India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రైపియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రతీ స్కానింగ్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఫొటోలు తీయాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.
జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. బుగ్గారం మం. గోపులాపూర్‌కు చెందిన బెస్త శ్రీనివాస్ (35), అతని తమ్ముడు మహేష్‌పై రాడ్లు, పైప్‌లతో గురువారం అర్ధరాత్రి 5గురు ముసుగు వేసుకుని వచ్చి రాడ్లు, పైప్‌లతో దాడి చేయగా బెస్త శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహేష్‌కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. భూ తగాదాల నేపథ్యంలోనే గొడవలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాములవారి నిత్య కల్యాణ క్రతువును వీక్షించిన భక్తులు పరమానంద భరితులయ్యారు. రామయ్యకు అర్చకులు భక్తిశ్రద్ధలతో సుప్రభాతం పలికి ఆరాధించారు. వైదిక పెద్దలు చేసిన ప్రవచనం ఆకట్టుకుంది. నిత్య కల్యాణం గురించి ప్రవచిస్తుండగా అనుగుణంగా వేడుకను నిర్వహించారు. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మాంగల్యధారణ నిర్వహించి తలంబ్రాల వేడుక చేశారు.
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం మావల సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. నిర్మల్ వైపు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ షేక్ అజీమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది కిషన్, ముజఫర్ అతనిని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.
లైంగిక వేధింపుల ఆరోపణలపై కామారెడ్డి DMHOను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యాధికారిణులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. లక్ష్మణ్ సింగ్ తమను ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఇటీవల వైద్యాధికారిణులు ఆరోపించారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జహీరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) మృతిచెందాడు. USలోని నార్త్ కరోలినాలో 8ఏళ్లుగా పనిచేస్తున్నాడు. భార్య శ్రీప్రియతో కలిసి కారులో వెళ్తూ వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదం నుంచి బయటపడగా వేగంగా వచ్చిన మరో కారు వెనక నుంచి వీరి కారుని ఢీ కొట్టింది. దీంతో పృథ్వీ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.
ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటును వినియోగించుకోవడంలో పాలమూరు ప్రజలు నిర్లక్ష్యం ప్రదర్శించారు. తాజా ఎంపీ ఎన్నికల్లో 4,63,983 మంది ఓటుకు దూరంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. MBNR పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం 16,82,470 ఓట్లు ఉంటే 12,18,487 మంది తమ ఓటు వేశారు. 2019 MP ఎన్నికల్లో మొత్తం 13,68,868 మందికి 92,65,16 ఓట్లు పోలయ్యాయి. ఈ మధ్య 3,13,602 ఓట్లు పెరిగినప్పటికీ పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం ఆందోళనకరం.
Sorry, no posts matched your criteria.