Telangana

News March 27, 2024

కరీంనగర్ భూ దందా కేసుల్లో ఇద్దరి అరెస్ట్

image

కరీంనగర్ భూ దందా కేసుల్లో చింతకుంట మాజీ సర్పంచ్, కొత్తపల్లి జడ్పీటీసీ భర్త పిట్టల రవీందర్, KNR ఏడో డివిజన్ కార్పొరేటర్ భర్త ఆకుల ప్రకాష్‌లను వేర్వేరు కేసుల్లో మంగళవారం కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రవీందర్ కేసులో ఆయనకు సహకరించిన అప్పటి తహశీల్దార్ సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ప్రకాష్ కేసులో మరో నలుగురిపై కేసులు నమోదు చేయగా వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు

News March 27, 2024

BJP అడ్డుకునేది కమ్యూనిస్టులే: ఎమ్మెల్యే కూనంనేని

image

దేశంలో మతోన్మాద పోకడలు అవలంబిస్తున్న బీజేపీని నిలువరించే శక్తి, సామర్థ్యం కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం పాల్వంచ సీపీఐ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. దేశంలో మోదీని గద్దె దింపేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

News March 27, 2024

NLG: అంగన్ వాడి టీచర్లపై పెరిగిన పని భారం

image

ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీ టీచర్లపై పని భారం పెరిగింది. ఇప్పటికే అంగన్‌వాడీ సేవలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్‌లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేస్తుండగా.. తాజాగా అంగన్వాడి టీచర్లకే NHTS కుటుంబ సర్వే కూడా అప్పగించారు. స్మార్ట్ ఫోన్లలో ర్యాం, స్టోరేజీ తక్కువగా ఉండడంతో సతాయిస్తున్నాయి. గ్రామాలలో నెట్ సేవలు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆన్లైన్ కుటుంబ సర్వేకు ఆటంకం కలుగుతుంది.

News March 27, 2024

UPDATE కామారెడ్డిలో యువకుడి హత్య.. పరారీలో నిందితులు

image

రామేశ్వర్‌పల్లిలో <<12928467>>యువకుడి హత్య<<>> కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. CI రామన్ వివరాలు.. నిన్న ఉదయం నవీన్ ఆటోలో జిల్లా కేంద్రానికి వెళ్తుండగా గ్రామానికి చెందిన మధు, ప్రవీణ్ దారికాచి కత్తులతో దాడి చేశారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అది చూసి ఆపే ప్రయత్నం చేశాడు. వారు అతడిపై దాడికి యత్నించగా పరారై గ్రామస్థులకు చెప్పాడు. తీవ్ర రక్తస్రావంతో అప్పటికే నవీన్ చనిపోయాడు. నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు.

News March 27, 2024

ఎనుమాముల మార్కెట్‌లో పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. నిన్న క్వింటా పత్తి ధర రూ.7,170 పలకగా.. ఈరోజు రూ.7,310కి చేరింది. అలాగే క్వింటా మక్కలు రూ.2,215 పలికాయి. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారస్థులు తెలుపుతున్నారు.

News March 27, 2024

జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఆదిలాబాద్ యువకుడు

image

నేరడిగొండ మండలం మర్లపల్లికి చెందిన జాదవ్ కిరణ్ జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల రామాయంపేటలో జరిగిన రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అండర్ 18 విభాగంలో చక్కని ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని సాధించారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు హరియాణాలోని పంచకులలో నిర్వహించే జాతీయస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్
పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు.

News March 27, 2024

6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: కలెక్టర్

image

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి మంగళవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ కోసం జిల్లాలో చేపడుతున్న చర్యల గురించి సీ.ఎస్ దృష్టికి తెచ్చారు. రబీ సీజన్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు.

News March 27, 2024

ఏడుపాయలలో విషాద ఘటన

image

ఏడుపాయల చెక్‌డ్యామ్‌లో మునిగి వ్యక్తి మృతి చెందాడు. పాపన్నపేట ఎస్సై కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలానికి చెందిన సిద్ధిరాములు(31) వన దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. చెక్ డ్యామ్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు SI వెల్లడించారు. 

News March 27, 2024

జగిత్యాల: ఇనుపరాడ్డుతో తలపై దాడి.. భార్య మృతి

image

జగిత్యాల జిల్లా ఎడపల్లి మండలంలో దారణ ఘటన జరిగింది. మారేడుపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పున్నంరెడ్డి, భార్య రజిత మంగళవారం గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన పున్నంరెడ్డి ఇనుప రాడుతో తలపై బలంగా కొట్టగా రజిత అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి పెద్దపల్లి సీఐ, బసంత్ నగర్ ఎస్ఐ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 27, 2024

MBNR: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు.. కీలక ఆదేశాలు జారీ!

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రవి నాయక్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
✒పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు
✒స్థానిక ప్రజాప్రతినిధులు తమ గుర్తింపు కార్డు వెంట తీసుకువచ్చి ఓటు వెయ్యాలి
✒సైలెన్స్ పీరియడ్ పకడ్బందీగా అమలు
✒అన్ని రకాల ఎన్నికల ప్రచారాలకు బ్రేక్
✒పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు