Telangana

News May 17, 2024

PU డిగ్రీ పరీక్షలు.. ముగ్గురు డిబార్

image

PUలో డిగ్రీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 49 కేంద్రాలు ఏర్పాటు చేశారు.  ఉదయం జరిగిన సెమిస్టర్-2 పరీక్షకు మొత్తం 11,848 మందికి గాను 11,227 మంది, సెమిస్టర్-6 పరీక్షకు 11,448 మందికి 11,108 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా కొండనాగులలో ఇద్దరు, నాగర్ కర్నూల్ లో ఒకరు మాల్ ప్రాక్టీసుకు పాల్పడటంతో డిబార్ చేసినట్లు పీయూ అధికారులు తెలిపారు.

News May 17, 2024

KMM: వానాకాలం సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం

image

వానాకాలం సాగుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ సన్నద్ధమవుతోంది. సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందస్తుగా సిద్ధం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. గతంలో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరతను ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తుగానే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇప్పటికే ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు.

News May 17, 2024

WGL: 5,68,165 లక్షల మంది ఓటుకు దూరం

image

వరంగల్ లోక్‌సభ స్థానానికి ఈ నెల 13న జరిగిన ఎన్నికలలో 5,68,165 లక్షల మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉండిపోయారు. లోక్‌సభ స్థానం పరిధిలో 18,44,66 మంది ఓటర్లు ఉండగా, ఎన్నికల్లో 12,55,361 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్ సభ స్థానం మొత్తం పోలింగ్ సరళిని పరిశీలిస్తే 70 శాతాన్ని కూడా అందుకోలేకపోయింది. మహిళల కన్నా పురుషులే అధికంగా ఓటేశారు.

News May 17, 2024

‘రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం’

image

ఆస్పత్రిలో మరణించిన బాలుడి మృతదేహం అప్పగించేందుకు ప్రైవేటు ఆస్పత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. అంత ఇవ్వలేని పేద కుటుంబం రూ.7 వేలు ఇచ్చి డెడ్‌బాడీని తీసుకెళ్లింది. కుక్కునూరు మం. కురుమలతోగులో దేవ అనే బాలుడికి వాంతులు, వీరేచనాలు అవుతుండగా భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చనిపోగా మృతదేహాన్ని ఇచ్చేందుకు డబ్బు డిమాండ్ చేశారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

News May 17, 2024

యాదాద్రి: రూ.16 కోట్ల ఇంజెక్షన్ వేయించలేక చిన్నారి మృతి

image

వలిగొండ మండలం గోలిగూడేనికి చెందిన దిలీప్‌రెడ్డి-యామిని దంపతుల కుమారుడు భవిక్‌రెడ్డి(6నెలలు). ఆ చిన్నారి జన్మించిన మూడో నెల నుంచి శరీర కదలికలు సరిగా లేవు. చాలా ఆస్పత్రుల్లో చూపించారు. నయం కావడానికి ఇంజెక్షన్‌ ఒక్కటే మార్గమని, అది USలో లభిస్తుందని, దాని ఖరీదు రూ.16 కోట్లని వైద్యులు తెలిపారు. విరాళాలుగా రూ.10 కోట్లే సమకూరాయి. ఇంజెక్షన్ వేయించలేకపోవడంతో బాబు చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.

News May 17, 2024

ADB: ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 విద్యాసంవత్సరానికి గానూ కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సునీత తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదివి పదో తరగతిలో 7 జీపీఏకు పైగా సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News May 17, 2024

NZB: ఫైనల్‌కి చేరిన నిఖత్ జరీన్

image

నిజామాబాద్‌కు చెందిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నిలో నిఖత్ (52 కేజీలు) అద్భుత విజయంతో ఫైనల్‌కు చేరుకుంది. కజకిస్థాన్‌కి చెందిన టొమిరిస్ మిర్జాకుల్ పై 5-0 తో విజయం సాధించింది. బౌట్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో విరుచుకుపడ్డ నిఖత్ అలవోకగా విజయం సాధించింది.

News May 17, 2024

REWIND-2019: మల్కాజిగిరిలో BRS ఓటమి!

image

మల్కాజిగిరిలో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. రాజశేఖర్ రెడ్డి(BRS)పై రేవంత్ రెడ్డి (INC) 10,919 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. రాంచందర్ రావు(BJP) 3వ స్థానంలో నిలిచారు. కానీ, ప్రస్తుత రాజకీయాలు మారాయి. ఎన్నికల‌కు ముందు ఈటల (BJP), సునీత (INC), రాగిడి (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ తమదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 17, 2024

REWIND-2019: మల్కాజిగిరిలో BRS ఓటమి!

image

మల్కాజిగిరిలో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. రాజశేఖర్ రెడ్డి(BRS)పై రేవంత్ రెడ్డి (INC) 10,919 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. రాంచందర్ రావు(BJP) 3వ స్థానంలో నిలిచారు. కానీ, ప్రస్తుత రాజకీయాలు మారాయి. ఎన్నికల‌కు ముందు ఈటల (BJP), సునీత (INC), రాగిడి (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ తమదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 17, 2024

HYD: అవగాహన లేకుండా హామీలు ఇచ్చారు: కొండా

image

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సామాజిక ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేకుండా హామీలు ఇవ్వడం బాధాకరమని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం అసాధ్యమన్నారు. వారు అమలు చేయాలని చూసినా రాష్ట్ర ఖజానాలో నిధులు లేవన్నారు.