Telangana

News March 26, 2024

HYD: అబద్ధాల ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి: మాజీ మంత్రి

image

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. BRS సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ను ఆయన కలిసి తన మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు, రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి సంకేతాలు లేవన్నారు. రేవంత్‌ రెడ్డి అబద్ధాల ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. ఉద్యమకారుడైన పద్మారావుగౌడ్‌‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

News March 26, 2024

పెద్దపల్లి: సరిహద్దు ప్రాంతాల్లో ALERT

image

లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సరిహద్దులో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లు ఉండటంతో మావోయిస్టు కార్యకలాపాలపై దృష్టిసారించిన సీపీ.. ఆయా ప్రాంతాల్లో మరింత బందోబస్తు ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు.

News March 26, 2024

మెదక్: స్కూల్ యూనిఫామ్స్ కుట్టు కూలీకి నిధులు..

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాంల కోసం కుట్టుకూలి ఛార్జీలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ముడి సరకును దర్జీలతో కుట్టిస్తుండగా 2023 -24 విద్యాసంవత్సరానికి కుట్టు కూలిని ఇటీవల మంజూరు చేసింది. సర్వ శిక్ష అభియాన్ నుంచి మొత్తంగా రూ.2.82 కోట్లు మంజూరయ్యాయి.

News March 26, 2024

MBNR: 2.98 లక్షల టన్నుల చెరకు కోతలు పూర్తి

image

ఉమ్మడి జిల్లాలో 8వేల ఎకరాలో 2.98 లక్షల టన్నుల చెరకు కోతలు పూర్తయినట్లు కృష్ణవేణి చెరకు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజన్న తెలిపారు. 2023-24 సీజన్‌లో కృష్ణవేణి పరిశ్రమ యాజమాన్యంతో రైతులు ఒప్పందం చేసుకుని చెరకు సాగు చేశారన్నారు. పంట కోతకు కావాల్సిన కార్మికులను, యంత్రాలను యాజమాన్యం కేన్ కమిషనర్ ఆదేశంతో ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే సీజన్కు రైతులతో గిట్టుబాటు ధర వచ్చేవిధంగా ఒప్పందం చేసుకోవాలని కోరారు.

News March 26, 2024

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..?: బండి సంజయ్

image

మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఎస్టీ సామాజికవర్గ మహిళలపై జరిగిన దాడిని ఎంపీ బండి సంజయ్ ఖండించారు. సోమవారం ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రజాకార్ల అరాచకాలను చూపిస్తే, కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరమ్మ పాలన ఎలా ఉందో చూపించాలని అనుకుంటున్నారా..? అని ధ్వజమెత్తారు. హిందువులపై దాడులు చేసిన వారిని వదిలేసి దారులకు గురైన వారిపైనే లాఠీ చార్జి చేస్తారా..? అని ప్రశ్నించారు.

News March 26, 2024

నల్గొండ: గుండెపోటుతో బస్సులోనే మృతి

image

ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. బస్సు చిట్యాల వద్దకు రాగానే అతనికి గుండెపోటు వచ్చిందని తోటి ప్రయాణికులు తెలిపారు. మృతదేహాన్ని అంబులెన్సులో హైదరాబాద్‌కి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2024

ఖమ్మం: ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ పరీక్షలు: డీఈవో

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి జరగనున్నాయని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి , ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి మే2వ తేదీ వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

News March 26, 2024

స్థానిక సంస్థలపై హస్తం ఫోకస్

image

సార్వత్రిక ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థలపై దృష్టి పెట్టింది. గత పదేళ్లుగా ఎంపీటీసీలు మొదలు జిల్లా స్థాయి చైర్మన్ల వరకు అన్ని భారాస ఖాతాలోనే ఉండటంతో.. వాటిని తిరిగి చేజిక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మూడింట రెండొంతుల పురపాలికల్లో హస్తం పార్టీ పాగా వేసింది. మిగిలిన వాటినీ లోక్ సభ ఎన్నికల్లోపే హస్తగతం చేసుకునేలా కసరత్తు చేస్తోంది

News March 26, 2024

కామారెడ్డిలో యువకుడి దారుణ హత్య

image

కామారెడ్డి మండలం రామేశ్వర్ పల్లి, ఆరేపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఈరోజు ఉదయం గుర్తించారు. అతడు సోమవారం రాత్రి హత్యకు గురైనట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2024

ఎల్బీనగర్‌: HOSTELలో యువకుడి SUICIDE

image

HYD వనస్థలిపురం PS పరిధిలో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. నెల్లూరుకు చెందిన కిరణ్ కుమార్(26) వనస్థలిపురంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. సోమవారం గదిలోకి వెళ్లిన అతడు ఎంతకూ బయటకు రాలేదు. యజమాని కిటికీలోంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.