Telangana

News March 26, 2024

ఎల్బీనగర్‌: HOSTELలో యువకుడి SUICIDE

image

HYD వనస్థలిపురం PS పరిధిలో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. నెల్లూరుకు చెందిన కిరణ్ కుమార్(26) వనస్థలిపురంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. సోమవారం గదిలోకి వెళ్లిన అతడు ఎంతకూ బయటకు రాలేదు. యజమాని కిటికీలోంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2024

జగిత్యాల: ఈనెల 27, 28న వ్యవసాయ పరిశోధనా సమావేశాలు

image

జగిత్యాల పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 27, 28న ఉత్తర తెలంగాణ జోన్ వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశాలను నిర్వహిస్తున్నట్లు సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాస్, డిఏఓ బి. వాణి తెలిపారు. గత సీజన్లలో పంటల సాగులో తలెత్తిన సమస్యలను చర్చించి, వచ్చే సీజన్లకు చేపట్టాల్సిన పరిశోధన కార్యాచరణను రూపొందిస్తారని తెలిపారు.

News March 26, 2024

పరకాల: బాలుడి వైద్యానికి రూ.3.50 లక్షల సాయం

image

పరకాల మండలం వెంకటాపూర్‌కు చెందిన వెంకటేష్,ఆశ్విత కొడుకు మహాన్(1) తలకు కణితి అయింది. కాగా బాలుడి వైద్యానికి ఆర్థిక స్తోమత లేక ఆ తల్లిదండ్రులుకు ఇబ్బంది పడ్డారు. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా అమెరికాలో ఉంటున్న NRI మేటమర్రి కామేశ్- ప్రతిమ దంపతులు స్పందించి బాలుడి వైద్యానికి రూ.3.50 లక్షల సాయం అందించి పెద్ద మనస్సు చాటుకున్నారు. బాలుడి నిన్న డిశ్చార్జి కాగా దాతలకు పేరెంట్స్ కృతజ్ఞతలు చెప్పారు.

News March 26, 2024

సిద్దిపేట BRSలో ఏమవుతోంది?

image

BRS కంచుకోట, హరీశ్‌రావు ఇలాకా సిద్దిపేటలో రాజకీయాలు అంతుపట్టడం లేదు. BRSకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌లో చేరదామనుకునేవారు గోవా టూర్ వెళ్లి అక్కడ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్, భర్తపై అసంతృప్తిగా ఉండి అవిశ్వాస తీర్మానానికి BRS కౌన్సిలర్లు మొగ్గుచూపుతున్నారని, గోవా నుంచి రాగానే పార్టీ మారుతారని చర్చ సాగుతోంది. 

News March 26, 2024

బక్కపడుతున్న చిన్నారులు

image

ఉమ్మడి జిల్లాలో చిన్నారులు బలహీనమవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ సరైన పోషకాలు అందక బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 4, 203 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. 1, 81, 214 మంది ఆరేళ్ల లోపు చిన్నారులున్నారు.

News March 26, 2024

కరీంనగర్ మహిళా కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం 15కు పైగా సంస్థలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. టీ. శ్రీలక్ష్మి, టీఎస్సీ కోఆర్డినేటర్ డా. సీహెచ్. శోభారాణి తెలిపారు. ఇందులో భాగంగా 2021 నుంచి 2024 వరకు పీజీ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 26, 2024

MBNR: జిల్లాలో పడిపోయిన భూగర్భ జలాలు

image

ఎండలు ముదురుతున్న కొద్దీ ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గత వర్షా కాలంలో సెప్టెంబర్ తర్వాత తగినంతగా వర్షాలు లేకపోవడంతో జలాశయాలు నిండలేదు. దీంతో గ్రౌండ్ వాటర్ లేక బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. మరోవైపు ఎండ తీవ్రత పెరగడంతో పంటలకు ఎక్కువ మోతాదులో నీరు అవసరమవుతోంది. గత నెలాఖరులో భూగర్భ జలవనరుల శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా గ్రౌండ్ వాటర్ లెవల్స్ పరిశీలించగా చాలా తగ్గినట్టు తెలిపారు.

News March 26, 2024

ఫోన్ ట్యాపింగ్.. వారికి నల్గొండతో అనుబంధం

image

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎందుర్కొంటున్న నలుగురు పోలీస్ అధికారులు ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభాకర్ రావు ఉమ్మడి నల్గొండ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. తిరపతన్న యాదగిరిగుట్ట ఎస్సై, భువనగిరి సీఐగా పనిచేశారు. భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు. ప్రణీత్ రావు బీబీనగర్, పోచంపల్లి పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా పనిచేశారు.

News March 26, 2024

HYD: ఎవరీ శ్రీనివాస్ యాదవ్..?

image

BRS HYD ఎంపీ అభ్యర్థిగా స్థిరాస్తి వ్యాపారి, హైందవీ కాలేజీల ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్‌ను KCR ప్రకటించిన విషయం తెలిసిందే. 56ఏళ్ల వయసు గల ఆయన గోషామహల్‌లో ఉంటున్నారు. బీకామ్ చదివిన శ్రీనివాస్ 1989లో NSUI ఓయూ ఇన్‌ఛార్జి, NSUI నగర, రాష్ట్ర, జాతీయ కార్యదర్శిగా, 2006-2011వరకు ఉమ్మడి AP గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. 2015 నుంచి BRSలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన 2018, 2023లో గోషామహల్ టికెట్ ఆశించారు.

News March 26, 2024

వాగులో మునిగి యువకుడి మృతి

image

హోలీ ఆడిన తర్వాత రంగులు కడుక్కునేందుకు వాగులో దిగగా నీట మునిగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడేనికి చెందిన రాంబాబు, మరో ముగ్గురు యువకులు హోలీ సందర్భంగా రంగులు పూసుకున్నారు. అనంతరం రంగులు కడుక్కునేందుకు వాగులో దిగారు. రాంబాబు కాళ్లు జారి వాగులో మునిగి మృతి చెందాడు. లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.