India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD కార్మికనగర్‌లో <<13251869>>మేకప్ ఆర్టిస్ట్ చుక్కా చెన్నయ్య<<>> హత్య జరిగిన విషయం తెలిసిందే. బోరబండ పోలీసులు తెలిపిన వివరాలు.. యూసుఫ్‌గూడ వెంకటగిరిలో ఉండే చెన్నయ్యకు రహమత్‌నగర్ వాసి సంపత్ యాదవ్ (19)కు పరిచయముంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి సంపత్, చెన్నయ్య కలిసి స్థానిక నిమ్స్‌మే గ్రౌండ్‌లో అసహజ శృంగారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో సంపత్ తన వద్ద ఉన్న కత్తితో చెన్నయ్యను చంపాడు. సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న మల్లారెడ్డి గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని మగ మృతదేహం లభించిందని ఎస్ఐ రాజు తెలిపారు. వయస్సు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంది. మృతదేహం పూర్తిగా కూలిపోయిందని చెప్పారు. వారం రోజుల క్రితం చనిపోయినట్లుగా భావిస్తున్నామన్నారు. మెడలో చిన్న తాయత్తు నల్లటి దారం ఉంది. కుడిచేతి ఉంగరపు వేలుకు రాగి ఉంగరం ఉందని చెప్పారు.
NGKL జిల్లా నల్లమలలోని సలేశ్వరం వరకు ఎకో టూరిజం ప్యాకేజీ ప్రవేశ పెట్టేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం ఏటా మూడు రోజులే అనుమతిస్తున్న సలేశ్వరం జాతరకు ఏడాదిలో 9 నెలలపాటు పర్యాటకులను అనుమతించే ప్రక్రియ మొదలైంది. సలేశ్వరం ప్రాంతంలో చెట్లను తొలిగించి మట్టిదారి నిర్మిస్తున్నారు. అయితే వాహనాలు, జన సంచారంతో ఇన్నాళ్లు కొనసాగిన ఆటవీ పరిరక్షణ, పెద్దపులులు, చిరుతల జీవనానికి ఆటంకం కలుగుతుంది.
మానవత్వం మంట కలిసిపోతోందనటానికి ఈ ఘటనే నిదర్శనం. తల్లి మృతిచెంది రెండు రోజులవుతున్నా డబ్బు కోసం అంత్యక్రియలు నిర్వహించని అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. నేరేడుచర్ల మండలం కందుల వారి గూడెంలో లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో మరణించింది. తన పేరిట ఉన్న ఆస్తులు పంపకంలో కుమారుడు, కూతురు మధ్య వివాదం తలెత్తింది. దీంతో అంత్యక్రియలు నిర్వహించలేదు.
40 సం. క్రితం జైలు నుంచి బెయిల్ పై విడుదలై తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని జైలు అధికారులు గురువారం పట్టుకున్నారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లికి చెందిన సందు వీరన్నకి 1982లో ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడగా, 1984లో పెరోల్‌పై విడుదలయ్యాడు. అనంతరం పెరోల్ సమయం ముగిసినా జైలుకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతుండగా.. సమాచారం అందుకున్న జైలు అధికారులు పెద్ద ముప్పారం గ్రామంలో పట్టుకున్నారు.
మద్యం తాగేందుకు రూ.50 కోసం గొడవ పడి గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. అల్వాల్ పోలీసుల వివరాలు.. మచ్చబొల్లారంలో నివాసముండే సురేశ్(45) పెయింటింగ్ పని చేస్తున్నాడు. సూర్యనగర్‌లో నివాసముండే భరత్‌ను 13న మద్యానికి డబ్బులు లేవని రూ.50 ఇవ్వాలని అడిగాడు.దీంతో తరచూ ఎందుకు అడుగుతున్నావని భరత్ గొడవకు దిగాడు. మాటమాట పెరిగి భరత్ సురేశ్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన సురేశ్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.

EVMలల్లో అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది. దీంతో మెదక్, జహీరాబాద్‌లో అభ్యర్థులు లాభనష్టాలపై లెక్కలేసుకుంటున్నారు. ఓటర్ నాడి అంతు చిక్కకపోవడంతో ఫలితం ఎలా ఉంటుందో అనే ఆందోళన మొదలైంది. అయితే అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ టెన్షన్ పట్టుకుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నప్పటికీ లోలోపల ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్, హరీశ్ రావు సొంత జిల్లా కావడంతో మెతుకుసీమ ఓటరు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. నగర పరిధిలోని 4 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 29 అసెంబ్లీ సెగ్మెంట్లకు 19 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే.

Sorry, no posts matched your criteria.