Telangana

News July 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

✓వరదలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓ఇల్లెందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
✓అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News July 20, 2024

ఖమ్మం: రైతన్నలకు రుణమాఫీలు అయోమయం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఆధారంగా ఖాతాల్లో నగదు జమ అయిన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా.. అందని వారిలో అయోమయం నెలకొంది. జాబితాలో పేర్లు లేవని గుర్తించిన పలువురు పీఏసీఎస్, బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నా ఫలితం కానరావడం లేదు. మాఫీ నిబంధనలు, ప్రక్రియ గందరగోళంగా ఉండడంతోనే ఇలా జరిగిందని రైతులు ఆరోపిస్తిున్నారు.

News July 20, 2024

ఖమ్మం: రుణమాఫీ పరిష్కార విభాగం ఏర్పాటు

image

పంట రుణమాఫీపై రైతుల సందేహాలు, ఇబ్బందులు పరిష్కరించేందుకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ‘పరిష్కార విభాగాన్ని’ ఏర్పాటు చేసినట్లు డీఏఓ విజయనిర్మల శుక్రవారం తెలిపారు. రైతులు తమ సమస్యలను టోల్‌ఫ్రీ నం.1950 లేదా 90632 11298ను సంప్రదించాలని సూచించారు. పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.

News July 20, 2024

నల్గొండ: సమగ్ర సర్వేకు సిద్ధం!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏళ్లుగా రెవెన్యూ, అటవీశాఖల మధ్య భూ సరిహద్దుల్లో స్పష్టత లేకపోవడంతో దాదాపు 55 వేల ఎకరాల్లో రెండు శాఖల మధ్య ప్రస్తుతం హద్దుల వివాదం కొనసాగుతోంది. కృష్ణపట్టి ప్రాంతాలైన మఠంపల్లి, మేళ్లచెర్వు, పాలకవీడు, చింతపలపాలెం, దామెరచర్ల, పీఏపల్లి, చందంపేట, పెద్దవూరు హద్దుల తగాదా ఉంది. HYD సరిహద్దుల్లోనూ ఇదే సమస్య ఉంది. దీంతో సమగ్ర సర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు.

News July 20, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేదు: మంత్రి జూపల్లి

image

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అవినీతికి ఆస్కారం లేదని, ప్రజాప్రతినిధులు, అధికారులు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వీపనగండ్లలో వివిధ అంశాలపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. BRS పాలనలో గాడి తప్పిన వ్యవస్థను బాగు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతికి తావులేదనే సందేశం కింది స్థాయి వరకు వెళ్లాలని మంత్రి సూచించారు.

News July 20, 2024

దండేపల్లి: ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

image

దండేపల్లి మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అనిలాను సస్పెండ్ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల రికార్డులు సక్రమంగా లేకపోవడం, యూనిఫాం డబ్బులు సకాలంలో చెల్లించకపోవడం తదితర ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపి నివేదికలను రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ ఏంఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

News July 20, 2024

కరీంనగర్: పదవుల్లో జిల్లా నేతలు.. అభివృద్ధిపై గంపెడాశలు!

image

కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో జిల్లా నేతలు కీలక పదవుల్లో కొనసాగుతుండటంతో అభివృద్ధిపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. కేంద్రమంత్రిగా బండి సంజయ్, రాష్ట్ర మంత్రులుగా శ్రీధర్ బాబు, పొన్నంతో పాటు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్‌కు ప్రభుత్వ విప్ పదవులు దక్కగా జిల్లాకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

News July 20, 2024

వరంగల్: 113 మంది కానిస్టేబుళ్లు బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న 113 మంది కానిస్టేబుళ్లు కౌన్సిలింగ్ పద్దతిలో బదిలీ అయ్యారు. ఈ మేరకు వారు కమిషనరేట్ పరిధిలో ఎంపిక చేసుకున్న పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

News July 20, 2024

HYD: బోనాల ఉత్సవాలు.. సీఎస్‌ ఆదేశాలు

image

సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని CS శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించాలని సూచించారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు రెండు 500 KVట్రాన్స్‌ఫార్మర్లు, డీజిల్ జనరేటర్లను స్టాండ్‌లో ఉంచామన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంత రావు, GHMC కమిషనర్‌ ఆమ్రపాలి ఉన్నారు.

News July 20, 2024

HYD: బోనాల ఉత్సవాలు.. సీఎస్‌ ఆదేశాలు

image

సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని CS శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించాలని సూచించారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు రెండు 500 KVట్రాన్స్‌ఫార్మర్లు, డీజిల్ జనరేటర్లను స్టాండ్‌లో ఉంచామన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంత రావు, GHMC కమిషనర్‌ ఆమ్రపాలి ఉన్నారు.