Telangana

News May 17, 2024

మెదక్ జిల్లాలో వర్షపాతం వివరాలు..

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో(ఉదయం 8:30 గంటల వరకు) నమోదైన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా రామాయంపేట 62.5మి.మి, కొండపాక 51.5, గజ్వేల్ 44.0, చీకోడు 38.8, హబ్సిపూర్ 37.8, మాసాయిపేట 36.3, లకుడారం 35.8, బేగంపేట 35.5, కొడకండ్ల 34.0, నారాయణరావుపేట 31.3, మిన్పూర్ 30.5, కాగజ్ మద్దూర్ 30.3, అల్లాదుర్గం, పాల్వంచ 30.0 మి.మి వర్షపాతం నమోదయింది.

News May 17, 2024

సింగరేణి ఉద్యోగాల దరఖాస్తుకు సాంకేతిక సమస్య

image

సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ లో అప్లై చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించగా రెండు రోజులుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. గురువారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించి ఆన్లైన్ సేవలు ముందుకు తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

HYD: 82 ఫిర్యాదులు.. 65 పరిష్కారం

image

GHMC విపత్తుల విభాగానికి వరద, చెట్లు కూలడంపై 82 ఫిర్యాదులు రాగా, డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రి 8 గంటల వరకు 65 సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ఉప్పల్, మలక్ పేట,చంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నుమా,గుడిమల్కాపూర్, షేక్ పేట, అసెంబ్లీ, ఎన్టీఆర్ స్టేడియం, కేబీఆర్ పార్క్, కేకే పార్క్ ప్రాంతాల్లో 18 వరకు చెట్లు నేలకూలాయి. 63 చోట్ల వరద నీరు నిలిచిపోయిన ఫిర్యాదులు వచ్చాయన్నారు.

నిజామాబాద్: ఫోన్ కోసం రైలు నుంచి దూకేశాడు

image

ఫోన్ కోసం ఓ యువకుడు రైలు నుంచి దూకేశాడు. వివరాలిలా.. అబ్దుల్‌ రైలులో ప్రయాణిస్తున్నాడు. డిచ్‌పల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే అతని ఫోన్‌ కిందపడింది. దాని తీసుకునేందుకు వెంటనే రైలు నుంచి దూకాడు. ఈ ప్రమాదంలో అతని ఎడమ కాలి పాదం నుజ్జునుజ్జయింది. స్థానికులు 108కు సమాచారం ఇచ్చి చికిత్స కోసం NZMకు తరలించారు. ఫోన్ తెచ్చి ఇచ్చేవరకు చికిత్సకు వెళ్లనని మారాం చేశాడు. ఫోన్‌ మాత్రం దొరకలేదు.

News May 17, 2024

ఆదిలాబాద్: ఓట్లు లెక్కపెట్టేది ఇక్కడే

image

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక జూన్ 4న ఫలితాల కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వివరాలు.. ★ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లు: సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ★ ఖానాపూర్, నిర్మల్, ముథోల్ అసెంబ్లీ ఓట్లు : ఆదిలాబాద్ సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ★ ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ ఓట్లు: TTDCలో

News May 17, 2024

KNR: PG పరీక్ష ఫలితాలు విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో గత మార్చ్ నెలలో నిర్వహించిన పీజీ ఫలితాలు వెలువడినట్టు పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. MBA, MCA, MSC, ఒకటవ, మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.satavahana.ac.inలో అందుబాటులో ఉంచామని, ఫలితాలను చూసుకోవాలని ఆయన సూచించారు.

News May 17, 2024

చిట్యాల వద్ద యాక్సిడెంట్ 

image

చిట్యాల మండలం వెలిమినేడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ద్విచక్ర వాహనదారుడు చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.