India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆలు మగలవి ఒక జీవితానికి చాలని ప్రేమలని ఓ కవి అన్నారు. అర్ధాంగిని కోల్పోయిన బాధను జీర్ణించుకోలేని ఓ భర్త మనోవేదనతో తనువు చాలించిన విషాద ఘటన ఇది. సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్, స్కందగిరిలో కొంతకాలంగా జిల్లా లక్ష్మణ్(80) నీలవేణి (70) కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. గత నెల 22న అనారోగ్యంతో నీలవేణి చనిపోయారు. దీంతో మనోవేదనకు గురైన భర్త శనివారం తనువు చాలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
సికింద్రాబాద్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సీఎస్ శాంతి కుమారితో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైల్వే డెవలప్మెంట్ సంబంధించి చర్చ జరిగిందని, రాబోయే కొద్ది నెలల్లోనే పలు అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ సైతం త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు.
భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీడీఏ కేంద్రంగా ప్రధాన సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులో 79952 68352 నెంబర్‌కు కాల్ చేయాలని ఐటిడిఏ అధికారులు పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమై మైదాన ప్రాంతాలకు రావాలని చెప్పారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 24 గంటలు పనిచేస్తుందని వెల్లడించారు.
నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని NZB జిల్లా జడ్జి సునీత కుంచాల, సీపీ కల్మేశ్వర్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ సౌజన్యంతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మైనర్ డ్రైవింగ్- డ్రంక్ అండ్ డ్రైవింగ్’ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.
మెదక్ కలెక్టరేట్‌లో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఈ ప్రజా పాలన సేవా కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి గతంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల లోటుపాట్లు సవరించుకోవచ్చని తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆన్లైన్‌లో వివరాలు నమోదు ప్రారంభించారు.
మెదక్ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అలాగే జిల్లాలోని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు మెదక్ ఆర్డీవో రమాదేవి తెలిపారు. ఉదయం 10:30 నుంచి 2:30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని శనివారం నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన ఆర్టీసీ ఆస్పత్రిని సందర్శించి చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడారు.

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ.లార్సన్, మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. పార్టీ సనత్‌నగర్ ఇన్‌ఛార్జ్ కోట నీలిమ, నాయకులు పాల్గొన్నారు.

Sorry, no posts matched your criteria.