India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన చైతన్యపురి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NGKL జిల్లా అచ్చంపేట (M) చేదురుబావి తండాకు చెందిన వేణుశ్రీ శ్రీచైతన్య కాలేజీలో సెకండియర్ చదువుతోంది. శనివారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కళాశాల యాజమాన్యం వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించిందని తల్లిదండ్రులు ఆరోపించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న వ్యక్తిపై రాళ్లతో దాడి చేసిన ఘటన భీమ్‌గల్‌లో జరిగింది. బెజ్జోర వద్ద ఇసుక ట్రాక్టర్లను మాజీ ఎంపీపీ మహేశ్, మహేందర్‌తో పాటు కొందరు అడ్డుకున్నాడు. ఇసుక వ్యాపారులు వారిపై దాడి చేయడంతో అందరూ పారిపోగా మహేందర్ వారికి దొరికాడు. అతడిపై రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు.
హుస్నాబాద్ మండలం శ్రీరాములపల్లెలో భూవివాదం జరిగింది. వ్యవసాయ భూమి సరిహద్దుల విషయంలో రెండు వర్గాలకు మధ్య పెద్ద ఘర్షణ చోటుచేసుకుంది. గొడవలో దవీందర్ అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయగా.. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, రవీందర్ కరీంనగర్ ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఈరోజు ఉదయం 8 గంటలకు 37 అడుగుల వద్ద నీటిమట్టం ఉదయం 10 గంటలకు 38 అడుగులు చేరుకుంది. మరో 6 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లాలో 68 మంది బత్తాయి రైతులు నిండా మునిగారు. తిరుపతి ఉద్యాన యూనివర్సిటీ నుంచి 11 ఏళ్ల క్రితం బత్తాయి మొక్కలు తీసుకువచ్చి జిల్లాలో నాటిన రైతులు దిగుబడి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సుమారు 350 ఎకరాల్లో ఈ బత్తాయి మొక్కలు నాటారు. సాధారణంగా నాలుగో ఏటా నుంచి దిగుబడి ప్రారంభమవుతుందని 8 ఏళ్లు గడిచినా సాధారణ దిగుబడి కూడా రాలేదని రైతులు తెలిపారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మువ్వ విజయబాబు ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా మువ్వ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన మీద ఉన్న నమ్మకంతో ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల, భట్టి, పొంగులేటికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
భద్రాద్రి జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగుతున్న ఆయకట్టు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. చర్లలోని తాలిపేరు ప్రాజెక్టు కింద 24,700 ఎకరాలు, అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్ట్ కింద 2,360 ఎకరాలు, పాల్వంచలో కిన్నెరసాని ప్రాజెక్ట్ కింద 10,000 ఎకరాలు, బయ్యారం పెద్ద చెరువు కింద 7,200 ఎకరాలు సాగవుతున్నాయి.
భద్రకాళి అమ్మ వారి శాకంబరి ఉత్సవం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 3.50టన్నుల కూరగాయలు, 400కిలోల పండ్లు, 200కిలోల ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించనున్నారు. నేడు శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరి విశ్వరూప దర్శనం ఉంటుందని కార్యనిర్వహణ అధికారిణి శేషుభారతి, ప్రధానార్చకుడు శేషు తెలిపారు.
జేగురుకొండ అడవుల్లో శనివారం జరిగిన ఎన్ కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జేగురుకొండ అడవు ల్లోని సింగవరం, తుమర్ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో డీఆర్డీ బలగాలు కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో ఒక తుపాకీ, ఇతర వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చనిపోయిన మావోయిస్టును గుర్తించాల్సి ఉందన్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీ-ఫార్మసీ మొదటి, ఏడో సెమిస్టర్ షెడ్యూల్‌ను శనివారం కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహాచారి విడుదల చేశారు. ఈ నెల 26న పేపర్ 1, 27న పేపర్ 2, 30న పేపర్ 3, 31న పేపర్ 4 పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.