలిపిన వివరాలు.. చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన రుచిత(18) మెదక్ డిగ్రీ కాలేజీలో ఫస్టియర్ చేస్తుంది. అక్కడే హాస్టల్‌కు వెళ్తానని, ఫోన్ ఇప్పించమని తండ్రిని కోరింది. కొన్ని రోజుల తర్వాత కొనిస్తానని చెప్పి తండ్రి పొలానికి వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన రుచిత ఇంట్లో ఉరేసుకుంది. ఘటనపై కేసు నమోదైంది.

News July 22, 2024

ఖమ్మం: వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా.. NTR జిల్లా వాసి వెంకటరత్నం(50) కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన హైమవతి(45) కారు ఢీకొట్టడంతో మృతి చెందారు. ముదిగొండ మండలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముత్తారానికి చెందిన సింహాద్రి(20) బైక్‌పై ఖమ్మం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా వారి కిష్టాపురం శివారులో డోజర్ ఢీకొంది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.

News July 22, 2024

ఆదిలాబాద్: 26 నుంచి KU పరిధిలో పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్ బీటెక్ రెండో, మూడో సెమిస్టర్ పరీక్షలు జులై 26 నుంచి నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహాచారి తెలిపారు. జులై 26, 30, ఆగస్టు 1,3,5 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 2, 3 సెమిస్టర్లకు చెందిన రెగ్యులర్, సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు.

News July 22, 2024

పాలేరుకు చేరిన నాగార్జున సాగర్ జలాలు

image

నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా శనివారం నీరు విడుదల చేయగా ఆదివారం సాయంత్రం పాలేరు రిజర్వాయర్‌కు చేరాయి. ప్రస్తుతం 1,100 క్యూసెక్కుల నీరు చేరుతుండగా అది క్రమంగా 3వేల క్యూసెక్కులకు చేరనుంది. రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయనుండగా.. నాలుగు రోజుల పాటు నీటి సరఫరా కొనసాగుతోంది. రిజర్వాయర్ నీటిమట్టం ఆదివారానికి 5.55 అడుగులకు పడిపోగా సాగర్ జలాల చేరికతో క్రమంగా పెరుగుతోంది.