Telangana

News May 17, 2024

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి: జిల్లా ఎస్పీ

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని కోరారు. అభ్యర్థులు వారి ప్రచారంలో కులం, మతం, ఎదుటి వ్యక్తులను దూషించడం, ప్రార్థనా స్థలాల్లో ప్రచారం వంటివి చేయకూడదని తెలిపారు.

News May 17, 2024

HYD: పెళ్లి పేరుతో మోసం.. పదేళ్ల జైలు శిక్ష

image

పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి బాలికను నమ్మించి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ RJNR ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించింది. గచ్చిబౌలి పోలీసుల వివరాలు.. NGKL జిల్లాకు చెందిన సతీశ్ కుమార్(23) ఓ బాలిక(15)తో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News May 17, 2024

HYD: పెళ్లి పేరుతో మోసం.. పదేళ్ల జైలు శిక్ష

image

పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి బాలికను నమ్మించి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ RJNR ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించింది. గచ్చిబౌలి పోలీసుల వివరాలు.. NGKL జిల్లాకు చెందిన సతీశ్ కుమార్(23) ఓ బాలిక(15)తో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News May 17, 2024

స్ట్రాంగ్ రూంల వద్ద నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్

image

ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ల పరిసరాలను నిరంతరం పర్యవేక్షించాలని పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గౌతమ్ ఆదేశించారు. పొన్నెకల్లులోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు శ్రీచైతన్య కళాశాలలోనే ఉంటుందని, అందుకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచినట్లు వివరించారు.

News May 17, 2024

ఖమ్మం: పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం!

image

ఖమ్మం జిల్లాలో మొత్తం 1,103 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిల్లో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ప్రత్యేక అధికారులు అందుబాటులో లేకపోవడంతో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. డ్రైనేజీ, వీధి దీపాల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడటంతో గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు.

News May 17, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓కొత్తగూడెంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం
✓వైరాలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
✓పాల్వంచలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News May 17, 2024

ఈవీఎంలలో భవితవ్యం.. అభ్యర్థుల్లో ఉత్కంఠ!

image

పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో పోటీచేసిన అభ్యర్థులలో టెన్షన్ మొదలైంది. ఓటర్ నాడి అంతు చిక్కకపోవడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో అనే ఆందోళన ఆయా పార్టీ అభ్యర్థులలో మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పైకి మేమే గెలుస్తామని గంభీరంగా చెబుతున్నప్పటికీ విజయంపై లోలోపల టెన్షన్ నెలకొంది.

News May 17, 2024

అందని ద్రాక్షలా.. మూగజీవాలకు పశువైద్యం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూగజీవాలకు పశువైద్యం అందని ద్రాక్షలా మారింది. పశువైద్యశాలల్లో సిబ్బంది కొరతతో పాటు సరిపడా వసతులు లేక పశువులకు సరైన వైద్యం అందడం లేదు. ఇరు జిల్లాల్లోని పశువైద్యశాలల్లో గడిచిన కొంత కాలంగా ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోకపోవడం లేదు. దీంతో మూగజీవాలకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలి పశువులు మృతి చెందుతున్నా.. పట్టించుకునే పరిస్థితి లేదు.

News May 17, 2024

ఖమ్మం: తెల్లవారుజామున రోడ్డుప్రమాదం 

image

ఖమ్మం జిల్లా జీళ్లచెరువు వద్ద తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఖమ్మం కారులో వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. మృతుడిని ఖమ్మంలోని హౌసింగ్ కాలనీకి చెందిన వెంకటేశ్వరరావుగా గుర్తించారు. క్షతగాత్రుడిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

News May 17, 2024

KNR: RTCకి రూ.10.94 కోట్ల ఆదాయం

image

లోక్‌కసభ ఎన్నికలు RTCకి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. కరీంగనర్ రీజియన్‌లో 11 డిపోలు ఉండగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మే 10 నుంచి 14 వరకు వివిధ ప్రాంతాలకు 4350 బస్సులు నడిపింది. వీటిలో 510 అదనపు బస్సులున్నాయి. 5రోజుల్లో 19.42 లక్షల మంది RTC బస్సుల్లో ప్రయాణించగా రూ.10.94 కోట్ల ఆదాయం సమకూరింది. జగిత్యాల డిపో రూ.1.65 కోట్లు, గోదావరిఖని డిపో రూ.1.59 కోట్లతో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.