India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ HYDలో వర్షం వచ్చినప్పుడు వరద నీటి లోతుల్లోని వాహనాలను, వాహనాల్లో చిక్కుకున్న మనుషులను గుర్తించడం హ్యాండ్‌హెల్డ్ సోనర్ స్కానర్‌తో ఈజీ కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. దాదాపు 164 అడుగుల లోతు వరకు వెళ్తుంది. 2 నిమిషాల్లో 43 వేల చదరపు అడుగుల వరకు స్కాన్ చేసి, నీటి లోపల ఉన్న వాటి చిత్రాలను పంపిస్తుంది. త్వరలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతుంది.
ఉట్నూర్ మండలంలోని పిట్లగూడ గ్రామ సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. కాగా గ్రామానికి చెందిన పిట్ల వెంకటేష్ కూతురు లక్కీ(2)కి జ్వరంతో బాధపడుతుండగా ఆదివారం ప్రమాదకర స్థితిలో వాగుదాటుతూ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగుదాటమని వారు వాపోయారు. వర్షాలు పడ్డ ప్రతిసారి ఇబ్బంది తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నూతన వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
మణికొండలోని కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో వివిధ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ విమలా రెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్కల్ రోడ్‌లో ఉన్న లలితానగర్ ఫేజ్ -2లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం పేకాట స్థావరంపై దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి, సీఐ పురుషోత్తం, వారి బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పది మంది పేకాట రాయుళ్లను పట్టుకుని 10 సెల్ ఫోన్లు, రూ.5,200 నగదు స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ జిల్లా ఆదివారం సాయంత్రం 4గంటల వరకు జిల్లావ్యాప్తంగా 267MM ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దుగ్గొండి మండలంలో 29.8 MM కురిసింది. నల్లబెల్లి-29.7, ఖిలా వరంగల్-27, ఖానాపురం-26.8, గీసుకొండ-26.7, చెన్నారావుపేట-24.3, వరంగల్-23.4, వర్ధన్నపేట-19.3, నెక్కొండ-18.3, నర్సంపేట-18.3, రాయపర్తి-11.3, పర్వతగిరి-7.2, సంగెం-5.6ల వర్షపాతం నమోదు అయ్యింది.
మణికొండలోని కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో వివిధ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ విమలా రెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, పాడి పంటలు, వ్యాపారాలలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు మహబూబ్ నగర్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
HYD, RR, MDCL,VKB జిల్లాల్లో BCG టీకాను కింది పేర్కొన్న వారికి అందిస్తారు.
✓ప్రస్తుతం 60 సంవత్సరాలు పైబడిన వారికి
✓BMI శరీర ద్రవ్యరాశి సూచిక 18 కన్నా తక్కువ ఉన్నవారికి
✓ మద్యపానం తాగేవారికి
✓కొన్ని ఏళ్లుగా ధూమపానం తాగే వారికి
✓క్షయవ్యాధి ఉన్నవారి కుటుంబసభ్యులకు ✓ 5 ఏళ్లుగా క్షయవ్యాధితో బాధపడుతున్న వారికి అందించనున్నారు.

HYD, RR, MDCL, VKB జిల్లాల పరిధిలో పెద్దలకు BCG టీకా అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్షయ వ్యాధిని అంతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో TB వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు, సర్వే నిర్వహించి, శాంపిల్స్ సేకరించి టెస్టులు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.