Telangana

News September 8, 2024

బాన్సువాడ: విఘ్నేశ్వరుడికి పూజ చేసిన రాష్ట్ర ఆగ్రో ఛైర్మన్

image

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శ్రీ రామ మందిరంలో వినాయక చవితి సందర్భంగా తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్ రాజ్ విగ్నేశ్వరుడికి శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరి విజ్ఞాలు తొలగి వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి, ప్రదీప్, రమాకాంత్ పాల్గొన్నారు.

News September 7, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✔శ్రీశైలం డ్యామ్..8 గేట్ల ఎత్తివేత
✔NGKL:బొలెరో వాహనం ఢీకొని చిన్నారి మృతి
✔దౌల్తాబాద్:అప్పుడే పుట్టిన శిశువుని పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు
✔పలుచోట్ల వర్షం.. సజావుగా రాకపోకలు
✔ఉమ్మడి జిల్లాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
✔NRPT:10న అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక
✔పలుచోట్ల మట్టి విగ్రహాలు పంపిణీ
✔ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోండి:SIలు

News September 7, 2024

NZSR: స్వీయ చిత్రం మోజు.. ప్రమాదం అంచున ఫోజు..!

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన నీటిని వదిలారు. ప్రకృతి అందాలను వీక్షించేందుకు సందర్శకులు ఇక్కడికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సెల్ఫీ, ఫోటోలు తీసుకునే క్రమంలో ప్రమాదాన్ని గ్రహించడం లేదు. ఏదైనా నష్టం జరిగితే ఊహించని నష్టం వాటిల్లుతుంది. ఎలాంటి ప్రమాదం జరగక ముందే పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

News September 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

☛VMWD: మండపాన్ని సిద్ధం చేస్తున్న కూలీలకు విద్యుత్ షాక్.. ఇద్దరికీ గాయాలు ☛PDPL: ఎల్లమ్మ చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య ☛SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులు అరెస్టు ☛HZB: వినాయక మండపంలో విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి ☛HZB: భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్ ☛కోరుట్ల: విద్యుత్ షాక్ తో మహారాష్ట్ర కూలి మృతి ☛GDK: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య.

News September 7, 2024

పెద్ద‌పల్లి‌లో యువకుడి ఆత్మహత్య..

image

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లికి చెందిన జంపయ్య శనివారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినాయక చవితి పండుగ పూట ఎల్లమ్మ చెరువులో జంపయ్య దూకి ఆత్మహత్యకు పాల్పడడంతో, ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. జంపయ్య మృతికి గల కారణాలు తెలియ రాలేదు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News September 7, 2024

కరీంనగర్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం

image

తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో శనివారం పర్యటించారు. కరీంనగర్‌లోని ప్రకాశం గంజ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News September 7, 2024

గణపతి మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి

image

కరీంనగర్ ప్రకాష్ గంజ్ లో గణపతి మొదటి పూజా కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

News September 7, 2024

అధికారులను అలర్ట్ చేసిన జిల్లా కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా ఉన్న 589 మంది పంచాయితీ కార్యదర్శులు ఆయా పంచాయతీల్లో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశించారు. గ్రామపంచాయతీ పరిధిలోని వాగులు కాలువలు కల్వర్టుల దగ్గర ప్రజలు దాటకుండా ఉండేందుకు రోడ్లు బ్లాక్ చేయాలన్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. చేపల వేటకు వెళ్లకుండా ఆపాలన్నారు. ఎమ్మార్వోలు ఎంపీడీవోలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

News September 7, 2024

UPDATE: 8.75 అడుగుల వరకు చేరిన మున్నేరు నీటిమట్టం

image

ఖమ్మంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా మున్నేరువాగు వరద 7.26 గంటల వరకు 8.75 అడుగులకు చేరిందని ఖమ్మం మున్సిపల్ అధికారులు తెలిపారు. దాన్వాయిగూడెం , రమణపేట, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీ నగర్, వెంకటేశ్వర్ నగర్‌లోని మున్నేరు వెంబడి నివసించే ప్రజలను సమీపంలోని రెస్క్యూ సెంటర్‌కు వెళ్లవలసిందిగా మున్సిపల్ అధికారులు తెలిపారు..

News September 7, 2024

HYD కమిషనరేట్ చరిత్రలో రెండు సార్లు సీపీలుగా వీరే!

image

HYD సిటీ కమిషనరేట్ చరిత్రలో రెండు సార్లు సీపీగా బాధ్యతలు చేపట్టిన వారిలో హసన్ అలీ ఖాన్ మొదటి వరుసలో ఉన్నారు. తర్వాత B.N. కాలియా రావు, S.P.సాతూర్, విజయ రామారావు, ప్రభాకర్ రావు, అప్పారావు, RP సింగ్ ఉన్నారు. ఇదే కోవలోకి 2021లో HYD సీపీగా విధులు నిర్వర్తించిన CV ఆనంద్ రానున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో 2024లో మరోసారి HYDకి సీపీ కానున్నారు. 1945 నుంచి 4 ఏళ్లకు మించి సీపీగా ఎవరూ లేరు.