Telangana

News March 26, 2024

HYD: ఔటర్‌ రింగు రోడ్డుపై అద్దెకు సైకిళ్లు

image

సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు గ్రేటర్‌ HYD చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ మేర అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్‌ రూప్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ను నిర్మించారు. సొంత సైకిళ్లు లేని వారి కోసం అద్దెకు సైకిల్‌ స్టేషన్‌‌ను నార్సింగి హబ్‌లో ఏర్పాటు చేసి సుమారు 200 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. అద్దెకు ఇచ్చే సైకిల్‌కు గంటలకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News March 26, 2024

ములుగు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ములుగు మండలం జంగాలపల్లి సమీపంలోని జవహర్ నగర్ గట్టమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారి-163పై సోమవారం రాత్రి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2024

HYD: ఔటర్‌ రింగు రోడ్డుపై అద్దెకు సైకిళ్లు

image

సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు గ్రేటర్‌ HYD చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ మేర అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్‌ రూప్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ను నిర్మించారు. సొంత సైకిళ్లు లేని వారి కోసం అద్దెకు సైకిల్‌ స్టేషన్‌‌ను నార్సింగి హబ్‌లో ఏర్పాటు చేసి సుమారు 200 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. అద్దెకు ఇచ్చే సైకిల్‌కు గంటలకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News March 26, 2024

విద్యుదాఘాతంతో మహిళ మృతి 

image

హోలీ జరుపుకున్న ఆ కుటుంబంలో గంటల వ్యవధిలోనే విషాదం నెలకొంది. సింగరాయపాలెంకు చెందిన రాజశేఖర్‌, గీత(25) దంపతులు ఖమ్మంలో నివాసముంటున్నారు. కొద్ది రోజులుగా రాజశేఖర్‌ తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారు ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం సింగరాయపాలెం వచ్చారు. ఈ క్రమంలో ఉతికిన బట్టలను గీత దండెంపై ఆరవేస్తుండగా తీగకు కరెంట్‌ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై చనిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 26, 2024

జగిత్యాల: హోలీ వేళ విషాదం.. బావిలో పడి యువకుడి మృతి

image

హోలీ వేళ రాయికల్‌‌లో వ్యవసాయ బావిలో పడి యువకుడు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన నర్ర నగేశ్‌(21) తన నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం దావత్‌ కోసం ఓ మామిడితోటకు వెళ్లారు. అక్కడ బహిర్భూమికోసం బావి వద్దకు వెళ్లిన నగేశ్ తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు, పోలీసులకు స్నేహితులు చెప్పారు. అందరూ కలిసి గాలించగా బావిలో శవమై కనిపించాడు.

News March 26, 2024

MBNR: తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు మృతి!

image

తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు మృతిచెందిన ఘటన గట్టులో సోమవారం చోటుచేసుకుంది. గట్టుకు చెందిన మఠం ఆదెమ్మ(85) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. ఆదెమ్మ కుమారుడు మఠం బూదెప్ప (67) తల్లి మృతితో ఆందోళన చెంది అస్వస్థతకు గురయ్యాడు. రాయిచూర్ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 24 గంటలైనా తీరకముందే ఇంట్లో ఇరువురు మృత్యువాత పడడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది.

News March 26, 2024

నేడు రైతు నేస్తం దృశ్య శ్రవణ ప్రత్యక్ష ప్రసారం

image

ఉమ్మడి జిల్లా పరిధిలో ఎంపిక చేసిన రైతువేదికల్లో నేడు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. సమగ్ర వ్యవసాయ విధానంపై అఖిల భారత సమగ్ర వ్యవ సాయ పద్ధతుల పరిశోధన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డా.ఎం.గోవర్ధన్, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై ప్రధాన శాస్త్రవేత్తలు మెళకువలు చెబుతారు.

News March 26, 2024

ప్రభుత్వ పాఠశాలలకు రూ.91 లక్షలు మంజూరు

image

నల్గొండ జిల్లాలో 1,483 ప్రభుత్వ పాఠశాలలతో పాటు మోడల్, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటికి ఏటా స్కూల్ మెయిన్టెనెన్స్ కింద (చాక్పీసులు, డస్టర్లు , స్టేషనరీ, ఇతర వస్తువుల కొనుగోలు కోసం) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు మంజూరు చేస్తుంది. రెండేళ్లుగా ప్రభుత్వం జూలై, జనవరి నెలల్లో రెండు విడతల్లో ఈ నిధులు ఇస్తుంది. మూడు రోజుల క్రితం జిల్లాకు రూ.91 లక్షలు మంజూరు చేసింది.

News March 26, 2024

HNK: ఈనెల 27, 28న జాతీయ సదస్సు

image

హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 27, 28 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం ఇన్చార్జ్ హెడ్ డాక్టర్ మాదాసి కనకయ్య సోమవారం తెలిపారు. ‘ఫీన్టెక్ రెవల్యూషన్ రీషెపింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్ ది డిజిటల్ ఏజ్’ అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా కేయూ వీసీ తాటికొండ రమేశ్ వస్తారని అన్నారు.

News March 26, 2024

MBNR: ఇంటి నుంచే ఓటు.. ఈసీ వెసులుబాటు!

image

మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో 1,916 పోలింగ్ కేంద్రాలు ఉండగా..16,80,417 మంది ఓటర్లు ఉన్నారు.85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు 6,047 మంది, దివ్యాంగ ఓటర్లు 32,731 మంది ఉన్నారు. వీరికి పోలింగ్ రోజు ఎన్నికల సిబ్బంది ఇంటికి వచ్చి బ్యాలెట్ పేపర్‌లో ఓటు వేయిస్తారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తారు. హోం ఓటింగ్ ప్రక్రియకు ఫారం-12డీ దరఖాస్తు ఇవ్వవలసి ఉంటుంది.