Telangana

News May 16, 2024

HYD: దేశంలో తిరుగుబాటు తప్పదు: ఆర్.కృష్ణయ్య

image

బీసీల వాటా బీసీలకు ఇవ్వకపోతే దేశంలో తిరుగుబాటు తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం HYD విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగిన 16వ బీసీ సంఘాల సమావేశం అనంతరం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు గడిచినా పేద – ధనిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని పేర్కొన్నారు.

News May 16, 2024

చిన్నారెడ్డిని చూస్తూ ఈ స్థాయికి ఎదిగా: సీఎం రేవంత్ రెడ్డి

image

నేడు హైదరాబాద్‌లోని మాదాపూర్ ఓ హోటల్ జరిగిన జిల్లా లెవెల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి రాజకీయ ప్రస్థానం చూసి ఈ స్థాయికి వచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

News May 16, 2024

వేములవాడ: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

image

పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వేములవాడ మండలం సాత్రాజుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పొలం వద్ద పనిచేస్తున్న కంబాల శ్రీనివాస్ (32)పై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

News May 16, 2024

ఖమ్మం: ఈసారి విజయం మనదే: తాండ్ర

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో BJP గ్రాఫ్ గణనీయంగా పెరిగిందని ఆ పార్టీ MP అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. BJP ఈ ఎన్నికల్లో గెలవబోతోందని జోస్యం చెప్పారు. ఖమ్మంలోనే స్థిర నివాసం ఏర్పరుచుకుని కార్యకర్తలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల్లో తన వంతు కృషి చేస్తానని అన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మీడియా సహాయం మర్చిపోలేనిదని పేర్కొన్నారు.

News May 16, 2024

పట్టుదలతో పని చేస్తే విజయం మనదే: జగదీష్ రెడ్డి

image

ఉద్యోగులు, యువతను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని,ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృతనిశ్చయంతో యువత, నిరుద్యోగులు ఉన్నారని MLA జగదీష్ రెడ్డి అన్నారు. NLG-వరంగల్-ఖమ్మం MLC ఎన్నికలకు సంబంధించి సూర్యాపేటలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన విధివిధానాలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ‘పట్టుదలతో పని చేస్తే విజయం మనదే’ అని అన్నారు.

News May 16, 2024

ఆదిలాబాద్: భార్యను వేదించిన భర్తకు జైలు శిక్ష

image

భార్యను వేధించిన కేసులో భర్తకు 18 నెలల జైలు శిక్ష, రూ 2500 జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తీర్పునిచ్చారు. జైనథ్ మండలంలోని నీరాల గ్రామానికి చెందిన మహిళ తన భర్త దీక్షిత్ పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. నేడు పీసీఆర్ కోర్టులో పోలీసులు అతడిని హాజరుపర్చగా విచారణ అనంతరం అతడికి కోర్టు శిక్ష విధించినట్లు లైజన్ అధికారి గంగా సింగ్ తెలిపారు.

News May 16, 2024

కల్వకుర్తి: పిడుగు పడి ఒకరి మృతి.. మరోకరి పరిస్థితి విషమం

image

కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం వాసుదేవ్పూర్ గ్రామంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షంలో ఇద్దరూ బైక్‌పై ప్రయాణిస్తూ వాసుదేవ్ పూర్ గేటు దగ్గర ఆగి ఉన్నారు. అంతలోనే పిడుగు పడి ఒకరు అక్కడికక్కడ మృతి చెందగా.. మరోకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రికి తరలించారు. వీరు ఆమనగల్లు మండలం చెన్నారం గ్రామానికి చెందినవారుగా సమాచారం. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News May 16, 2024

కార్పొరేట్ కళాశాలలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ కళాశాలలో విద్య అందించేందుకు నల్గొండ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మార్చి 2024 లో 10లో జిపిఏ 7.0 పైన జిపిఏ సాధించిన విద్యార్థులు జిల్లాలోని ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ, దివ్యాంగుల విద్యార్థులు సంబంధిత పత్రాలతో telanganaepass. cgg.gov.in అనే సైట్లో దరఖాస్తు ఈ నెల 30లోపు చేసుకోవాలన్నారు.

News May 16, 2024

కట్టి పడేస్తున్న క్లాక్ టవర్ అందాలు

image

నల్గొండ క్లాక్ టవర్ అంటే తెలియని వారుండరు. ఇటీవల పట్టణంలో వర్షం కురవగా ఓ వ్యక్తి ఆ ఏరియాని క్యాప్చర్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఇంకేం.. క్షణాల్లోనే అది వైరల్‌గా మారింది. చిరు జల్లుల్లో క్లాక్ టవర్ అందాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి. ఆ వ్యూ సూపర్ అంటూ నల్గొండ వాసులు కామెంట్లు చేస్తున్నారు. ఎలా ఉందో మీరూ చెప్పండి.

News May 16, 2024

ఖమ్మం: కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి

image

కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన ఘటన కుక్కనూరు మండలం దామచర్లలో చోటుచేసుకుంది. గుత్తి కోయ గ్రామానికి చెందిన 9 మంది గిరిజనులు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఓ వృద్ధురాలు, బాలుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు గిరిజనులకు మినరల్ వాటర్ అందించడంతో పాటు గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.