India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD లోక్‌సభపై అందరి దృష్టి పడింది. దశాబ్దాలుగా ఇక్కడ MIMదే హవా. 2019 ఎన్నికల్లోనూ వార్ వన్‌సైడ్ అయింది. భగవంతరావు(BJP)పై అసదుద్దీన్(MIM) 2,82,186 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. కానీ, ప్రస్తుత రాజకీయాలు మారాయి. ఎన్నికలకు ముందు MIM, BJP, INC, BRS నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశాయి. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు మాదే గెలుపు అంటున్నారు. ఈసారి HYDలో టగ్ ఆఫ్ వార్ అని టాక్. దీనిపై మీకామెంట్?
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 4.93 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 69.01 శాతం నమోదు కాగా 2024లో 74.63 శాతం నమోదైంది. మొత్తం 16.41 లక్షలకు 12.25లక్షల మంది ఓటేశారు. ఇక్కడ 2019లో బీబీపాటిల్(BRS) 6,229 మెజార్టీతో మదన్ మోహన్ రావు(INC)పై గెలుపొందారు. కాగా ఈ ఎన్నికలో సురేశ్ షెట్కార్(INC), గాలి అనిల్ కుమార్(BRS), బీబీ పాటిల్,(BJP) బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.
వ్యక్తి ఆత్మహత్యకు కారకులైన ఇద్దరు నింధితులకు MNCL జిల్లా జడ్జి జైలు శిక్ష విధించినట్లు SI గంగారాం తెలిపారు. కన్నెపల్లికి చెందిన వెంకన్న 2019లో ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారకులైన లక్ష్మికి 5 ఏళ్లు, రాజుకు 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. వెంకన్న భార్య లక్ష్మి.. రాజుతో అక్రమ సంబంధం పెట్టుకొని అతడితో వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చేందిన వెంకన్న సూసైడ్ చేసుకున్నాడు.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 7.23 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 62.23 శాతం నమోదు కాగా ఈ ఎన్నికల్లో 69.46 శాతం నమోదైంది. ఇక్కడి నుంచి 2019లో పోతుగంటి రాములు(BRS) 1,89,748 భారీ మెజార్టీతో మల్లురవి(INC)పై గెలుపొందారు. కాగా 2024లో మల్లురవి(INC), RS ప్రవీణ్ కుమార్(BRS), పి. భరత్,(BJP), బర్రెలక్క(INDP)బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.
భువనగిరి MP సెగ్మెంట్ పరిధిలో 2019తో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో 75.11శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 76.78 శాతం నమోదైంది. 2019లో ఇక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(INC) 5,119 స్వల్ప మెజార్టీతో బూర నర్సయ్య(BRS)పై గెలుపొందారు. మరి ఈసారి కాంగ్రెస్ తరఫున చామల, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశ్ , బీజేపీ నుంచి బూర నర్సయ్య బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.
ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్ష రాసే విద్యార్థులకు రూ.1000 అపరాధ రుసుముతో 16వ తారీకు వరకు గడువు పెంచినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.
HYD కొంపల్లి సమీపంలోని దూలపల్లి ICFRE సెంట్రల్ ఫారెస్ట్ విద్యాసంస్థలో అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవంలో భాగంగా వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. మే 20వ తేదీన కాంటెస్ట్ ఉంటుందని, ఆసక్తి గలవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రథమ స్థానంలోని ముగ్గురికి సర్టిఫికెట్ అందించడంతోపాటు, వారి పేర్లను విద్యాసంస్థ బోర్డుపై ప్రదర్శిస్తామని పేర్కొన్నారు.
HYD కొంపల్లి సమీపంలోని దూలపల్లి ICFRE సెంట్రల్ ఫారెస్ట్ విద్యాసంస్థలో అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవంలో భాగంగా వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. మే 20వ తేదీన కాంటెస్ట్ ఉంటుందని, ఆసక్తి గలవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రథమ స్థానంలోని ముగ్గురికి సర్టిఫికెట్ అందించడంతోపాటు, వారి పేర్లను విద్యాసంస్థ బోర్డుపై ప్రదర్శిస్తామని పేర్కొన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో చెరువులు, వాగుల్లో చుక్క నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఉమ్మడి జిల్లాలో 18 మండలాల్లో నీటి కొరత ఏర్పడింది. వీటి పరిధిలో 50 శాతానికి పైగా బోరు బావులు ఎండిపోయాయి. మరో 11 మండలాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉంటే ఆ ప్రాంతాల్లో నీటి సమస్య ఉన్నట్టుగా పేర్కొంటారు.
సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు, ఎస్ఐలు సిబ్బందితో కలిసి గత నెల రోజుల క్రితం సిద్దిపేట పట్టణం, పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా 22 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేయగా మద్యం సేవించినట్లు రిపోర్టు వచ్చింది. వారిని బుధవారం సిద్దిపేట న్యాయమూర్తి శ్రావణి ముందు హాజరుపరచగా విచారణ చేసి 22 మందికి రూ.25,500 జరిమానా విధించారు.
Sorry, no posts matched your criteria.