Telangana

News July 21, 2024

కామారెడ్డి: మూడో అంతస్తు పైనుంచి పడి మహిళ మృతి

image

భవనంలోని మూడో అంతస్తు పైనుంచి పడి మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. పట్టణంలోని అశోక్‌నగర్‌లో ఉన్న ఓ భవనం మూడో అంతస్తు నుంచి పడి రాజేశ్వరి(50) మృతి చెందింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు విద్యుత్ శాఖ హెచ్చరిక

image

విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు జిల్లా విద్యుత్ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. తడిసిన కరెంట్ స్థంబాలను, విద్యుత్ లైన్‌కు తగిలే చెట్లను, తడి చేతులతో చార్జింగ్ పెట్టడం, స్విచ్ ఆన్ చేయడం వంటివి చేయవద్దని హెచ్చరించారు. అలాగే ఉతికిన బట్టలు ఇనుప తీగలపై ఆరవేయొద్దని సూచించారు. ఏమైనా విద్యుత్ సమస్య వస్తే సొంతంగా రిపేర్ చేయకుండా, విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.

News July 21, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లిలో 27.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా మొహ్మదాబాద్ 22.8 మి.మీ, నారాయణపేట జిల్లా గుండుమల్లో 20.5 మి.మీ, వనపర్తి జిల్లా మదనాపురంలో 21.5 మి.మీ, గద్వాల జిల్లా కేంద్రంలో 10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News July 21, 2024

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు

image

పినపాక మండలం పోట్లపల్లికి చెందిన బడే నాగరాజు, పాయం నగేష్ ఇద్దరు కలిసి చేపలు పట్టేందుకు పొట్లపల్లి వాగు చెక్ డాం వద్దకు వెళ్లారు. చెక్ డ్యాంలోకి దిగి చేపలు పడుతుండగా వరద ప్రవాహం అధికం కావడంతో పాయం నగేష్ వరదలో కొట్టుకొని పోయాడు. బడే నాగరాజు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజేందర్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

News July 21, 2024

మార్చి నాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి: కోమటిరెడ్డి

image

వచ్చే మార్చినాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నార్కట్పల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న SLBC సొరంగం పనుల పూర్తికి రాష్ట్ర సీఎంతో మాట్లాడి రూ.2200 కోట్లు మంజూరు చేయించడమే కాకుండా, నిధుల విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ లో నిధులు ఏర్పాటు చేశామని తెలిపారు.

News July 21, 2024

శాకాంబరి అవతారంలో భద్రకాళి అమ్మవారు

image

శ్రీ భద్రకాళీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆదివారం భద్రకాళి అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కాగా, అమ్మవారిని శాకాంబరి అవతారంలో దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు.

News July 21, 2024

ఈనెల 22 నుంచి 29 వరకు పాఠశాలల్లో శిక్షా సప్తాహ్ కార్యక్రమం

image

ఈనెల 22 నుంచి 29 వరకు పాఠశాలల్లో శిక్షా సప్తాహ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వరాచారి తెలిపారు. తొలిరోజు సోమవారం బోధనోపకరణాల దినోత్సవం, రెండో రోజు గణిత దినోత్సవం, మూడోరోజు క్రీడా దినోత్సవం, నాలుగో రోజు సాంస్కృతిక దినోత్సవం, ఐదో రోజు నైపుణ్యాభివృద్ధి, ఆరో రోజు పర్యావరణ క్లబ్స్ చివరి రోజు కమ్యూనిటీ ఇన్వాల్వ్ మెంట్ డే నిర్వహించాలని తెలిపారు.

News July 21, 2024

మువ్వాను కలిసిన సినీ నటుడు శ్రీనివాస్ రెడ్డి

image

HYDలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మువ్వ విజయ్ బాబును సినీ నటుడు శ్రీనివాస్ రెడ్డి కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

News July 21, 2024

గోదావరి పరీవాహక ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలి: సీతక్క

image

వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. జిల్లాలోని కలెక్టర్లతో సెక్రటేరియెట్ నుంచి ఫోన్​లో మాట్లాడి వరదలపై సమీక్షించారు. గోదావరి సమీప గ్రామాల ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.

News July 21, 2024

HYD: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన చైతన్యపురి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NGKL జిల్లా అచ్చంపేట (M) చేదురుబావి తండాకు చెందిన వేణుశ్రీ శ్రీచైతన్య కాలేజీలో సెకండియర్ చదువుతోంది. శనివారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కళాశాల యాజమాన్యం వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించిందని తల్లిదండ్రులు ఆరోపించారు.