Telangana

News March 27, 2024

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఏడేళ్ల బాలుడి మృతి

image

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పెంబర్తి వద్ద ఆటోను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు ఈశ్వర్ మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

News March 27, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాకు గుడ్ న్యూస్.. ప్రత్యేక నిధులు వచ్చాయ్!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి ఎద్దడి నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. NLG జిల్లాకు రూ. 4.5 కోట్లు, SRPTకు రూ. 2.70 కోట్లు, యాదాద్రి జిల్లాకు రూ.1.82 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక అభివృద్ధి నిధులు నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున 12 నియోజకవర్గాలకు రూ.120 కోట్లు గత నెలలో మంజూరు చేశారు. వాటిలో నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున తాగు నీటికి ఖర్చు చేయనున్నారు.

News March 27, 2024

MBNR: సోషల్ మీడియాపై పోలీసుల సూచనలు

image

✓వాట్సప్, ఫేస్‌బుక్‌లోని ప్రతి పోస్టింగ్‌కు అడ్మిన్ బాధ్యత తీసుకోవడంతో పాటు గ్రూపులోని ప్రతి సభ్యుని పేరు, చిరునామా తెలిసి ఉండాలి.
✓ సభ్యులను గ్రూపులో చేర్చుకునే ముందు వారి అనుమతి తీసుకోవాలి.
✓నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టే సభ్యులను తొలగించి స్థానిక పోలీసులకు తెలియజేయాలి.
✓అడ్మినే వివాదాస్పద, అభ్యంతరకర, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే IT చట్టం IPC సెక్షన్ 153(ఎ) కింద కేసు నమోదు.

News March 27, 2024

కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఎంతంటే!

image

భిక్కనూర్ 38.7, బీబీపేట్ 37.7, బాన్సువాడ 35.8, మద్నూర్ 39.2, గాంధారి 35.7, ఎల్లారెడ్డి 37.4, కామారెడ్డి 39.9, రామారెడ్డి 37.8, నసురుల్లాబాద్ 36.2, బిచ్కుంద 40.8, నాగిరెడ్డిపేట్ 37.3,పిట్లం 38.5, లింగంపేట్ 37.3, పెద్ద కొడపగల్ 39.9, మాచారెడ్డి 36.6, దోమకొండ 37.7,సదాశివనగర్ 38.0, రాజంపేట 35.2 డోంగ్లి 36.0, నిజాంసాగర్ 38.1 బీర్కూర్ 34.9, జుక్కల్ 38.2, తాడ్వాయి 39.డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 27, 2024

ఖమ్మం మట్టి వాసన తెలిసిన వ్యక్తి నేను: తాండ్ర 

image

ఖమ్మం మట్టి వాసన తెలిసిన వ్యక్తి తానని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్రం రూ. 12వేల కోట్ల (నేషనల్ హైవేలు, సంక్షేమ పథకాలు కలుపుకొని)ఖర్చుచేసినట్లు తెలిపారు. తాను గెలిస్తే మరింతగా జిల్లాను అభివృద్ధి చేస్తానన్నారు. పలు సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సారి ఖమ్మం స్థానం కమలం కైవసం చేసుకుంటుందన్నారు.

News March 27, 2024

మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలోని ఓటర్లు (1/2)

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల వివరాలిలా..
✓ మహబూబ్‌నగర్ అసెంబ్లీలో – 2,58,658
✓ జడ్చర్ల అసెంబ్లీ- 2,23,222
✓ దేవరకద్ర అసెంబ్లీ – 2,39,077
✓ నారాయణపేట అసెంబ్లీ – 2,35,517
✓ మక్తల్ అసెంబ్లీ – 2,43,338
✓ కొడంగల్ అసెంబ్లీ – 2,42,267
✓ షాద్ నగర్ అసెంబ్లీ – 2,38,338 మంది
ఉన్నారు. కాగా.. ఓటర్ల నమోదుకు మరోసారి అవకాశం కల్పించారు.

News March 27, 2024

మహబూబాబాద్‌లో రసవత్తరంగా MP పోరు

image

మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో లోక్ సభ పోరు రసవత్తరంగా మారింది. 3 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో వారు ఇప్పటికే సమావేశాలు, కార్యాచరణలు రూపొందించుకుంటున్నారు. BRS నుంచి మాలోతు కవిత, BJP నుంచి సీతారాంనాయక్, కాంగ్రెస్ నుంచి బలరాంనాయక్‌లు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బరిలో నిలవనున్న ముగ్గురికి గతంలో ఎంపీలుగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో పోరు ఆసక్తిగా మారింది.

News March 27, 2024

కరవును రాజకీయం చేయొద్దు: మంత్రి పొన్నం

image

బీఆర్ఎస్ కరవు, వర్షపాతానికి సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కరవుకి కాంగ్రెస్, బీఆర్ఎస్ కారణం కాదని, అది ప్రకృతి ప్రభావం అని పేర్కొన్నారు. ప్రకృతిలో ఏర్పడ్డ ఇబ్బందులకు ఎవరూ బాధ్యులు కారన్నారు. వేసవిలో తాగునీరు, సాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

News March 27, 2024

సూర్యాపేట: BRSను TRSగా మార్చండి.. KTRకు EX.MLA రిక్వస్ట్..

image

బీఆర్ఎస్ పేరును తిరిగి TRSగా మార్చాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా తాజాగా పోస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్యవాదుల దాడిని అరికట్టాలన్నా, ప్రాంతీయతత్వం బతకాలన్నా.. బీఆర్ఎస్ పేరు నుంచి టీఆర్ఎస్‌గా మారాల్సిన అవసరం చాలా ఉందంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.

News March 27, 2024

MBNR: పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే గడువు

image

మహబూబ్ నగర్ స్థానికసంస్థల MLC ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది. పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో ఓటర్ల జాబితాపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. చివరి ప్రయత్నంగా ఓటర్ల సమీకరణాలను సరి చూసుకుంటున్నారు. MLCఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు మన్నె జీవన్ రెడ్డి(కాంగ్రెస్) నవీన్ కుమార్‌రెడ్డి(BRS)ఇప్పుడు తమకున్న ఓటర్ల బలాబలాలపై దృష్టి సారించారు.