Telangana

News July 20, 2024

హనుమకొండ: మాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని మహిళ మృతి

image

మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ వద్ద జరిగింది. మృతురాలు కలకోట్ల స్వప్న (40)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 20, 2024

భద్రాచలం: ఐటిఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

image

2024-25 విద్యా సం.కు గాను ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐలో ప్రవేశాల కొరకు, 2వ విడత ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, ప్రభుత్వ ఆశ్రమ పారిశ్రామిక శిక్షణ సంస్థ, కృష్ణసాగర్ ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు. అభ్యర్థులు iti.telangana.gov.in అనే వెబ్సైట్ నందు ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేసుకోని, పదవ తరగతి పాసై, 14 ఏళ్లు నిండినవారు ఈనెల 21లోపు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 20, 2024

నల్గొండ: “హలం పట్టి.. నారీమణులకు ఆదర్శంగా నిలిచి”.!

image

మునుగోడు మండలానికి చెందిన వీరమళ్ళ సునిత మగవారికి ధీటుగా హలం పట్టి పంట పొలాల్లో దూసుకెళ్తుంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ నారీమణి చిన్ననాటి నుంచే పొలం పనుల్లో మెలకువలు నేర్చుకొని రాటు తేలింది. తనకున్న కాడెద్దులతో పత్తి, వరి పొలాల్లో గుంటుక, గొర్రు తోలుతూ ఒక ఎకరానికి ₹800/- చొప్పున రోజుకి 4 ఎకరాలకు ₹3200/- సంపాదిస్తుంది. నేడు స్వతహాగా ఉపాధి బాట పట్టి మరెందరికో ఆదర్శంగా నిలిచింది.

News July 20, 2024

సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

image

రుణ మాఫీకి కోర్రీలు పెట్టారని, ఆరు హామీలు అటకెక్కించారని BRS పార్టీ రాష్ట్ర నాయకుడు RS ప్రవీణ్ కుమార్ అన్నారు. మఠంపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రైతు రుణమాఫి అని చెప్పి లక్ష లోపు సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.

News July 20, 2024

ఏడు నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశాం: మంత్రి జూపల్లి

image

వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో రూ.2లక్షల లోపు రైతు రుణమాఫీ చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డిలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశామని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలే కేంద్రబిందువుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

News July 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు ఎస్ఐల బదిలీలు

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో పలువురు ఎస్సైలను శనివారం ఉన్నతాధికారులు బదిలీ చేశారు. తిరుమలాయపాలెం ఎస్‌హెచ్ఓ గిరిధర్ రెడ్డి, ఖమ్మం రూరల్ పీఎస్ ఎస్సై పులోజు కుశ కుమార్, బయ్యారం ఎస్‌హెచ్ఓ ఉపేందర్‌లను బదిలీ చేస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో నూతన ఎస్ఐలను పోలీస్ ఉన్నతాధికారులు నియమించారు.

News July 20, 2024

MBNR: దొంగల ముఠా అరెస్ట్

image

ఒంటరి వృద్ధులు, వృద్ధ మహిళలను టార్గెట్ చేసి వరుస దొంగతనాలు చేసే ముఠాను పట్టుకున్నట్లు రూరల్ CI గాంధీనాయక్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. MBNR పట్టణానికి చెందిన షేక్ మహ్మద్ హుస్సేన్, ఉమ ఒంటరిగా వృద్ధులు, వృద్ధ మహిళలు కనబడగానే ఆటో ఎక్కించుకొని ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి చంపుతామని బెదిరించి వారి ఒంటిపై ఉన్న నగలు, డబ్బు లాక్కుంటారని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు.

News July 20, 2024

ఖమ్మం: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి: మంత్రి

image

మరో 2 రోజులు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో భద్రాద్రి, ఖమ్మం జిల్లా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ మేరకు శనివారం భద్రాద్రి, ఖమ్మం కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. రెవిన్యూ శాఖలో ఉద్యోగులు సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.

News July 20, 2024

తూప్రాన్: పౌల్ట్రీ రైతు ఆత్మహత్య

image

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం పౌల్ట్రీ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్రెడ్డిపల్లికి చెందిన గార్ల ఆంజనేయులు (40) పౌల్ట్రీ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య మౌనిక, ముగ్గురు సంతానం ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 20, 2024

భద్రాద్రి కొత్తగూడెం: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి: జిల్లా ఎస్పీ

image

భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అన్ని ప్రదేశాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేయాలన్నారు.