Telangana

News March 25, 2024

అడుగంటిన పాలేరు రిజర్వాయర్

image

పాలేరు రిజర్వాయర్లో ప్రస్తుతం 7.45అడుగుల నీరు మాత్రమే ఉంది. ప్రతిరోజు మూడు జిల్లాలకు కలిపి 15 టీఎంసీల నీటిని నాలుగు స్కీముల ద్వారా మిషన్ భగీరథకు వినియోగిస్తున్నారు. కాగా, ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని సంబంధిత అధికారులను పాలేరు రిజర్వాయర్ అధికారులు కోరారు. ఈ నెలాఖరులోగా పాలేరు రిజర్వాయర్‌కు నీరు వచ్చే అవకాశం ఉంది.

News March 25, 2024

మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఎంపీ అభ్యర్థి వినోద్ రావు భేటీ

image

ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్ రావు మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాసేవలో నిమగ్నమైన వినోద్ రావు ఖమ్మం బరిలో ఘన విజయం సాధిస్తారని విద్యాసాగర్ రావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ.. వినోద్ రావు విజయం కోసం కృషి చేస్తామన్నారు. ఈ సారి ఖమ్మం స్థానం బీజేపీ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

News March 25, 2024

BHPL: బైకులు ఢీ.. ఒకరు మృతి 

image

రెండు బైకులు ఢీ కొని వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం గణపురం మండలం చెల్పూర్‌లో జరిగింది. పోలీసుల వివరిలిలా .. చిట్యాల మండలం జడలపేటకు చెందిన బోట్ల రమేశ్(30), గణపురం మండలం ధర్మరావుపేటకు చెందిన ప్రేమ్.. ఇద్దరు ఎదురెదురుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో అతివేగంగా ప్రయాణిస్తున్న బైకులు అదుపుతప్పి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రమేశ్ మృతిచెందారు. తీవ్రగాయాలైన ప్రేమ్‌ను వరంగల్‌MGM తరలించారు.

News March 25, 2024

MBNR: నేను ఎంపీగా గెలిస్తే ప్రాజెక్టులు పూర్తి చేస్తా : మల్లు రవి

image

తాను నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లురవి అన్నారు. సోమవారం వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ ప్రాంతం పూర్తిగా వెనుకబడిందని తాను గెలిస్తే అభివృద్ధి చేస్తానన్నారు. రైల్వే సదుపాయానికి కేంద్రంతో మాట్లాడి ఏర్పాటు చేస్తానన్నారు

News March 25, 2024

చింతకాని : అది పెద్ద పులి కాదు నక్క..!

image

ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలో గాలిబ్ సాహెబ్ అనే రైతు మొక్కజొన్న పొలంలో పంటకు నీళ్లు పెడుతుండగా పెద్దపులి కానబడిందని అక్కడి నుంచి పరుగు పెట్టి గ్రామానికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. గ్రామస్తులు పోలీసులకు, అటవిశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన అటవీశాఖ అధికారులు పెద్దపులి కాదు అని హైనా జాతికి చెందిన నక్కగా గుర్తించారు.

News March 25, 2024

సూర్యాపేట: వాహన తనిఖీలు.. బంగారం పట్టివేత

image

ఎన్నికల నేపథ్యంలో సోమవారం సూర్యాపేటలో పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న షేక్ నాగుల్ మీరా కారులో 56 గ్రాముల బంగారం, 5 కేజీల వెండి నగదును స్వాధీనం చేసుకొని FST అధికారులకు అందజేశామని రూరల్ ఎస్సై బాలు నాయక్ సోమవారం తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలని ఎస్సై సూచించారు

News March 25, 2024

కిషన్ రెడ్డితో ఖమ్మం ఎంపీ అభ్యర్థి వినోద్ రావు భేటీ

image

ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని సోమవారం హైదరాబాద్లో కలిశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉందనీ, ఖమ్మంలో వినోద్ రావును భారీ మోజార్టీతో గెలిపించాలని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలకు విస్తృత సేవ చేసేలా తనకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వినోద్ రావు కృతఙ్ఞతలు తెలిపారు.

News March 25, 2024

సిద్దిపేట: కారు కొనివ్వలేదని సూసైడ్..!

image

చేర్యాలలో సోమవారం విషాదం నెలకొంది. కారు కొనివ్వలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న నవీన్ ఇటీవల కారు కొనివ్వాలంటూ తండ్రితో గొడవపడ్డాడు. డబ్బులు జమ చేసి ఫైనాన్స్‌లో కొందామని తండ్రి నర్సింహులు సర్ది చెప్పినప్పటికీ వినిపించుకోనట్లు తెలుస్తోంది. పని మానేసిన అతడు మనస్తాపంతో అర్ధరాత్రి వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 25, 2024

ములుగు జిల్లాలో విషాదం

image

హోలీ పండుగ పూట ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురం వద్ద (రామప్పకు వెళ్ళేదారిలో) రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తిమ్మాపూర్‌కు చెందిన ఉమ్మడి ఉమేష్ (22), లక్ష్మీదేవిపేటకు చెందిన ఎంబడి శృశాంత్ (22)గా స్థానికులు గుర్తించారు.

News March 25, 2024

కొండగట్టు అంజన్న ఆలయ ఈఓ (ఇంచార్జ్)గా చంద్రశేఖర్ బాధ్యతలు

image

తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఈఓ(ఇంచార్జ్ )గా సోమవారం అసిస్టెంట్ కమిషనర్ (కరీంనగర్) చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కొండగట్టు ఈఓ టంకాశాల వెంకటేష్ సస్పెన్షన్‌కు గురికాగా, చంద్రశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ రోజు బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్‌కి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.