India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో చెరువుల్లో జలకళ సంతరించుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 816 సాగునీటి చెరువులున్నాయి. వాటిలో 20 పూర్తిగా నిండగా.. 61 చెరువుల్లో 75 నుంచి 100 శాతం వరకు నీరు చేరింది. 273 చెరువుల్లో 50 నుంచి 75 శాతం, 400 చెరువుల్లో 25 శాతం మేరకు నీరు చేరింది. మరో రెండు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ప్రకటించారు.
వీధి కుక్క దాడిలో చిన్నారికి గాయాలైన ఘటన జగిత్యాల జిల్లాలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు.. మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌లో చిన్నారి వేములవాడ రిషిక ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఓ వీధి కుక్క చిన్నారిపై ఎగబడి దాడి చేసింది. దీంతో చిన్నారి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామంలో కుక్కల బెడద ఉందని ప్రజలు వాపోతున్నారు.
వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో ముసురు వాన కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెక్ డ్యాంలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులు, జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యప్తంగా వారి నాట్లు జోరందుకున్నాయి. బారి వర్షాలకు జిల్లాల వారీగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఏటా ఉమ్మడి జిల్లాలో వానకాలం, యాసంగి సీజన్లో రైతులకు ఆశించిన స్థాయిలో పంట రుణాలు అందటం లేదు. పంట రుణమాఫీ చేస్తారని రైతులు రెన్యూవల్ చేసుకోవడం లేదనీ, కొత్త రుణాలు ఇవ్వకపోవడానికి ఇదే కారణమని బ్యాంకర్లు సాకులు చెబుతూ వచ్చారు. ఈ ఏడాది ప్రభుత్వం పంట రుణమాఫీ చేయడంతో బ్యాంకర్లు కొత్త రుణాలను లక్ష్యం మేర మంజూరు చేస్తారన్న ఆశలు రైతుల్లో చిగురిస్తున్నాయి.
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 1,14,645 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 822.5 అడుగుల వద్ద 42.7386 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో స్థానికంగా 2.80 మి.మీ.,ల వర్షపాతం నమోదైంది. అలాగే జలాశయంలో 63 క్యూసెక్కుల నీరు ఆవిరైంది.
ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ అన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని, పొలాల వద్ద రైతులు జాగ్రత్తంగా ఉండాలని చెప్పారు. విపత్కర సమయంలో పోలీస్ కంట్రోల్ నంబర్ 8712657888, డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు.
చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో శ్రీ ఆంధోల్ మైసమ్మ బోనాల ఉత్సవాలను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో దేవాలయ ఈఓ ఎస్.మోహన్‌బాబు బోనం సమర్పించారు. చండీహోమం నిర్వహించారు. అనంతరం వేలాదిగా తరలొచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదానాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి ప్రారంభించారు.
ఆరు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో సుమారు 5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. మొత్తం 11 ఏరియాల్లో రోజుకు 2 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 1.10 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దీంతో ఆరు రోజుల్లో సుమారు 5 లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. సింగరేణి వ్యాప్తంగా 18 ఓసీల్లో ఆరు రోజులు 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబికి అంతరాయం వాటిల్లింది.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్ లో ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మన రాష్ట్రానికి ముఖ్యమైన సాంస్కృతిక, వారసత్వ ప్రాంతాల పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి ఇలాంటి సమావేశాలు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.
మెదక్ పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. వైద్య కళాశాలను క్షుణ్ణంగా పరిశీలించి మెడికల్ సూపరింటెండెంట్‌కు సూచనలు, ఆదేశాలు చేశారు. వైద్య కళాశాలకు డాక్టర్లు, సిబ్బందిని నియమించుకోవడం కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ రవీంద్ర కుమార్, సూపరింటెండెంట్ చంద్ర శేఖర్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.