Telangana

News March 26, 2024

HYD: ఎవరీ శ్రీనివాస్ యాదవ్..?

image

BRS HYD ఎంపీ అభ్యర్థిగా స్థిరాస్తి వ్యాపారి, హైందవీ కాలేజీల ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్‌ను KCR ప్రకటించిన విషయం తెలిసిందే. 56ఏళ్ల వయసు గల ఆయన గోషామహల్‌లో ఉంటున్నారు. బీకామ్ చదివిన శ్రీనివాస్ 1989లో NSUI ఓయూ ఇన్‌ఛార్జి, NSUI నగర, రాష్ట్ర, జాతీయ కార్యదర్శిగా, 2006-2011వరకు ఉమ్మడి AP గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. 2015 నుంచి BRSలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన 2018, 2023లో గోషామహల్ టికెట్ ఆశించారు.

News March 26, 2024

ఆదిలాబాద్‌లో పండుగ పూట 9 మంది మృతి

image

ఉమ్మడి ADB వ్యాప్తంగా హోలీ పండుగ రోజు 9మంది మృతి చెందారు. హోలీ ఆడి స్నానానికి వెళ్లిన నలుగురు వార్థా నదిలో మునిగి మృతి చెందారు. దండెపల్లిలోని గూడెం లిఫ్ట్ కాలువలో పడి కార్తీక్.. వాగులో పడి ADBకి చెందిన హర్షిత్, సారంగాపూర్‌కి చెందిన పెద్ద ఎర్రన్న మరణించారు. నిర్మల్‌కు చెందిన జాదవ్ గణేశ్ ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటుతో చనిపోగా.. బెల్లంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు.

News March 26, 2024

కామారెడ్డి చరిత్రలో తొలిసారి ‘అవిశ్వాసం’

image

కామారెడ్డి మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారి అవిశ్వాస తీర్మానానికి తెరలేచింది. ఈ నెల 30న తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఐదేళ్ల కింద BRS అధికారంలోకి రాగా ఛైర్‌పర్సన్ పదవిని అదే పార్టీకి చెందిన వ్యక్తికి కేటాయించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సభ్యులు అవిశ్వాస ప్రక్రియకు సిద్ధమయ్యారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 27 మంది, BRS నుంచి 8 మంది సభ్యులు శిబిరానికి వెళ్లినట్లు సమాచారం.

News March 26, 2024

KNR: రేపు పిఎఫ్ మీ ముంగిట కార్యక్రమం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం పిఎఫ్ మీ ముంగిట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ తానయ్య తెలిపారు. హుజరాబాద్ పెద్ద పాపయ్యపల్లి నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ డైరీలో, పెద్దపల్లి పురపాలక కార్యాలయంలో, జగిత్యాల(D) కోరుట్ల రవి బీడీ వర్క్స్ కార్యాలయంలో, సిరిసిల్ల (D) పెద్దూరు గ్రీన్ నీడిల్ లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5:45 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News March 26, 2024

28న ఓయూ వార్షిక బడ్జెట్..

image

ఓయూ వార్షిక బడ్జెట్-2024 ఈనెల 28న సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఆదాయం తగ్గి.. వ్యయం పెరిగిన తరుణంలో నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని వర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ వేతనాలు పెన్షన్‌కు సరిపోవడం లేదన్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News March 26, 2024

28న ఓయూ వార్షిక బడ్జెట్..

image

HYD ఓయూ వార్షిక బడ్జెట్-2024 ఈనెల 28న సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఆదాయం తగ్గి.. వ్యయం పెరిగిన తరుణంలో నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని వర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ వేతనాలు పెన్షన్‌కు సరిపోవడం లేదన్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News March 26, 2024

28న ఓయూ వార్షిక బడ్జెట్.. 

image

HYD ఓయూ వార్షిక బడ్జెట్-2024 ఈనెల 28న సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఆదాయం తగ్గి.. వ్యయం పెరిగిన తరుణంలో నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని వర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ వేతనాలు పెన్షన్‌కు సరిపోవడం లేదన్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News March 26, 2024

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత

image

ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు గత ఏడాది కంటే ఈ సారి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గత పది రోజులుగా జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగాల్పులు వీస్తున్నాయి. ఈ కారణంగా మధ్యాహ్న సమయంలో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోత కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు.

News March 26, 2024

నల్గొండ: ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు

image

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం అందిస్తున్న దినసరి కూలీని పెంచుతున్నట్లు పేర్కొంది. దీంతో ఉమ్మడి జిల్లాలో 7.52 లక్షల కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. 2005లో కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభించిన సమయంలో దినసరి కూలీ రూ.87.50 ఉండగా.. ప్రస్తుతం రూ.272 చెల్లిస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త కూలీ అమల్లోకి రానుంది.

News March 26, 2024

NLG: ఏడాది గడిచినా ఊసే లేదు!

image

ఉమ్మడి జిల్లాలోని గొల్ల కురుమలు గొర్రెల యూనిట్ల విషయంలో ఆందోళనలో పడ్డారు. యూనిట్ల కోసం డీడీల రూపంలో డబ్బులు చెల్లించి ఏడాది గడిచినా ఇంతవరకు అతీగతీ లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి డబ్బులు చెల్లించామని, కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు దాటిపోయినా గొర్రెలు ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తాము చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కాపరులు కోరుతున్నారు.